NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Lokesh: పవన్ – లోకేష్ సీఎంలుగా.. !? “నాగబాబు జబర్ధస్త్ జోకులు”..!

Pawan Lokesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆ పార్టీ నేత నాగబాబు తాజాగా చేసిన ఓ కామెంట్ రాజకీయ వర్గాల్లో హస్యాస్పదంగా మారాయి.  ఇంతకూ ఆయన ఏమన్నారు అంటే.. పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్ధిగా ఎవరు అంగీకరిస్తే ఆ పార్టీతో జనసేన పొత్తు ఉంటుంది అని అన్నారు. పవన్ కళ్యాణ్ మొదటి సారి పోటీ చేసిన రెండు చూట్ల ఓడిపోయారు. ఎమ్మెల్యే అవ్వలేదు. జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న సంగతి అందరికీ తెలిసిందే. 5 -6 శాతం మాత్రమే ఓటింగ్ వచ్చింది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో పాటు ఓ పది మంది ఎమ్మెల్యేలుగా గెలిచి ఉంటే రాష్ట్రంలో రాజకీయం వేరుగా ఉండేది. ఆ పార్టీ అంచనాలు కూడా వేరేలా ఉండేవి. గత ఎన్నికల్లో పది నుండి 15 శాతం ఓటింగ్ సాధించి ఉన్నట్లయితే 2024 ఎన్నికల్లో ఆ రాజకీయ పార్టీ అంచనాలు వేరేలా ఉండేవి. అయితే జనసేన పార్టీ రాష్ట్రంలో ఇంకా ఉనికి కోసమే పాకులాడే దశలో ఉంది. ఇది ఆ పార్టీ గుర్తించాలి. ముందుగా ఆ పార్టీ ఆలోచించాల్సింది పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీలో కూర్చోవాలి అన్నది కాకుండా ఆయన గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అనుకోవాలి. ఆయన అసెంబ్లీకి వెళితే సీఎం అయినట్లే లెక్క. ఆయన ఆలోచనలు, సిద్దాంతాలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. అసెంబ్లీలోకి వెళ్లాలి అని ఆలోచించడంలో ఒక అర్ధం ఉంటుంది. ఇప్పటికిప్పుడు సిఎం అవ్వాలి అనుకోవడం అతిశయోక్తి అవుతుంది.

 

Pawan Lokesh: లోకేష్ కే సీఎం సీటు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా లేదు

ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కు సీఎం కుర్చీ ఇవ్వడానికి టీడీపీ అంగీకరిస్తుందా..? నారా లోకేష్ కే సీఎం కుర్చీ ఇవ్వడానికి ప్రస్తుతం టీడీపీ సిద్దంగా లేదు. నారా లోకేష్ సీఎం అభ్యర్ధిగా ప్రకటించి ఎన్నికల్లోకి వెళితే ఆ పార్టీ చావు దెబ్బతింటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధిగా ఈ రెండు పార్టీలు వెళితే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. నారా లోకేష్ ఇంకా రాజకీయంగా పరిపక్వత చెందలేదని ఇంకా జనాల్లో ఉంది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు మెరుగు పడాలి అంటే చంద్రబాబు అయితేనే సమర్ధత ఉందని భావిస్తారు కానీ లోకేష్ ను గానీ, పవన్ కళ్యాణ్ ను గానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంగీకరించరు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సిద్ధాంతాలు మంచివే అన్న అభిప్రాయం ఉన్నప్పటికీ ఇంకా రాజకీయంగా ఆయన పరిపక్వత చెందాలి అని అనుభవాన్ని సంపాదించాలి అని కోరుకుంటున్నారు. ముందుగా ఎమ్మెల్యే కావాలి, ఆ తరువాత పరిపాలనా అనుభవం సంపాదించాలి ఆ తరువాత సీఎం అవ్వాలి అని అనుకుంటారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులు లేకుండా ఎన్నికల్లోకి వెళితే ఎన్ని సీట్లు సాధిస్తుంది అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకు అంటే 15 నియోజకవర్గాల్లో ఇన్ చార్జి పేర్లు చెప్పాలంటే కూడా ఒక్క సారిగా చెప్పలేరు. ఓ పది స్థానాల్లో ఇన్ చార్జిల పేర్లు చెప్పమంటే చెప్పగలరు. జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుల పేర్లు అడిగితే పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్ ల పేర్లు తప్ప పది మంది పేర్లు చెప్పలేని పరిస్థితి ఉంది. వాస్తవానికి జనసేన గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకుని పార్టీ నిర్మాణం, బలోపేతం పై దృష్టి పెట్టాలి. గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా వారి అంచనాలు ఉండాలి. జనసేన జండా ప్రతి ఇంటికీ చేరుకునే దానిపై దృష్టి పెట్టాలి. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తుంది అనేది చెప్పే దానిపై ఆ పార్టీ దృష్టి పెట్టాలి.

సీఎం కుర్చీపైనే దృష్టి పెడితే..గత ఫలితాలే..?

కేవలం సీఎం కుర్చీపైనే దృష్టి పెడితే 2019 ఎదురైన దెబ్బే తగులుతుంది. 2019 లో పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవలేకపోయారు. ఓట్లు చీలిక వల్లే కదా. సీఎం కుర్చీ ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామని అని చెప్పి ఒంటరిగా బరిలోకి దిగితే రాష్ట్రంలో మరో సారి ముక్కోణపు పోటీ అవుతుంది. ఓట్ల చీలిక వల్ల వైసీపీనే లాభపడుతుంది. పవన్ కళ్యాణ్ గెలుపు కూడా 50 -50 ఛాన్స్ లోనే ఉంటుంది. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల సేఫ్ నియోజకవర్గాలు ఉన్నాయి. నారా లోకేష్ కు గానీ పవన్ కళ్యాణ్ కు గానీ పక్కాగా గెలుస్తారు అని చెప్పే నియోజకవర్గాలు లేవు. పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగి, ఆ పార్టీ సిద్ధాంతాలు పూర్తి స్థాయిల్లో మండల, గ్రామ స్థాయిలోకి వెళితే త్రిముఖ పోటీ కాదు చతుర్ముఖ పోటీ జరిగినా గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఆ పార్టీకి అంత స్ట్రేచర్ రాలేదు. జనసేన ముందుగా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. జనసేనతో పొత్తు లేకుండా టీడీపీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. టీడీపీ తో పొత్తు లేకపోతే జనసేన అసెంబ్లీలో తమ వాణి ఎక్కువ మందితో వినిపించే ఛాన్స్ లేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒకరి అవసరం మరొకరికి ఉంది. నాగబాబు మాట్లాడిన మాటలు కూడా అంతగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

author avatar
Srinivas Manem

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N