NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: వైసీపీపై పంచులు – టీడీపీకి సిగ్నళ్లు..! బీజేపీకి కీలక అంశమే..!

Pawan Kalyan: జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేదికపై పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతారు.. ? పార్టీలో ఏవరైనా చేరుతున్నారా..?  పొత్తుల మీద ఏమైనా ప్రకటన చేస్తారా..? వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడతారా..? వ్యతిరేకంగా మాట్లాడతారా.. ? టీడీపీ పై ఆయన ఉద్దేశాలు ఏమిటి..? ఇలా సమకాలీన రాజకీయ అంశాలపై పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతారు అని చాలా మంది ఎదురు చూశారు. కొన్ని అంశాలు ఆయన స్పష్టంగా చెప్పారు. టీడీపీ – జనసేన పొత్తులపై పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారే తప్ప డైరెక్ట్ గా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడారు…? ఎందుకు ఆయన పరోక్షంగా చెప్పారు..? డైరెక్ట్ గా ఎందుకు చెప్పలేకపోయారు..? అనేది తెలుసుకుందాం..

Pawan Kalyan political strategy
Pawan Kalyan political strategy

Read More: Janasena: సంక్రాంతి తరువాత అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న పవన్ కళ్యాణ్..?

Pawan Kalyan: వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వను

పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మొదటి నుండి చివరి వరకూ వైసీపీ తప్పులను ఎత్తిచూపారు. ఇసుక పాలసీ తప్పు, మద్యం విధానం తప్పు, తరువాత అవినీతి, రాజధాని, పోలవరం ఇలా వైసీపీ చేస్తున్న అన్ని తప్పులను పవన్ కళ్యాణ్ ఎత్తిచూపారు. ముగింపు సమయంలో రాజకీయంగా కీలకమైన విషయం చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వను అన్నారు. అంటే వైసీపీ వ్యతిరేకంగా ఉన్న శక్తి మొదటి శక్తి టీడీపీ, రెండవ శక్తి జనసేన. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిస్తే ఈ రెండు పార్టీలే చీల్చాలి. బీజేపీకి రాష్ట్రంలో అంత సీన్ లేదు అన్నది అందరికీ తెలిసిందే. అదే విధంగా వామపక్షాలు, కాంగ్రెస్ పరిస్థితి. చీల్చనివ్వను అన్నారు అంటే ఈ రెండు పార్టీలు కలుస్తాయనేది అర్ధం. అంతకు మించి క్లీయర్ గా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే అందరికీ అర్ధమయ్యేలా పొత్తుల విషయం చెబితే..వీళ్ల రాజకీయ వ్యూహాలు, స్ట్రాటజీలు వాళ్లకు (వైసీపీ) అర్ధమయిపోతాయి. వైసీపీ అధికారంలో ఉంది. వాళ్ల మైండ్ చాలా షార్ప్ గా ఉంటుంది. వీళ్లు బలాలు, బలహీనతలపై రకరకాల వ్యూహాలను ప్రయోగిస్తారు. దాన్ని వీళ్లు తట్టుకోవచ్చు. తట్టుకోలేకపోవచ్చు. అందుకే పొత్తుల విషయంపై ఏ రాజకీయ పార్టీ ముందుగానే ప్రకటన చేయవు. ఎన్నికలకు నెలా లేదా రెండు మూడు నెలల ముందు చేస్తాయి.  ఈ రెండు పార్టీలు అదే వ్యూహంతో ఉన్నాయి అని చెప్పవచ్చు.

Read More: TDP – Janasena: పొత్తు ఖరారు..! టీడీపీ – జనసేన .. వామపక్షాలు..! జనవరి నుండి మూకుమ్మడి పోరాటాలు..!?

Pawan Kalyan: బీజేపీ రోడ్ మ్యాప్

బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని తాను గద్దె దించుతాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నారు. ఇది కీలకమైన పాయింట్. బీజేపీ రోడ్ మ్యాప్ అంటే ఒక ప్రణాళిక, వ్యూహం. ఇప్పుడు బీజేపీతో పొత్తు అయితే ఉంది. మరో పక్క వైసీపీతో బీజేపీకి అనదికార పొత్తు ఉంది. ఇది అందరికీ తెలుసు. రోడ్డు మ్యాప్ అంటే బీజేపీ వైసీపీని బద్దశత్రువుగా చూడటానికి జనసేనతో ఫ్రీ హ్యాండ్ గా పూర్తిగా కలిస్తే అవసరమైతే టీడీపీని కలుపుకునే ప్రయత్నం చేస్తే ఈ మూడు కలిసి నడిస్తే వైసీపీని దించవచ్చు అన్న సిగ్నల్ ఇచ్చారు. ఈ పక్షాలతో బీజేపీ కలవకపోతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఈ రెండు శక్తులు కలుస్తాయి. బీజేపీతో ఫ్లెండ్లీ పోటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై చాలా క్లారిటీతో ఉన్నారు.

Pawan Kalyan: టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేయకుండా..

టీడీపీ – జనసేన పొత్తు ఉండటం ఖాయమని “న్యూస్ ఆర్బిట్” గతంలోనే కథనాలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో అంతరార్ధం తీసుకుంటే వైసీపీకి వ్యతిరేకంగా అనేక పంచ్ లు వేశారు. టీడీపీకి పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చారు. ఇదే సందర్భంలో టీడీపీ ఎంపికి చెందిన అమర్ రాజా బ్యాటరీస్ కి జరిగిన అన్యాయాన్ని లేవనెత్తారు. టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కియా కార్ల పరిశ్రమ గురించి ప్రస్తావించారు. అలానే రాజధాని రైతుల విషయంలో చంద్రబాబు చేసిన విషయాన్ని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. చంద్రబాబును, టీడీపీని ఒక్క విమర్శ కూడా పవన్ కళ్యాణ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ మూడో పక్షంగా ఉన్నట్లయితే అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని విమర్శించాలి. కానీ అలా మాట్లాడలేదు అంటే వాళ్ల వ్యూహం అర్ధం చేసుకోవచ్చు. సీఎం ఎవరు.. ఎవరు ఎన్ని సంవత్సరాలు..ఎవరికి ఎన్ని సీట్లు అనేవి ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు తెలుస్తాయి.

 

author avatar
Srinivas Manem

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!