NewsOrbit
5th ఎస్టేట్ Featured

స్వామి సొమ్ము స్వాహాయ..? టీటీడీలో సంచలన నిజాలు..! (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక కథనం)

తిరుమల నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక ప్రతినిధి 

టీటీడీలో సొమ్ము మింగేసారా…? స్వామి సొమ్ము స్వాహా చేశారా..? టీడీపీ పాలనలో టీటీడీలో ఏం జరిగింది..?? ఎన్ని కోట్లు సొత్తు అక్రమాలకూ గురయ్యింది..? లేదు అవినీతి ఏం జరగకపోయినా ఉత్తుత్తి ఆరోపణలేనా..?? టీటీడీలో అక్రమాలు, కాగ్ ఆడిట్.., బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ అంశాలపై “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక కథనం..!!

2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగిన అవకతవకలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో విచారణ జరిపించాలని హై కోర్టులో సత్యపాల్ సబర్వాల్ తో కలిసి భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిల్ దాఖలు చేసినట్లు ఆయనే స్వయంగా చెప్పారు. టిడిపి ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆలయ రాబడి, నిధుల వినియోగం, ఖర్చులు, నిర్ణయాలు పిన్ టు పిన్ క్లీన్ గా తనిఖీ చేసి.. విచారణ చేయాలనీ పిటిషనర్లు కోరారు.. రాష్ట్ర ప్రభుత్వ ఆడిటర్లు లేదా టిటిడి సంబంధించిన ప్రైవేట్ ఆడిటర్లు కంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే కాగ్ దీనిమీద సునిశిత పరిశీలన చేస్తుందని వారితోనే విచారణ చేయించాలని కోర్టుకు విన్నవించారు.. దీంతో ఆ ఐదేళ్లలో జరిగిన అక్రమ, అవినీతి బాగోతాలన్ని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్యంగా టిటిడి నిధులను తెదేపా నేతలు దోచుకున్న తీరు అప్పట్లోనే వివాదాస్పదమయ్యింది. అనేక ఆరోపణలు వచ్చాయి..! దీనికితోడు ఆలయంలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వరకు తమ తమ పరిధిలో అవినీతి తంతాగం నడిపించారని ఆరోపణలు ఉన్నాయి.

 

ఏకంగా 11 కేసులు నమోదు..!!

2017లో చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తరువాత సుమారు సంవత్సరానికి పైగా పాలకమండలి ఖాళీగా ఉంది. ముఖ్యంగా తమిళనాడుకి చెందిన కొందరు తెదేపా నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. ఇష్టానుసారం టిటిడి నిధులను దుర్వినియోగం చేసేలా ఉత్తర్వులను అధికారులు సాయంతో ఇచ్చుకున్నారు. వారికి అవసరమైన పనులకు టీటీడీ నిధులు ఇవ్వడంతో వాటి దుర్వినియోగంపై హైకోర్టులో తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి 11 కేసులు వేశారు. అన్నికేసుల్లోనూ పిటిషనర్ వాదనను సమర్థిస్తూ నే హైకోర్టు వ్యాఖ్యలు చేయడం.., టీటీడీ అధికారులను ప్రతిసారి మందలించడం అప్పట్లో జరిగిన అవినీతి తంతుకు పరాకాష్ట.

తిరుమల దేశానికీ సర్వం రాజు గారే…!!

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుత్తూరు కు చెందిన గ్రూప్ వన్ స్థాయి పోస్ట్ నుంచి ఐఏఎస్ గా కంఫర్ట్ అయిన ఓ అధికారిని ఆయన కావాలని రెండో సారి తిరుమల తిరుపతి దేవస్థానం జె ఈ ఓ గా కావాలని తెచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ఆయన తర్వాత టీటీడీలో అంతా తానే అయ్యి చక్రం తిప్పారు. ఒకసారి జే ఈ ఓ గా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం దగ్గర నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఆయన హావా సాగింది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కనీసం తిరుమలలో ఆయనకు అతిథి గృహం కూడా కేటాయించని ఆ జె ఈ ఓ… బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తలలో నాలుకలా వ్యవహరించారు. బాబుతో పాటూ ఆ పార్టీ నేతలకు బాకా ఓడారు. ఈ క్రమంలోనే కిందిస్థాయి అటెండర్ నుంచి పై స్థాయి వరకు ఆయన మాట చెల్లుబాటు అయింది. సుమారు రెండేళ్ల పాటు తిరుమలలో అప్రతిహతంగా ఆయన హవా సాగింది. ఢిల్లీ నుంచి వీఐపీలు వివిఐపిలు ఎవరొచ్చినా దగ్గరుండి సకలం చూసుకునే ఆయన తెదేపా నేతలకు కావాల్సిన మిగిలిన పనులు దగ్గరుండి చూసేవారు.. దీంతో ఆయనను ఈ ఓ లు సైతం కదిలించడానికి కూడా భయపడేవారు. తనకు ఇష్టమైన వారు తనకు కావలసిన వారికి అన్ని కాంట్రాక్టులు కట్టబెడుతూ ఇష్టానుసారం శ్రీవారి నిధులను దుబారా చేయడంలో సదరు అధికారి ప్రమేయం కూడా ఉందనేది కాదనలేని వాస్తవం.

ఎన్నో ఎన్నెన్నో లీలలు.!!!

టిటిడి నిధులు ఒక్క రూపాయి కూడా మేము సొంతానికి వాడుకునే లేదని దుబారా చేయలేదని తెదేపా నేతలు చెబుతున్నా… క్షేత్ర స్థాయిలో జరిగిన అవినీతిని చూస్తే, గతంలో బయటకు వచ్చిన పలు అంశాలను పరిశీలిస్తే టీటీడీ నిధులు కొంతమేర పక్కదారి పట్టాయో అర్థమవుతుంది…….. !
1. టీటీడీకి చెందిన 12 కోట్ల నిధులను తుడా పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించారు.. ఈ కాంట్రాక్టును తెదేపాకు చెందిన స్థానిక నేత నామినేషన్ పద్ధతిలో దక్కించుకోవడానికి ప్రయత్నించారు హైకోర్టులో కేసు దాఖలైంది దీంతో టిటిడి నిధులను వెనక్కి తీసుకుంది. దీన్నేమంటారు..?

2. టీటీడీ భారంగా ఉన్న కళ్యాణ మండపాలు రద్దు చేయాల్సింది పోయి మరికొన్ని కళ్యాణ మండపాలు కట్టేందుకు అంగీకారం తెలిపారు. దీనికి సుమారు 700 కోట్లు కేటాయించారు. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో దివంగత స్పీకర్ కోడెల శివప్రసాదరావు రూపాయికి కళ్యాణ మండపం ఇవ్వడంపెద్ద సంచలనమైంది.

3. టీటీడీ అనుబంధ ఆస్పత్రిగా ఉన్న స్విమ్స్ ఆసుపత్రికి ఏటా రూ 20 కోట్ల నిధులు ఇచ్చేది.. ఆస్పత్రిలో సర్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కు సమీప బంధువైన ఓ వ్యక్తి ఆధీనంలోనే ఉండేది. మందుల కొనుగోళ్లు పరికరాల కొనుగోళ్లు వైద్యుల పదోన్నతులు సిబ్బంది బాగోగులు కాంట్రాక్టులు మొత్తం ఆయన కనుసన్నల్లో జరిగేవి. భారీ మొత్తంలో కమిషన్లు చేతులు మారేవాణి అనేక ఆరోపణలు ఉన్నాయి.

4 .SVBC ఛానల్ లో రూ రెండు కోట్లకు పైగా అవినీతి జరిగిందని టిటిడి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అప్పటి అధికారి నరసింహారావు టిటిడి బదిలీ చేసి చేతులు దులుపుకుంది. కానీ ఆ డబ్బు ఎలా రికవరీ చేయాలి అనేది మాత్రం ఆలోచించలేదు.
5. తిరుమలకు వచ్చే పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి మిగిలిన ఎలాంటి పాల ఉత్పత్తి అయిన హెరిటేజ్ కు అప్పట్లో కేటాయించినట్లు విమర్శలు వచ్చాయి. స్వామివారి ఆనంద నిలయంలో వెలిగించే దీపాలు సైతం కల్తీ గా ఉన్నాయని ప్రధాన క్షేత్రం అర్చకులు రమణదీక్షితులు అప్పట్లోనే సంచలన ఆరోపణలు చేశారు.
6 . తిరుమల పైన నిర్మిస్తున్న అవుటర్ రింగ్ రోడ్డు పెద్ద అవినీతి బాగోతం గా తయారైంది.. అప్పటి టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనిఖీలో నిర్మాణానికి వాడుతున్న సామాగ్రి అత్యంత నాసిరకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఆ తీరు మారలేదు. రూ 140 కోట్ల ఈ ఈ రోడ్డు నిర్మాణంలో అడుగడుగునా అవినీతి ఉందని అప్పట్లోనే తేలింది.

7.. టిటిడి నిర్వహిస్తున్న బదిలీల శ్రవణం ప్రాజెక్టు లో రూ 12 కోట్ల మేర అవినీతి జరిగినట్టు టిటిడి విజిలెన్స్ అధికారి నివేదిక ఇచ్చారు. అయితే అది తెదేపా నేతలకు సంబంధించిన వారిని కావడంతో ఆ నివేదికను చెత్తబుట్టలో పడేసారు. దీంతో పాటు గతంలో ఎస్విబిసి అవినీతిలో ఓ సినీ దర్శకుడికి సంబంధం ఉందని సదరు అధికారి ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసి మళ్లీ అదే దర్శకుణ్ణి ఎస్వీబీసీ కు తీసుకురావడంతో నిజాయితీ గల అధికారి గా పేరున్న ఆయన మనస్తాపం చెంది కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.
8 ప్రైవేట్ బ్యాంకులు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి కొందరు తెదేపా నేతలు టిడిపికి చెందిన స్వామివారి డిపాజిట్లను ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టేందుకు అంగీకారం తెలిపారు. సుమారు రూ. 400 కోట్లు పైగా ప్రైవేటు బ్యాంకుల్లో వేసేందుకు భారీగా కమిషన్లు మాట్లాడుకున్నారు. ఇది అప్పట్లో ఓ సంచలనం అయింది. తర్వాత కొంతమేర వెనక్కి తగ్గిన ఇంకా ప్రైవేట్ బ్యాంకు లోనే స్వామి వారి ఆస్తులు ఉన్నాయి.

9 . ఎన్నికలకు ముందు సుమారు 1341 కేజీల స్వామివారి బంగారాన్ని ఎలాంటి భద్రత లేకుండా స్విజర్లాండ్ నుంచి చెన్నై మీదుగా తీసుకురావడం జరిగింది. ఎన్నికల తనిఖీల్లో భాగంగా చెన్నై పోలీసులకు దొరికిన ఈ బంగారం మొదట స్వామి వారికి కాదని తర్వాత.. తమదే నని టీటీడీ ఉన్నతాధికారులు రకరకాల మాటలు చెప్పడం దీనిలో అనుమానాలకు తావిచ్చింది… యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడువు తీరిన బంగారాన్ని తీసుకొస్తున్నామని అధికారులు చెప్పిన ఎలాంటి భద్రత లేకుండా ఓ ప్రైవేటు వాహనంలో బంగారాన్ని తరలించడం.. దీని వెనుక కొందరు తెదేపా నేతలు పేర్లు బయటకు రావడం అప్పట్లోనే పెద్ద విషయం అయింది.

10 ..ఘాట్ రోడ్డులో మరో రోడ్డు నిర్మిస్తామని కేవలం సర్వేకు రూ 20 కోట్లను ఇవ్వడం దానిలో భారీగా కమిషన్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.. 11. 2017 డిసెంబర్ లో టైం స్లాట్ దర్శనం ట్రైన్ కు కేవలం పన్నెండు కోట్లను ఖర్చు పెట్టడం విశేషం ఈ కర్చు లో చాలావరకు దాతలే ఉచితంగా అందించిన ఖర్చులు మాత్రం భారీగా పెట్టారు….. ఇలా తవ్వుకుంటూ పోతే ఎన్నో కనిపిస్తాయి.. పిల్ ను కోర్ట్ ఆమోదించి… విచారణ కు ఆదేశిస్తే ఇంకెన్నో కొత్త విషయాలు… అవినీతి తంతులు బయటకు వస్తాయి అని చెప్పడం లో సందేహం లేదు.

author avatar
Srinivas Manem

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau