NewsOrbit
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Subbarao Gupta: గుప్తా ఆ రెండు తప్పులు.. జగన్, ఆ మంత్రి రిలాక్స్..!

Subbarao Gupta: Silly Things Made YSRCP Relax

Subbarao Gupta: అసలే అధికార పార్టీ.. ఆపై కొందరు ప్రజాప్రతినిధులు దారి తప్పుతున్నారు.. ఆపై కార్యకర్తల్లో కూడా అక్కడక్కడా కొంత అసమ్మతి రాజుకుంటుంది.. పార్టీలో బెంగ.. పెద్దల్లో ఆందోళన.. కానీ జనానికి పథకాలు ఇస్తున్నాం, ఓట్లేస్తారులే అనే ధీమా..! సరిగ్గా ఇటువంటి సమయంలో ఒంగోలుకు చెందిన సోమిశెట్టి సుబ్బారావు గుప్తా తెరపైకి వచ్చారు. “పార్టీ తీరు బాలేదు. మంత్రుల తీరు బాలేదు.. అక్కడి మంత్రి బాలినేని ప్రవర్తన అయితే అసలే బాలేదు..” అంటూ నిప్పులు చెరిగారు. ఆ సెగ పార్టీలో ఎక్కడెక్కడో తగిలింది. చల్లార్చే ప్రయత్నం చేయకుండా ఆ నిప్పుపై పెట్రోల్ పొసే పని చేసారు.. ఆ నిప్పులు చెరిగిన ఆ సుబ్బారావు గుప్తా ఎందుకు ఊరుకుంటాడు..!? చెలరేగిపోయాడు. పార్టీపై ఎదురుదాడి ప్రారంభించాడు. తన బలం చాలదని తెలిసి సామజిక అండ, వ్యతిరేకుల అండ తీసుకునే ప్రయత్నాల్లో మునిగాడు.. కానీ సరిగ్గా ఇదే దశలో చేసిన కొన్ని తప్పులు అతన్ని లైట్ తీసుకునేలా చేశాయి. పార్టీ పెద్దలు రిలాక్స్ అయ్యేలా చేశాయి.. గుప్తాపై చిన్నచూపు కలిగేలా చేశాయి..!

Subbarao Gupta: Silly Things Made YSRCP Relax
Subbarao Gupta Silly Things Made YSRCP Relax

Subbarao Gupta: ఢిల్లీలో ఉన్నారు.. కానీ..!?

సోమిశెట్టి సుబ్బారావు గుప్తా.. ఈయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద, వైసీపీ దౌర్జన్యాల మీద ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. వైసీపీ కార్యకర్తగానే చెప్పుకుంటున్నారు. పార్టీ కండువా మెడలో వేసుకునే పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. జగన్మోహనరెడ్డిని విమర్శించారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని బర్తరఫ్ చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఆయన తాజా డిమాండ్. ఈ డిమాండ్ తో ఆయన నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారు. కానీ.. ఇప్పడూ సుబ్బారావు గుప్తాను టీడీపీ, వైసీపీ ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు..? ఆయన చెప్పే సబ్జెక్ట్ ను ఎందుకు ఆలకించడం లేదు..? నిజానికి ఆయన పార్టీ శ్రేయోభిలాషిగానే విషయాలను చెప్పారు. వైసీపీకి శ్రేయోభిలాషిగా ఏవైతే చెప్పాలో అవే చెప్పారు. ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు నిజాలే ఉన్నాయి. కానీ ఆయనును వైసీపీ నెగిటివ్ గా ట్రీట్ చేసింది. ఆయనపై దాడి చేశారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయలేదు, అరెస్టు చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి. అసలు సుబ్బారావు ఎందుకు చులకన అయ్యారు..? ఆయన చేసిన తప్పులు ఏమిటి..?సీఎం, వైసీపీ ఆయన విషయంలో ఎందుకు రిలాక్స్ అయ్యింది. ? నిజానికి సుబ్బారావు గుప్తా మొదట చేసిన కామెంట్స్ తో వైసీపీ అలర్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నాడు. పార్టీకి నష్టం జరుగుతుందేమో భయపడింది. అయితే ఇప్పుడు ఆయన ప్రవర్తన చూసి వైసీపీ రిలాక్స్ అయ్యింది.

Subbarao Gupta: Silly Things Made YSRCP Relax
Subbarao Gupta Silly Things Made YSRCP Relax

Subbarao Gupta: రెండు తప్పులు ఇవే..!

సుబ్బారావు గుప్తా తాను ఒక సెలేబ్రిటిగా మారాక జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతాలను కాస్త భద్రంగా చూసుకోవాలి. ఆయన ఒంగోలులో ఇటీవల పంది మాంసం కొన్నారు. పందిం మాసం కొనడం అనేది ఏపీలో అయితే దాదాపు 90 శాతం మంది తప్పుగానే చూస్తారు. అది కూడా ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన సుబ్బారావు గుప్తా పంది మాసం కొనుగోలు చేశాడు.. అంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. దానికి తోడు ఆయనే స్వయంగా చెప్పారు. “అవును.. కొనుగోలు చేశాను. పంది మాంసం తినడం తప్పా, రాజ్యాంగంలో ఉందా, ఏమైనా చట్టం ఉందా..?” అని మరీ ప్రశ్నించారు. నిజానికి ఆర్యవైస్యులకు కొన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. సాధారణంగా ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన వారు పంది మాంసం తినడాన్ని అసహ్యంగా చూస్తారు. తన సామాజికవర్గం తనకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు తన సామాజికవర్గ ఆచార సంప్రదాయాలను గౌరవించాలి కదా. అలా చేయకపోవడంతో ఆ వర్గం ఆయనను దూరం పెట్టింది. ఇది ఆయన చేసిన మొదటి తప్పు,. దొరికిపోయాడు. ఇది రాజకీయంగా ముడి పెట్టకూడదు కానీ ఆయన సామాజికవర్గం ఆయనకు మద్దతు ఇవ్వాలంటే ఆయన వ్యక్తిగత విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు..!

Subbarao Gupta: Silly Things Made YSRCP Relax
Subbarao Gupta Silly Things Made YSRCP Relax

టీడీపీ నేతలకు కలుస్తూ.. ఫోటోలు..!!

మరో విషయం ఏమిటంటే జనవరి 21వ తేదీన ఆయన టీడీపీ మాజీ ఏమ్మెల్యే దామచర్ల జనార్థన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. విష్ చేయడంలో తప్పు లేకపోవచ్చేమో.. కానీ ఆయనను కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను టీడీపీకి సపోర్టు చేస్తున్నాను అన్నట్లు వైసీపీని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ సుబ్బారావు గుప్తా మన మనిషి కాదు టీడీపీ మనిషి అని డిసైడ్ అయ్యింది. ఇలా రెండు తప్పులు సుబ్బారావు గుప్తా చేయడంతో వైసీపీ ఆయనను లైట్ గా తీసుకుంది. ఆయన చెప్పే విషయాలు లోతైన అంశాలకు సంబంధించినవి అయినప్పటికీ పార్టీ సీరియస్ గా తీసుకోవడం లేదు. అందుకే ఢిల్లీకి కూడా ఆయన ఒక్కడే వెళ్లారు. ఆయన సామాజికవర్గం వారు కూడా ఆయన వెంట వెళ్లలేదు. సుబ్బారావు గుప్తా ఈ తప్పులు చేయకపోతే ఆయన సామాజికవర్గం వారు కొందరు అయినా ఆయనకు సపోర్టు చేసే వాళ్లు, ఆయన తో పాటు ఉండేవాళ్లు. ఇలా ఒక నాయకుడు ఆకస్మికంగా తెరమీదకు వచ్చి తెరమరుగు అవ్వడానికి కారణం ఈ తప్పులే కారణం. “సో.. ఈ సిల్లీ చర్యలతో ఆ సోమిశెట్టి సుబ్బారావు గుప్తా చులకనయ్యారు..!

author avatar
Srinivas Manem

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju