NewsOrbit
5th ఎస్టేట్ న్యూస్ రాజ‌కీయాలు

Prasanth Kishor: ప్రశాంత్ కిషోర్ డబుల్ మైండ్ గేమ్ ..! జగన్, కేసిఆర్ లకు భారీ షాక్..!?

Prasanth Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే పూహాగానాలు చాలా రోజుల నుండి వినబడుతున్నాయి. ఎందుకంటే..కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నది ఆయన ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని గానీ లేక ఏదైనా ప్రాంతీయ పార్టీ నేతను నరేంద్ర మోడీ స్థానంలో పీఎం సీటులో కూర్చోబెట్టాలి అనేది ఆయన ధ్యేయం. 2012 ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా కేరీర్ ప్రారంభించిన తరువాత 2014 ఎన్నికల్లో బీజేపీకి పని చేశారు. 2015 లో ఆయన సొంత రాష్ట్రం బీహార్ జరిగిన రాజకీయ మార్పుల కారణంగా ప్రశాంత్ కిషోర్ బీజేపికి వ్యతిరేకంగా మారారు. ఆ తరువాత ఆయన చాలా ప్రణాళిక ప్రకారం ప్రాంతీయ పార్టీలను ప్రోత్సహిస్తూ ఏపిలో జగన్మోహనరెడ్డిని, తెలంగాణలో కేసిఆర్, తమిళనాడులో స్టాలిన్, బెంగాల్ లో మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్ ఇలా బీజేపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో ప్యాకేజీలు కుదుర్చుకుని బలమైన శక్తిగా ఎదిగారు. ఇదే క్రమంలో ఆయన రాజకీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఆయనకు అనుకూలంగా ఉండేలా చూసుకున్నారు.

Prashant Kishor double mind game
Prashant Kishor double mind game

Prasanth Kishor: జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు

ఇప్పటి వరకూ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను, ఆ పార్టీ ముఖ్యమంత్రులను తనకు అనుకూలంగా చేసుకున్న ప్రశాంత్ కిషోర్ ఇక తను ప్రతిపాదించిన నేతను ప్రధాన మంత్రిని చేయాలని భావిస్తున్నారు. ఆ క్రమంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే జాతీయ పార్టీలో చేరడమే మేలని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్దం అవుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అంత హవా లేకపోయినా, ఐసీయులో ఉన్నా ఆయన జాతీయ స్థాయిలో ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేస్తారో లేదో చెప్పలేము కానీ ప్రాంతీయ పార్టీల్లో ఎవరు బలంగా ఉంటే మోడీని గట్టిగా ఎవరు ఎదిరిస్తారో వారిని ప్రధాని చేయాలన్నది ఆయన టార్గెట్.

 

తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి (కాంగ్రెస్), బీజేపీ ఉంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచేలా పని చేయాలి కానీ ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి పని చేస్తున్నారంటూ రీసెంట్ గా సీఎం కేసిఆర్ చెప్పారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తను ప్యాకేజీ తీసుకున్న టీఆర్ఎస్ గెలుపునకు పని చేస్తారా.?. తాను ఉన్న పార్టీ కాంగ్రెస్ గెలుపునకు పని చేస్తారా..? అంటే ఇక్కడ పీకే డబుల్ గేమ్ కనబడుతోంది. అదే విధంగా ఏపిలో జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ కూడా వైసీపీకి పీకే స్ట్రాటజిస్ట్ పని చేస్తున్నారు. పీకే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్ట్రాటజిస్ట్ గా ప్యాకేజీలు తీసుకున్న పార్టీలకు పని చేయడం అంటే డబుల్ గేమ్ కిందే లెక్క. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పీకే డబుల్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?