NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP ABN: టీడీపీ కొత్త బెంగ..ఏబీఎన్ వెన్నుపోటు..!? భజన తప్పి చంద్రబాబుకి తలనొప్పి..!

TDP ABN: అతి అనర్ధానికి దారి తీస్తుంది అన్నది అందరికీ తెలిసిన సామెత. ఇదే క్రమంలో అతి భజన, అతి పొగడ్తలు, అతిగా తిట్టడం అయినా అనర్ధాలకు దారి తీస్తుంది. అందుకే పెద్దలు అంటుంటారు పెరుగుట విరుగుడు కొరకే అని. ప్రస్తుతం ఏబీఎన్ (ABN) పరిస్థితి అలానే ఉందని అంటున్నారు విశ్లేషకులు. టీడీపీని, చంద్రబాబు (Chandrababu) ని భజన చేసే క్రమంలో ఏబీఎన్.. టీడీపీని బాగా నష్టపరుస్తుందేమో అనే సందేహాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో సాక్షి (sakshi) కూడా వైసీపీ (YCP)ని నష్టపరుస్తొంది. సాక్షికి ఏబీఎన్ కు వ్యత్యాసం ఉంది. సాక్షి యజమాని, వైసీపీ యజమాని ఒక్కరే. ఈ కారణంగా దానిలో పని చేసే వాళ్లు అందరూ వైసీపీకి అనుకూలమైన వార్తలే ఇవ్వాల్సి ఉంటుంది. ఏబీఎన్ కు అధికారికంగా టీడీపీతో ఏమి సంబంధం లేదు. అంటే ఏబీఎన్ ను నడిపేది టీడీపీ యాజమాన్యం కాదు. టీడీపీకి అధినేత చంద్రబాబు, ఏబీఎన్ కు యజమాని వేమూరి రాధాకృష్ణ. వారి మధ్య సాన్నిహిత్యం, సంబంధాలు అయితే ఉన్నాయి. ఈ క్రమంలో ఏబీఎన్.. సాక్షి లా కాకుండా టీడీపీ చేసే తప్పులను ఎత్తిచూపాలి. అతి భజన చేయకూడదు. వైసీపీ చేస్తున్న తప్పులు, టీడీపీ చేస్తున్న తప్పులను చెప్పాల్సి ఉంటుంది. ఏ పార్టీ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అవసరమైతే వాళ్లకు డ్యామిజీ లేకుండా చెప్పాలి.

TDP ABN False Headings
TDP ABN False Headings

TDP ABN: చంద్రబాబు టంగ్ స్లిప్

ఉదాహారణకు చంద్రబాబులో పెద్ద లోపం ఆయన మాటలు, ఆయన స్పీచ్. ఇటీవల ఓ జిల్లా పర్యటనలో చంద్రబాబు తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా అన్నారు. కానీ ఆయన అలా అనకూడదు. కరోనా ప్రపంచం మొత్తం వచ్చింది. ఆయన ఉన్నా సరే వస్తుంది. ఆయన అక్కడ టంగ్ స్లిప్ అయ్యారు. తాను అధికారంలో ఉంటే కరోనా కంట్రోల్ చేసే వాడిని, వ్యాక్సినేషన్ టైమ్ ఇచ్చే వాడిని, ఆసుపత్రిలో సౌకర్యాలు ఏర్పాటు చేసే వాడిని,  ఇన్ని మరణాలు వచ్చేవి కావు, ఇంత డ్యామేజీ జరిగేది కాదు  అని అనాల్సింది పోయి నేను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదు అన్నట్లు పొరబాటున మాట్లాడారు. ఈ మాటలతో చంద్రబాబు నవ్వుల పాలు అయ్యారు. చంద్రబాబుకు చంద్రబాబే డ్యామేజ్ చేసుకుంటారు. కొన్ని సార్లు ఆయన ట్రోల్స్ కు గురి అవుతుంటారు. చంద్రబాబు విషయంలో ఏబీఎన్ కూడా అలానే తయారు అవుతోంది.

 

TDP ABN: పార్లమెంట్ లో అల్లూరి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేస్తే

అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టమన్నది నేనే అని చంద్రబాబు చెప్పినట్లుగా నిన్న ఏబీఎన్ లో వచ్చింది. ఫస్ట్ ఇలా పెట్టి తరువాత దాన్ని మార్చారు. పార్లమెంట్ లో అల్లూరి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేసినట్లుగా మార్చారు. మొదటి థంబ్ నైల్ పై విమర్శలు రావడంతో వెంటనే దాన్ని మార్చేశారు. టీవీ 5 గానీ ఏబీఎన్ గానీ ఇలా చాలా తప్పులు చేస్తొంది. ఉదాహరణకు..మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫోటో పెట్టి టీడీపీలోకి అని, లావు శ్రీకృష్ణదేవరాయలు ఫోటో పెట్టి టీడీపీలోకి అని థబ్ నైల్స్ పెడతారు. గత ఆరు నెలల కాలం నుండి చూస్తే అవి పది సార్లకు పైగా ఉంటాయి. వాళ్లు పది సార్లకు పైగా పార్టీ మారిపోయారా..? వాళ్లు ఎప్పుడు పార్టీ మారతారో అప్పుడు రాయవచ్చు, వాళ్లు పార్టీ మారడానికి కారణాలు ఇవే అని రాయవచ్చు. లేదా వైసీపీలో అసంతృప్తిగా ఈ ఎంపీలు అని రాయవచ్చు. ఇంత వరకూ ఒక పద్ధతి ఉన్నట్లు. కానీ వాళ్ల ఫోటోలు పెట్టి వాళ్లు టీడీపీలోకి వచ్చేస్తున్నారు, వాళ్లు వైసీపీ నుండి బయటకు వచ్చేస్తున్నారు అంటూ షాక్ ఇవ్వనున్న లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీకి షాక్ ఇవ్వనున్న మాగుంట అని పెట్టి టీడీపీలోకి వచ్చేస్తున్నట్లుగా పెడతారు.

 

మీడియాలో విలువలు..

వాళ్లు నెలకు ఒకటి రెండు సార్లు పెడితే నెలకు రెండు సార్లు టీడీపీలో చేరినట్లు భావించాలేమో. ఇటువంటి హెడ్డింగ్స్, పిచ్చి థంబ్ నైల్స్ కారణంగా క్రెడిబిలిటీ పోతోంది. లావు శ్రీకృష్ణదేవరాయులు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి సాగునీటి సమస్య (నాగార్జునసాగర్) గురించి మాట్లాడారు. ఆయన నీటి సమస్యపై మాట్లాడితే ఏబీఎన్ ..వైసీపీకి రాజీనామా చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలు.. సంచలన ప్రెస్ మీట్ అంటూ థంబ్ నైల్ పెట్టారు. ఇలా వైసీపీని డౌన్ ఫాల్ చేద్దామనుకుని టీడీపీని డౌన్ ఫాల్ చేస్తున్నారు. ఇటువంటి వాటి వల్ల విలువలు కోల్పోతున్నారు. మీడియా విలువలు దిగజారుస్తున్నారు. ఎంపీల్లో చీప్ అయిపోతున్నారు. ఏంటి వీళ్లు ఇలా చేస్తున్నారని  అని అనుకుంటున్నారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ మరీ ఎక్కువ అయిపోతున్నాయి. దీని వల్ల టీడీపీ నష్టమేతప్ప లాభమేమి రాదు.

author avatar
Special Bureau

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju