NewsOrbit
5th ఎస్టేట్

“నాయకుడిగా ఎదిగే GOLDEN oppurtunities వృధా చేసుకోవడం ఎలా?” – పుస్తకం రాయి పవన్ కల్యాణ్

నిజమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గొప్ప నాయకుడిగా ఎదిగే బంగారు అవకాశాలను వృధా చేసుకోవడం ఎలా అనే పుస్తకం రాయగలిగే సత్తా మరియు అర్హత రెండూ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినప్పటికీ జనసేన పొందిన ఓటు బ్యాంకు మరియు వారు సాధించిన సీట్లకు అసలు పొంతన లేదు. చాలా నియోజకవర్గాల్లో జనసేన టిడిపి ఓటు బ్యాంకును తీవ్ర స్థాయిలో ప్రభావితం చేయడం మరి కొన్ని చోట్ల అయితే ఏకంగా ఓట్ షేర్ లో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసలు ఏపీలో గుర్తించదగ్గ శక్తిగా ఎదగకపోవడం జనసేన పార్టీ మద్దతుదారులకు చికాకు తెప్పిస్తుంది.

 

Pawan Kalyan to share the Profits

అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు అంటేనే అందరికీ ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అతని సోదరుడు చిరంజీవి గతం పక్కనపెడితే పవన్ వ్యక్తిగతంగా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. రాష్ట్రంలో అతనికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే ఇతర హీరోకి లేదు అన్నది అనఫీషియల్ నిజం. అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇలా వరుస వైఫల్యాలు చవిచూడడం వెనుక ఉన్న ముఖ్య కారణం అతని అద్భుత అవకాశాలను కాలదన్నుకోవడమే. విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ముందుగా తన యొక్క ప్రాధాన్యతను మరియు తన ఒక్క సమర్ధతను సరిగ్గా గుర్తించలేకపోతున్నారు.

పవన్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఇప్పటివరకు కరోనా విషయం పై ప్రజలకు ఎటువంటి మరియు సూచనలు ఇవ్వకపోవడం మరియు అసలు విషయం పై ఒక్క వ్యాఖ్య కూడా అటు తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఇటు ఏపీ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించకపోవడం గమనార్హం. ప్రశ్నించడానికే తాను వచ్చాననే పవన్ కరోనా నియంత్రణ లో రెండు తెలుగు రాష్ట్రాల వైఫల్యాలను చూసిన తర్వాత కూడా అసలు వారికి వ్యతిరేకంగా నోరు మెదపకపోవడం ఏమిటన్నది అందరి ప్రశ్న. అసలు ముందుగా కేసీఆర్ ను అయితే నిలదీసేందుకు వందలాది పాయింట్లు ఉండగా ఇక జగన్ కూడా టెస్టుల నిర్వహణ తప్పించి వైరస్ నియంత్రణలో చెప్పుకోదగ్గ పరిణితి కనిపించలేదు. మరి పవన్ కళ్యాణ్ ను అసలు సిసలైన నాయకుడిగా నిలబెట్టే అవకాశాలను చేజార్చుకుంటే ఎలా ప్రజలకు అతని సమర్థతను ఎలా చూపించగలుగుతాడు? వారిలో నమ్మకాన్నీ ఎలా కలిగించగలుగుతాడు?

తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీ తో కలిసి ప్రారంభించిన పవన్ ఇప్పుడు బిజెపితో కలిసి కొనసాగుతున్నాడు. రెండుసార్లు అతను బ్యాక్ గ్రౌండ్ కే పరిమితం కావడం గమనార్హం. టిడిపి అంటే చంద్రబాబు డామినేషన్ ఎలాగూ ఉంటుంది కాబట్టి విషయం పక్కనపెడితే ఇప్పుడు బిజెపి వారు వచ్చి పవన్ కళ్యాణ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి అతనితో జత కట్టారు. అంత పెద్ద పార్టీ అతనికి అండగా ఉన్నప్పుడు పవన్ ప్రతి విషయంలో తానే ముందుండి ముఖ్య భూమిక పోషిస్తూ ఏపీ బిజెపి మరియు జనసేన పార్టీ తరఫున అతనే ముందు ముఖంగా ఉంటూ రాష్ట్రంలో సొంత మైలేజి సంపాదించుకునే ప్రయత్నం కొంచెం కూడా చేయడం లేదు. ఆర్థిక పుష్టి కోసం సినిమాలు ఒప్పుకున్నను అని చెప్పిన పవన్ ఈలాక్ డౌన్ వల్ల చాలా ఖాళీగా ఉన్నాడు. అయినా కానీ అతను ఇప్పటి వరకు ఒక్క సారి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా పై మరియు అనేకమైన హాట్ హాట్ రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం మరియు ఎలాంటి వీడియో జనసైనికులను ఉద్దేశించి గాని మరియు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గాని చేయకపోవడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇదిలా ఉండగా బిజెపితో కలిసిన తర్వాత పవన్ టిడిపి భూముల విక్రయం పై ఉపవాస దీక్షలు చేపట్టాలని నిర్వహించుకున్నారు. కానీ విశాఖ గ్యాస్ లీక్ ఘటన, అమరావతి రైతుల భూముల వ్యవహారం మరియు అనేక వ్యవహారాల పై దృష్టి కేంద్రీకరించకపోవడం గమనార్హం. ఇప్పుడు అనేకమంది జనసైనికులు దీనినే జీర్ణించుకోలేకపోతున్నారు. అతను సైగ చేస్తే ఎంతోమంది ఎన్నో రకాలుగా అతనికి సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ అతని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు పార్ట్ టైమ్ పాలిటిక్స్ కి అలవాటు పడ్డారా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న సందేహం. బిజెపి తో చేరి హిందూ దేవాలయాల పై పవన్  అలవర్చుకున్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై పెట్టకపోవడం…. అసలు తన దృష్టినే కేంద్రీకరించకపోవడం మరియు కొత్తగా కాపు వర్గం గురించి అధికార పక్షాన్ని ఎన్నడూ లేని విధంగా ప్రశ్నించడం చూస్తుంటే తన కెరీర్లో ఒకే కులం తరఫున మాట్లాడే నాయకుడు అన్న ఒక అప్రతిష్ట మూటకట్టుకునే దిశగా పయనిస్తున్నాడు అనిపిస్తోంది అన్నది విశ్లేషకుల మాట.

ఏపీ 10 తరగతి విద్యార్థులను పవన్ డిమాండ్ చేయకపోయినా రెండు రోజుల్లో కచ్చితంగా ప్రభుత్వం చేసేస్తుందని అని ముందుగానే వార్తలు వచ్చాయి. అటువంటి సమయంలో పవన్ కచ్చితంగా చేసి తీరాల్సిందే అని అనడం పెద్దగా వర్కవుట్ కాలేదు. చంద్రబాబు పతనం మొదలయ్యాక జగన్ కు తగిన ప్రత్యర్థి మరియు సమఉజ్జీ పవన్ కళ్యాణ్ అనే అంతా భావించారు. ఇక బిజెపి తో జత కట్టడంతో తర్వాత రాష్ట్రంలో కొత్త రాజకీయాలు మొదలౌతున్నాయి అని జనసైనికులతో పాటు ఎంతో మంది సాధారణ పరజలు ఆశ పడ్డారు కానీ రాష్ట్రంలో అత్యంత బలహీనంగా ఉన్న ఏపీ బిజెపి ని కూడా పవన్ కళ్యాణ్ ప్రభావితం చేయకపోగా వారి ప్రయోజనాల కోసమే ప్రశ్నించడాం గమనించవచ్చు.

ఇక నాయకుడిగా ఎదిగే మాట అటుంచితే అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారా లేదా అన్నది మరొక ప్రశ్న. అసలు కేడర్ కు పార్టీ భవిష్యత్తు పై భరోసా లేదు. పార్టీ లో పట్టుమని పది లీడర్ల పేర్లు కూడా మన ఆలోచనలకు తట్టవు. పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో జగన్ పై ఖచ్చితమైన విమర్శలు చేస్తూ అతని కంటే బెటర్ గా నాయకత్వ పాత్ర పోషిస్తున్నారు అన్నది ఇప్పుడు అందరి అభిప్రాయం. అసలు పవన్ ఏం ఆలోచిస్తున్నాడు? అసలు అతనికి జనసేన భవిష్యత్తు పై తగిన ప్లానింగ్ మరియు ఇంట్రెస్ట్ ఉందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి పవన్ కనీసం అతని జనసైనికులకు సరైన పథం లో నడిపించే నాయకుడిగా ఎదిగేందుకు మరియు ప్రభుత్వ పని తీరుని, ఏకపక్షా ధోరణిని ప్రశ్నించే ప్రక్రియను త్వరగా చేపట్టకపోతే…. అతని కెరీర్ చివరాంకంలో పైన చెప్పిన పుస్తకం ఆయన రాయకపోయినా…. అతని రాజకీయ జీవితాన్ని క్షుణ్ణంగా ఒక 50 పేజీల్లో ఎవరు రాసినా అదే సరిపోతుందని…. దానికి ఆయనే ప్రత్యేకంగా రాయవాలసిన అవసరం లేదని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau