NewsOrbit
5th ఎస్టేట్ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

Mohan Babu: మంచు ఫ్యామిలీ 5 తప్పులు ఇవే..! మోహన్ బాబు ట్రోలింగ్స్ సీక్రెట్లు…!

Mohan Babu: ప్రస్తుతం ఇటు రాజకీయ వర్గాల్లో గానీ ఇటు సినీ వర్గాల్లో గానీ ఎక్కువగా మంచు మోహన్ బాబు కుటుంబం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఆ ట్రోల్స్ ను మోహన్ బాబు కుటుంబం సహించలేకపోతోంది. అందుకే డిజిటల్ మీడియా సంస్థల మీద, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద, ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర వాటిల్లో కంటెంట్ పోస్టు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలకు సిద్దం అవుతున్నారు. లీగల్ యాక్షన్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. దానిపై కోర్టులు ఏమి చెబుతాయి అనేది తరువాత విషయం. మోహన్ బాబు ఒక సెలబ్రిటీగా ఒక లెజండరీ స్థాయిలో ఉంటూ ఆయన ఎందుకు తప్పుకు దొరుకుతున్నారు..? ఆయన ఎందుకు ట్రోలింగ్ కు గురి అవుతున్నారు..? మంచు ఫ్యామిలీతో ఎందుకిలా సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు ..? అనేది తెలుసుకోవాలి. వాళ్లకు సంబంధించి కచ్చితంగా అయిదు తప్పులు కనబడుతున్నాయి. వాళ్లు ఎక్కడ ఏ బహిరంగ వేదిక అయినా చుట్టూ వేలాది మంది ఉన్నా సరే వాళ్లు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. ఒక వేదికపై అక్కినేని నాగేశ్వరరావు, మోహన్ బాబు ఉన్న సమయంలో అక్కినేని కంటే తానే డైలాగ్ లు బాగా చెబుతారని సెల్ప్ డబ్బా కొట్టుకున్నారు. వేరే వాళ్లు మోహన్ బాబు డైలగ్ లు బాగా చెబుతారని ఆ వేదికపై అనలేదు. దీనిపై అక్కినేని నాగేశ్వరరావు పరోక్షంగా చురకలు అంటించారు. దీన్ని బట్టి వాళ్ల కుటుంబ ఆలోచన తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Mohan Babu social media trolls
Mohan Babu social media trolls

Mohan Babu: లెజెండరీ బెస్ట్ యాక్టర్

మరో సందర్భం మా అసోసియేషన్ ఎన్నిక సందర్భంగా మంచు విష్ణుతో ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసే సమయంలో ఇండియా మొత్తం మీద లెజెండరీ బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే మోహన్ బాబు, ఇండియాలో బెస్ట్ స్టార్ అనిపించుకోవాలని అనుకున్నారు. వాళ్లంటే వాళ్లకు ఎక్కువగా ఊహాలు ఉండవచ్చు. వాళ్లను వాళ్లు ఎక్కువగా ఊహించుకోవచ్చు. ఎక్కువగా అంచనా వేసుకోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టే ప్రతి యువకుడు కూడా సచిన్ తెందుల్కర్ కంటే మించి పోవాలని అనుకుంటారు. కానీ అందరూ కాలేరు. ఏదో ఒక సందర్భంలో కెరీర్ లో పురిస్టాప్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలానే సినీ రంగానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీఆర్, చిరంజీవి మాదిరిగా స్టార్ అయిపోవాలని అనుకుంటారు కానీ ఎక్కడో ఒక చూట పురిస్టాప్ పడుతుంది. దానికి బ్యాక్ రౌండ్ ఉంది కాదా ఏదో హీరో అయిపోయి స్టార్ అయిపోవాలంటే కుదరదు. వాళ్లకు వాళ్లు ఎక్కువగా ఊహించుకుంటారు. వాళ్ల డబ్బా వాళ్లు కొట్టుకుంటారు అని సినీ వర్గాల టాక్. ఇది వాళ్ల మొదటి తప్పు, అదే ఇంటర్వ్యూ సమయంలో మంచు విష్ణు పద ఉఛ్చారణ కూడా సరిగా లేదు. కందుకూరి వీరేశలింగం పంతులు లేదా టంగుటూరి ప్రకాశం పంతులు అనే రెండు మీనింగ్ లను కలిపి మంచు విష్ణు పలికారు. ట్రోలింగ్ ఎవరూ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లు దొరికిపోతున్నారు. వాళ్లపై ట్రోలింగ్ లు చేసే వాళ్లు లేనిది ఉన్నట్లు గా ఏమి క్రియేట్ చేయడం లేదు. వాళ్లు మాట్లాడిన మాటలనే ట్రోల్ చేస్తున్నారు.

 

ఫీజు రీయింబర్స్ మెంట్ పై నాడు విద్యార్ధులతో ఆందోళన

మంచు లక్ష్మి ఎక్కడ మాట్లాడినా ఓవర్ యాక్షన్ కనబడుతోంది. మోహన్ బాబు ఇటీవల సినీ వేడుకల మీద ఎవరిని పడితే వాళ్లను ర్యాగింగ్ చేయడం, అదే క్రమంలో సునీల్ ను అలా చెప్పావు ఇలా చెప్పావు అంటూ ర్యాగింగ్ చేశారు. ఎదుటి వాళ్లను ఆడుకోవాలని వీళ్లలోని అహాన్ని బయట పెట్టుకుంటారు. వీళ్లు ప్రధానంగా ట్రోల్ కావడానికి కారణం వాళ్లలో ఉన్న అహంకారం. పేరు ప్రఖ్యాతుల వల్ల వచ్చిన అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తుందని అంటుంటారు. ఎదుటి వాళ్లు ఎంతటి పెద్ద వాళ్లు అయినా వాళ్లకంటే తామే పెద్ద వాళ్లుగా ఊహించుకోవడం. వాటితో పాటు నిలకడ లేని రాజకీయ రంగుల మార్పిడి. ఎన్టీఆర్ మా అన్నగారు అంటారు ఒకసారి, మరో సారి చంద్రబాబు మా బంధువు అంటారు. అదే సందర్భంలో జగన్ మా బంధువు అంటారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదని కాలేజీ విద్యార్ధులతో ఎండలో దర్నా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండేళ్ల వరకూ ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు ఇవ్వలేదు., అయినా ఏ ఒక్క విద్యార్ధి చేత ధర్నా ఎందుకు చేయించలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ను నేరుగా విద్యార్ధుల తల్లిదండ్రులకు ఇస్తుంది తప్ప కాలేజీలకు ఇవ్వడం లేదు. దీనిపై ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు. ఇదీ ఆయన చేస్తున్న తప్పే.

 

హీరోగా, విలన్ గా, నిర్మాతగా సక్సెస్ కానీ..

మా అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉంటూ సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నా ఎక్కడా మాట్లాడలేదు. వాళ్లకు ప్రభుత్వం నుండి ఆహ్వానం ఉండదు. వీళ్లు ప్రభుత్వంతో మాట్లాడరు. అటువంటప్పుడు వీళ్లకు ఆ పదవి ఎందుకు. ఆయనకు ఆ పదవి ఉన్నందుకు స్వతహాగా కల్పించుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. మీడియా ముందుకు వచ్చి అవిఇవీ మాట్లాడుతూ వాళ్లంతట వాళ్లు దొరికిపోతున్నారు. వాళ్లను వేరే వాళ్లు విమర్శించాల్సిన పని లేదు. వాళ్లకు వాళ్లే ట్రోల్స్ చేసే లాగా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు. వాళ్ల పరువు వేరే వాళ్లు తీయాల్సిన అవసరం లేదు. వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారు. అందుకే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. వాస్తవానికి మోహన్ బాబు ఒక బ్రిలియంట్ యాక్టర్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక బ్లిలియంట్ ప్రొడ్యూసర్, హీరోగా, విలన్ గా, నిర్మాతగా సక్సెస్ ఓవరాల్ గా మంచి నటుడుగా సక్సెస్. కానీ ఆయన వయసు పెరిగే కొద్దీ పరిపక్వత రావాల్సింది కాస్తా అపరిపక్వతకు వెళ్లిపోయి అతిశయోక్తులు, సెల్ప్ డబ్బా తదితర కారణాల వల్ల విలువలు, వ్యక్తిత్వం కోల్పోయారు అని అందుకే ట్రోలింగ్ జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju