5th ఎస్టేట్ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

PK in Congress: కాంగ్రెస్ లోకి పీకే..! జగన్, కేసిఆర్ లతో కాంట్రక్టు మాయ..!

Share

PK in Congress: ప్రశాంత్ కిషోర్ (పీకే)..ఓ రాజ్యాంగేతర శక్తి..! వాస్తవానికి రాజ్యాంగానికి లోబడి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ రాజ్యాంగంలోని లేని, రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా ప్రశాంత్ కిషోర్ తన ఎన్నికల స్ట్రాటజీలు, వ్యూహాలు ఇస్తుంటారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తాను అని అంటున్నారు. 370 నుండి 400 ఎంపీ సీట్లు గెలిపించడమే లక్ష్యం అని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ నిజానికి పక్కా బిజినెస్ మ్యాన్. పక్కా పొలిటికల్ మైండ్. తనకు ఉన్న పొలిటికల్ ఆలోచనలతో బిజినెస్ చేసే మైండ్. ఆ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమా.?.అతని వల్ల కాంగ్రెస్ పార్టీ లబ్దిపొందుతుందా.. ? నష్టపోతుందా..? అనేది వివరంగా తెలుసుకుందాం..

PK in Congress politics
PK in Congress politics

PK in Congress: నివేదికల ఆధారంగా స్ట్రాటజీలు

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనీ, ఆ పార్టీకి 370 నుండి 400 పార్లమెంట్ సీట్లు గెలిపించేలా ప్లాన్ చేస్తున్నారు అనేది అన్ని మీడియాల్లో వచ్చిందే. అయితే ప్రశాంత్ కిషోర్ రాజ్యాంగేతర శక్తి అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే.. ప్రశాంత్ కిషోర్ తన ఎన్నికల స్ట్రాటజీల్లో భాగంగా తన బృందాన్ని జనాల్లోకి పంపి జనాలకు కులం ముఖ్యమా..? డబ్బు ముఖ్యమా..? ఎమి చూసి ఓటు వేస్తారు..? సెంటిమెంట్ చూసి ఓటు వేస్తారా..? ప్రాంతీయత ముఖ్యమా.? అనే విషయాలపై అధయన రిపోర్టు తెప్పించుకుంటారు. ఆ నివేదికల ఆధారంగా స్ట్రాటజీలను అమలు చేస్తుంటారు. ఈ నియోజకవర్గంలో డబ్బును చూసి ఓటు వేస్తారు.. అక్కడ డబ్బు ఉన్న వారికి టికెట్ ఇవ్వాలి. ఈ నియోజకవర్గంలో కులాన్ని చూసి ఓటు వేస్తారు..అక్కడ మెజార్టీ కుల బలం ఉన్న నేతను పోటీకి దింపాలి అని చెబుతుంటారు. ఇదే క్రమంలో తన స్ట్రాటజీ అందిస్తున్న పార్టీకి వ్యతిరేక పార్టీ లో బలమైన నేత ఉంటే అతన్ని లోబర్చుకునేందుకు సామ, దాన, దండోపాయాలు ప్రయోగిస్తారు. బెదిరించి లొంగ దీసుకుని ఈ పార్టీ నుండి పోటీకి నిలిపి గెలిపించి పార్టీకి వాడుకుంటారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీయడమే. ఇది ఒక విధంగా రాజకీయ లబ్ది బిజినెస్ కోసమే.

ఇటు జగన్, అటు కేసిఆర్ తో పీకే టీమ్

అటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారు. దశాబ్దాల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాజకీయంగా అంపశయ్యపై ఉంది. ఇప్పుడు దీన్ని గద్దెను ఎక్కిస్తాను, బీజేపీ గద్దె దించుతాను అంటున్నారు ప్రశాంత్ కిషోర్. అది ఎలా సాధ్యం అంటే.. ! ఉదాహారణకు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహనరెడ్డికి ప్రశాంత్ కిషోర్ కి లింక్ ఉంది. ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్మోహనరెడ్డి పార్టీని గెలిపించేందుకు పని చేస్తోంది. ఏపిలో కాంగ్రెస్ పార్టీకి జగన్మోహనరెడ్డికి పడదు. జగన్మోహనరెడ్డి బీజేపికి దగ్గరగా ఉన్నారు. కేంద్రంలోని ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. మరో పక్క తెలంగాణలో కేసిఆర్ కు పీకే టీమ్ పని చేస్తోంది. కేసిఆర్ బయటకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అంతర్గతంగా కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన నాయకుడే. ఇక్కడ ఒక రాజకీయ పార్టీతో పని చేస్తూ పక్క రాష్ట్రంలో మరో పార్టీకి పని చేస్తూ, ఆయన ఈ రెండు పార్టీలు కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరితే సొంత ఇమేజ్ దెబ్బతింటుందా..? లేదా..ఒక చిన్న తేడా కొడతుందా..? లేదా..?

PK in Congress: సిద్ధాంతాలు, విధి విధానాలకు కాంగ్రెస్ తిలోదకాలు

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇన్నాళ్లు ఆ పార్టీ పాటించిన సిద్ధాంతాలు మరిచిపోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, విధి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి తిలోదకాలు ఇవ్వాల్సి వస్తుంది. గాంధీ ఫ్యామిలీ ముద్ర పోతుంది. అదికారంలోకి రావాలి అంటే సిద్ధాంతాలు వదిలివేయాల్సిందే. ఇప్పటికే రెండు సార్లు వరుసగా ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ మూడవ సారి కూడా ఓడిపోతే ఇక కాంగ్రెస్ నావ సముద్రంలో మునిగినట్లే అవుతుంది. పార్టీ బతికి బట్టకట్టాలి అంటే మూడవ సారి అయినా గెలివాలి. అందుకే  ప్రశాంత్ కిషోర్ లాంటి రాజ్యాంగేత శక్తి కాంగ్రెస్ పార్టీకి అవసరం అయ్యింది. సిద్ధాంతాలు పక్కన పెట్టాలని భావిస్తొంది. ప్రశాంత్ కిషోర్ కూడా దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాకూడదు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో జాతీయ స్ట్రాటజీ మొదలు పెట్టారు.


Share

Related posts

26మంది సజీవదహనం

somaraju sharma

Polavaram project: జగన్ ప్రభుత్వం ఓడింది..! పోలవరం 2022 చివరికీ అసాధ్యమే..?

Srinivas Manem

Samantha At Rana Daggubati-Miheeka Bajaj wedding pics

Gallery Desk