NewsOrbit
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ సినిమా

వీడియో వైరల్ : పిచ్చ పిచ్చగా ఉందా రామూ .. పవన్ సినిమా తీస్తున్నావ్!

Share

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేయబోతున్న

పవర్ స్టార్అనే సినిమా ప్రస్తుతం తెలుగు సినీ వర్గాల్లో ఎంత పెద్ద రచ్చ లేపుతుందో అందరికీ తెలిసిందే. ఇదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ని పవన్ అభిమానులకు విపరీతమైన ఆగ్రహం తెప్పిస్తోంది. తనదైన శైలిలో వారికి చాలెంజ్ లు విసురుతూ వర్మ ఆపదలు కొనితెచ్చుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నాలుగు నిమిషాల నిడివిగల ట్రైలర్ ద్వారాపవర్ స్టార్సినిమా ఎలా ఉండబోతోంది వర్మ కళ్యాణ్ ను ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నాడు అనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్ లో పవన్ ఫ్యాన్స్ కి మండించే విషయాలు ఉన్నాయి.

 

ఇదంతా ఒక పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది సెలబ్రిటీలు వీరాభిమానులుగా ఉన్నారు. అందులో పాపులర్ కమెడియన్ షకలక శంకర్ ఒకరు. రామ్ గోపాల్ వర్మ సదరు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకలక శంకర్  లైవ్ డిబేట్ లో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సంసర్భంగా మాటల మధ్య అందరికీ కౌంటర్లు ఇచ్చినట్లే ఆర్జీవీ షకలక శంకర్ కు కూడా కౌంటర్ వేశారు అని ఇప్పుడు ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మటగ్ లైఫ్అంటూ ఒక నిమిషం వీడియోనే వైరల్ అవుతోంది. అదేదో వర్మ శంకర్ కి పెద్ద పంచ్  విసిరినట్లు అది ప్రొజెక్ట్ అయింది.

ఇంతకీ ఆ డైలాగ్ ఏమిటంటే….

షకలక శంకర్ : ఏం సార్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన సినిమా తీశారు…. పిచ్చిపిచ్చిగా ఉందా?

రాంగోపాల్ వర్మ : …. అవును పిచ్చి పిచ్చి గా ఉంది! ఏం చేస్తావ్?

(దీనితో శంకర్ ఒక్కసారిగా వర్మ దగ్గరి నుండి ఆ బోల్డ్ రెస్పాన్స్ విని తెల్ల మొఖం వేస్తాడు).

కానీ ఆ వీడియోలో వర్మ పంచ్ ఏమి వేయలేదని…. మొత్తం వీడియో చూసిన వారికి మరియు దాని గురించి తెలిసిన వారికి మాత్రమే అర్థం అవుతుంది. ఈ వీడియో చాలా ఫన్నీగా జరిగింది కావాలని ఇద్దరు క్యారెక్టర్స్ మార్చుకున్నారు. అసలు ఆ వైరల్ అవుతున్న డైలాగ్ కి ముందు ఏం జరిగిందో చూడండి (7 నిమిషాల 20 సెకండ్ల నుండి 8 నిమిషాల 28 సెకండ్ల వరకు)

 

ఇలా పవన్ కళ్యాణ్ కు యాంటీ ఫ్యాన్స్ మరియు రాజకీయంగా పవన్ ఎదగకూడదు అని భావించే వారు తమ సోషల్ మీడియా పేజీల్లో మరియు తమ సొంత అకౌంట్స్ లో దీనిని వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరియు సెలబ్రిటీ అయినా శంకర్ కే వర్మ అద్భుతమైన కౌంటర్ పంచ్ వేశాడని పవన్ ఫ్యాన్స్ ను హేళన చేస్తున్నట్లు సగానికి కట్ చేసి పెట్టిన వీడియో తో వారు జనాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.  


Share

Related posts

భారీ పాన్ ఇండియా సినిమాలో సమంత ..?

GRK

Pooja Hegde New Wallpapers

Gallery Desk

Bigg boss 5 : బిగ్ బాస్ 5 హోస్ట్‌గా ఈసారి రానా..!

GRK