YSRCP: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు అందరికీ తెలుసు. చాలా జిల్లాలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు పడదు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పడదు. ఎవరి వర్గాలు వారే అన్నట్లుగా చాలా జిల్లాల్లో పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గాంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పడదు. రెండు వర్గాలు తారసపడితే కొట్టుకునే పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. గ్రూపుల కారణంగా ఆ పార్టీ నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పార్టీ క్యాడర్ అగమ్యగోచరం అవుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త అంశం తెరపైకి వస్తుంది. వైసీపీకి మొత్తం 22 మంది ఎంపిలు ఉండగా, అందులో రెబర్ ఎంపి రఘురామ కృష్ణంరాజును పక్కన బెడితే 21 మంది ఉన్నారు.
వీరిలో చాలా మందికి రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారుట. ఎంపీగా పోటీ చేస్తే కనీస ప్రోటోకాల్ పాటించడం లేదు, క్యాడర్ కు దూరం అవుతున్నాము, క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారు. ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువ అవుతోంది. నియోజకవర్గాల్లో ఎంపీలకు సరైన గుర్తింపు, గౌరవం లబించడం లేదు, క్యాడర్ కు ఏమైనా పనులు చేయించుకోవాలన్నా అధికారులు ఎమ్మెల్యేల మాటకే విలువ ఇస్తున్నారు కానీ తమ మాటకు విలువ ఇవ్వడం లేదన్న భావనలో కొంత మంది ఎంపీలు ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో క్షేత్ర స్థాయి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేందుకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారుట.
ఉదాహరణకు తీసుకుంటే విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ 2014 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బొత్స సత్యనారాయణ వైసీపీలోకి రావడంతో ఆయన చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం ఎంపీ స్థానం నుండి గెలిచారు. చంద్రశేఖర్ ఎంపీగా ఉండటంతో సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఆయన వర్గం చేజారిపోతుంది. అందుకే బెల్లాన చంద్రశేఖర్ ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తనకు చీపురుపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎలాగూ వచ్చే ఎన్నికల నాటికి బొత్స సత్యనారాయణ తన వారసుడిని రంగంలోకి దింపాలనుకుంటున్నారు కాబట్టి ఆయన వారసుడికి విజయనగరం ఎంపీ స్థానం ఇచ్చి తనకు చీపురుపల్లి ఇస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు చంద్రశేఖర్. అందుకే ఆయన చీపురుపల్లిలో ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతర్గత రాజకీయాలను యాక్టివ్ చేశారు.
అదే విధంగా అరకు పార్లమెంట్ సభ్యురాలి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ, అనకాపల్లి ఎంపీల పరిస్థితి ఉంది. అదే విధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు పరిస్థితి ఉంది. మొదటి నుండి మాగుంట ఫ్యామిలీ ఎంపీలుగానే ఉండేవారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి సోదరుడు సుబ్బారామిరెడ్డి, వదిన పార్వతమ్మ ఎంపీలుగా చేశారు. శ్రీనివాసులు రెడ్డి కూడా అయిదు సార్లు ఎంపిగా చేశారు. అయితే శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారుట. వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీ సీటు, తన కుమారుడు రాఘవరెడ్డికి ఎమ్మెల్యే సీటు కావాలని కోరుతున్నారుట. ఒక వేళ రెండు సీట్లు ఇవ్వలేని పక్షంలో తను తప్పుకుని కుమారుడిని ఎమ్మెల్యేగానే పోటీకి నిలపాలని భావిస్తున్నారుట. గిద్దలూరు లేదా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారుట.
అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కూడా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే పోటీ చేయాలన్న ఆలోచనతో అంతర్గత వర్క్ చేస్తున్నారుట. ఉరవకొండ నియోజకవర్గం నుండి తలారి రంగయ్య పోటీ చేస్తే బాగుంటుంది అని ఆయన వర్గం భావిస్తోంది. ఉరవకొండ నియోజకవర్గం బీసీలకు ఇస్తే తప్పకుండా గెలుస్తుంది అని వైసీపీ అంతర్గత నివేదికల్లో వెల్లడైందని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి వైసీపీ బలమైన నాయకుడుగా ఉన్నారు. ఆయన సోదరుడుతో పాటు మరో ఎమ్మెల్సీ కూడా వైసీపీలో బలమైన నేతలుగా ఉన్నారు. అయితే వీళ్లందరి కంటే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు వ్యక్తిగత ఇమేజ్ ఉంది. ఇక్కడ పయ్యావుల కేశవ్ ను ఓడించాలంటే, టీడీపీ సిట్టింగ్ సీటును దెబ్బతీయాలంటే బీసీ నేతకు వైసీపీ టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని వైసీపీ భావిస్తొందట. అందుకే ఎంపి తలారి రంగయ్యను ఉరవకొండ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయాలని ఆయన వర్గం భావిస్తొంది. అదే విధంగా పార్టీలోనూ ఓ వర్గం ఆదే ఆలోచన చేస్తొందని వార్తలు వినబడుతున్నాయి. అయితే విశ్వేశ్వరరెడ్డి బలమైన నాయకుడు కావడం వల్ల వైసీపీ ఆయనకే టికెట్ ఇస్తుందని రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం కూడా ఉందని ఆయన వర్గం భావిస్తొంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఏడుగురు ఎంపీలు రాబోయే ఎన్నికల్లో ఎంపీ స్థానాలను వదులుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే సిద్ధం అవుతున్నారుట.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…