NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

ఇది ఏపి రాజకీయాలకు సంబంధించి ఒక బ్రేకింగ్, సెన్ఫేషనల్ న్యూస్. రాజకీయాల్లో గానీ సినీ రంగంలో గానీ ఒక నిలకడ అంటూ లేక దొరికిన వాళ్లందరితో శతృత్వం పెట్టుకుని కనిపించిన వాళ్లందరిపై పెత్తనం చెలాయించాలని చూసి వాళ్లను బ్లేమ్ చేయాలని వాళ్లను చిన్న బుచ్చాలని చూసి వీళ్లే చిన్న బోతు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న ఫ్యామిలీ ఎవరో అందరికీ తెలుసు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. అటువంటి మోహన్ బాబు ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఇదే ఇప్పుడు సెన్షేషన్ బ్రేకింగ్ న్యూస్. మోహన్ బాబు ఇప్పుడు చంద్రబాబును ఎందుకు కలిశారా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. వాస్తవానికి చంద్రబాబును మోహన్ బాబు కలిస్తే పెద్ద వార్తేమీ కాదు. ఎందుకంటే ..చంద్రబాబుతో బందుత్వం ఉంది. ఒకే జిల్లాకు చెందిన వారు. ఒకే పార్టీలో కలిసి పని చేశారు. స్నేహం ఉంది.  అయితే చాలా కాలంగా టీడీపీ, చంద్రబాబుకు దూరంగా వైసీపీకి దగ్గర అయిన మోహన్ బాబు ఈ రోజు తన కుమార్తె ను వెంట బెట్టుకుని చంద్రబాబుతో భేటీ కావడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 

కీలక సమయంలో చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి..

ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత మోహన్ బాబును రాజకీయాల్లోకి తీసుకువచ్చి 1996 లో రాజ్యసభ సభ్యుడిని చేశారు. అప్పటికే టీడీపీలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు.  అయినప్పటికీ మోహన్ బాబు రాజ్యసభ సభ్వత్వానికి చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. ఆ తరువాత పరిటాల రవి, మోహన్ బాబు లు శ్రీరాములయ్య షూటింగ్ సమయంలో కారులో వెళుతుండగా జ్యూబ్లీహిల్స్ లో కారు బాంబు పేలుళ్లలో మోహన్ బాబు, పరిటాల రవి బయటపడగా, కొందరు జర్నలిస్ట్ లు మరి కొందరు మృతి చెందారు, ఆ సందర్భంలో మోహన్ బాబు ఆసుపత్రిలో ఉండి చంద్రబాబుపైనే ఆరోపణలు చేశారు. తనను హత్య చేయడానికి చంద్రబాబు ఇది చేయించాడు అంటూ ఆరోపణ చేయగా, దాన్ని పరిటాల రవి ఖండించారు. ఇది తన శత్రువుల పని అని ఆనాడు పేర్కొన్నారు. మోహన్ బాబు పిచ్చివాగుడు  వాగుతున్నాడంటూ పరిటాల రవి ఖండించారు. ఈ క్రమంలో చంద్రబాబుతో మోహన్ బాబుకు విభేదాలు వచ్చాయి. ఆ తరువాత చంద్రబాబుతో కొన్నాళ్లు దగ్గరగా, కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యపై చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోహన్ బాబు ఆందోళన చేశారు. ఆ తరువాత కొద్ది రోజులకే వైఎస్ జగన్ ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ తరుపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబు అనుకున్న గౌరవం పార్టీ లో దక్కలేదు. దీంతో వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆరు నెలల క్రితం ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి మోడీని కలిశారు. మోడీ పాలనను మెచ్చుకుంటూ ఇటీవల స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రబాబును కలిశారు మోహన్ బాబు. అయితే ప్రస్తుతం సినీ ఇండ్రస్టీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆగస్టు ఒకటవ తేదీ నుండి షూటింగ్ లను తాత్కాలికంగా నిలిపివేయాలని అనుకుంటున్నారు. అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు రాజకీయంగా మోహన్ బాబుకు ప్రస్తుతం విలువలేకుండా అయ్యింది. ఈ తరుణంలో మోహన్ బాబు చంద్రబాబుతో బేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. అయితే చంద్రబాబుతో భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు సినీ రంగ సమస్యలపైనా చర్చించి ఉండవచ్చని భావిస్తున్నారు.

 

ఈ ఇద్దరిలో చంద్రబాబుకైనా కాస్త బుద్ది ఉండాలి. లేదా మోహన్ బాబుకైనా సిగ్గుండాలి. వీళ్లు ఇద్దరూ కూడా 70 ఏళ్ల పైబడిన వాళ్లే. శతృత్వమైనా, స్నేహమైనా, ఫ్యామిలీ పరంగా, రాజకీయ పరంగా నిలకడగా ఉండాలి. కానీ ఇద్దరిలో అది లోపించినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుకు అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో మోహన్ బాబు హ్యాండ్ ఇచ్చి నానా రాద్ధాంతం చేసి జగన్ పంచన చేరారు. జగన్ దగ్గర కూడా సిన్సియర్ గా పని చేయకుండా జగన్ వద్ద ఏదో ఆశించి బొక్క బోర్లా పడి మళ్లీ ఇప్పుడు చంద్రబాబుకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సో.. మోహన్ బాబును ప్రోత్సహించడానికి చంద్రబాబుకైనా ఆ పెద్దరికం తగ్గట్టు బుద్ది ఉండాలని టీడీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక మోహన్ బాబు సంగతి అంటే సరేసరి. ఆయనకు రాజకీయంగా స్థిరం లేదు. మాటకు స్థిరత్వం లేదు అనేది టీడీపీ వాదన. అయితే ఇద్దరిలో ఉన్న కమ్మతనం ఇద్దరినీ కలిపిందేమో..! అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి.

 

 

author avatar
Special Bureau

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju