NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

అతి మతి @ అమరావతి..! జస్టిస్ కూడా అందుకు సాక్ష్యం..!!

అమరావతి ఉద్యమం ఏడాది దాటింది..! అందులో నిజమైన రైతుల ఆవేదన వర్ణనాతీతం. అందులో నిజమైన త్యాగధనుల బాధ తీర్చలేనిది..! ఉద్యమం బాగుంది. చక్కగా “సా…గు”తుంది. నిరంతరాయంగా.., నిర్విశ్రాంతంగా.., నిష్కులంగా జరుగుతుంది..! కానీ ఒక్కటే రాష్ట్ర సగటు మనిషి డౌట్..! రాజధాని అంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించినది.., కానీ కేవలం అమరావతిలో మాత్రమే ఉద్యమం ఎందుకు జరుగుతుంది..!? అయితే దీనికి సమాధానాలు అందులో కొందరికి.., రాష్ట్ర ప్రభుత్వంలో కొందరికి.., ఒకరకంగా చంద్రబాబుకీ, జగన్ కి కూడా తెలుసు. అందుకే జగన్ సీరియస్ తీసుకోవడం లేదు, చంద్రబాబు ఆపడం లేదు..! ఇక అసలు విషయానికి వస్తే అమరావతిలో “అతి మతి” గురించి ఓ సారి చెప్పుకోవాలి..!

ఒక జస్టిస్ రిటైర్ అయ్యారు. న్యాయ కోవిదులు, సహచరులు, న్యాయవాదులు, సిబ్బంది సత్కరిస్తారు.., పొగుడుతారు.. అది అతి సహజం. కానీ ఈ అమరావతి మహిళలకు ఏం సంబంధం..!? “జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ సందర్భంగా ఈరోజు అమరావతిలో జరిగిన కొన్ని సన్ని”వేషాలు” కచ్చితంగా అనుమానాలు కలిగించేవే..! “జస్టిస్ రాకేష్ కుమార్ కి అమరావతి రైతులు, మహిళలు ఘనమైన వీడ్కోలు అందించారు. ‘లాంగ్ లీవ్ రాకేష్ కుమార్, గాడ్ ఆఫ్ జస్టిస్ రాకేష్ కుమార’ అంటూ నినాదాలు చేసారు. ఆయన వీడ్కోలు సమయంలో కొందరు మహిళలు కన్నీరు పెట్టుకోగా, వారిని చూసి జస్టిస్ రాకేష్ కుమార్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.

జస్టిస్ కి వాళ్లకి ఏంటి సంబంధం..!?

జస్టిస్ రాకేష్ కుమార్ ఏమి అమరావతి కేసులో విచారించలేదు. అమరావతి ఉద్యమానికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. అమరావతి ఉద్యమంలో కూర్చోలేదు. వృత్తిపరంగా ఆయన అమరావతి ఉద్యమానికి చేసిందేమి లేదు. కొన్ని సందర్భాల్లో.., కొన్ని కేసుల్లో ఆయన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, తీర్పు ఇచ్చారు. అంతే తప్ప అమరావతికి ఆయన చేసిందేమి లేదు. కానీ ఈరోజు అంత సన్నివేశం జరగాల్సిన అవసరం ఏముంది..? మహిళలు ఆయనను చూసి కన్నీరు పెట్టుకోవడం ఏమిటి..? ఆయన భావోద్వేగానికి గురవ్వడం ఏమిటి..? ఒక సినిమాటిక్ గా కొన్ని సీన్స్ సృష్టించి సోషల్ మీడియాల్లో వదలడం ఏమిటి..? అందుకే దీన్ని అతిమతి @ అమరావతి అనుకోవాల్సిందే.

మొదటి నుండి అంతే..!!

అమరావతిలో ఉద్యమం నిజానికి దేశ చరిత్రలో నిలిచిపోవాలి. ఒక అంశం కోసం, ఒక లక్ష్యం కోసం ఏడాదికిపైగా రైతులు, మహిళలు ఉద్యమం చేస్తున్నారంటే దేశ చరిత్రలో లిఖించదగిన పరిణామమే..! కానీ ఉద్యమ తీరు సక్రమంగా లేదు. ఎన్నో కోణాలు, ఎన్నో చిత్రాలు, ఎన్నో వేషాలు, ఎన్నో సినిమాటిక్ డ్రామాలు..! అందుకే దేశం కాదు కదా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కూడా దీని అంత సీరియస్ గా తీసుకోలేదా. ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంటుంది, వైసీపీ నేతలు చులకనగా మాట్లాడుతున్నారు అంటే ఇవే కారణాలు. కేవలం ఒక పార్టీ గొడుగు కింద.. కొందరు నాయకుల డైరెక్షన్లో జరుగుతుంది అంటున్న వైసీపీ ఆరోపణలకు బలాన్నిచ్చేలా ఇటువంటి సినిమాటిక్ డ్రామాలు ఎన్నో ఉన్నాయి. అందుకే అతిమతి @ అమరావతి !!

* రాష్ట్ర కీలక అంశం రాజధాని కోసం ఏడాదిగా జరుగుతున్న ఉద్యమం ఎందుకు రాష్ట్రం మొత్తం పాకలేదు..? ఏడాది పూర్తయిన సందర్భంగానూ సభలో రాజకీయ నేత, రాజకీయ ప్రసంగాలు తప్ప
వారి ఆవేదన, వారి కోరిక, తపన తెలియజేసే ప్రయత్నాలే లేవు.
* కొన్ని బలమైన మీడియా (ఈనాడు – ఈటివి, ఏబీఎన్- ఆంధ్రజ్యోతి, టీవీ 5 ) మద్దతు ఉన్నా కూడా దేశంలో, కనీసం రాష్ట్రంలో పక్క జిల్లాల్లో కూడా మద్దతు ఎందుకు కూడగట్టుకోలేదు. కేవలం టీడీపీ గొడుగు ఉన్న కొందరు నేతలే “అమరావతి పరిరక్షణ సమితి”గా ఏర్పడి నామమాత్రంగా ఇటీవల ర్యాలీలు చేసారు.
* సీఎం జగన్ ఆ దారిలో వెళ్తుంటే ఎందుకు ఛీత్కారాలు ఇవ్వాలి..? జస్టిస్ లు ఆదారిలో వెళ్తుంటే ఎందుకు భజనలు చేయాలి..? రాజ్యాంగ బద్ధమైన కోరికతో ఉద్యమం చేస్తున్నప్పుడు ఈ డ్రామాలు, ఈ అతిమతి ఉపయోగించడం ఎందుకు..? అందుకే ఈరోజే జరిగిన ఘటనలకు అమరావతి ఉద్యమంలో జరుగుతున్నా అతికి, జస్టిస్ కూడా సాక్ష్యం.

 

 

 

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju