NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP: టీడీపీ చరిత్రలో సెన్సేషనల్ నిర్ణయం ..!? అసెంబ్లీకి వెళ్లాలా వద్దా – అంతర్మధనం..!

TDP: తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక సెన్ఫేషన్ నిర్ణయం తీసుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబు చాలా సీరియస్ గా ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే.. టీడీపీ ఇప్పటి వరకూ ఎప్పుడూ అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడూ పూర్తిగా బహిష్కరించలేదు. అసెంబ్లీ గడువు చాలా కాలం ముందు తాము అసెంబ్లీకి రాము, మళ్లీ అధికారంలోకి వచ్చే వరకూ అడుగు పెట్టము అని గతంలో ఎప్పుడూ టీడీపీ ప్రకటించలేదు. కానీ తొలిసారిగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా అసెంబ్లీ గడువు రెండున్నర సంవత్సరాలకు ముందే.. తాను సిఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానంటూ ఒక శపథం చేసి బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు మార్చి 7వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు అనేది చాలా కీలకమైనవి. రాష్ట్రానికి వార్షిక పద్దు ప్రవేశపెడతారు. అంతకు ముందు కాగ్ రిపోర్టును ప్రవేశపెడతారు. అలానే ఎకమికల్ సర్వే కూడా సభలో ప్రవేశపెడతారు. ఇటువంటి కీలకమైన సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికార పక్షం మాత్రమే ఉండి. అధికార పక్షం మాత్రమే చెప్పుకుంటే వాటిలో ఉన్న లోపాలను తప్పుబట్టడానికి, నిలదీయానికి, ప్రజల ముందు ఉంచడానికి ప్రతిపక్షం అనేది ఉండాలి. దీని కోసం టీడీపీ అంతర్మధనం పడుతోంది.

TDP dilemma on assembly budget session
TDP dilemma on assembly budget session

TDP: సమావేశాలకు వెళ్లాలా..? వద్దా..?

సమావేశాలకు వెళ్లాలా..? వద్దా అని ఆలోచన చేస్తోంది. గత నాలుగు రోజుల నుండి దీనిపై బడ్జెట్ సమావేశాలపై టీడీపీ ఆలోచన చేస్తోంది. తాను మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలు అంత సుముఖంగా లేనట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్లడం అవసరమా..?. అధికార పక్షానికి 150 మందికిపైగా బలం ఉంది. ప్రతిపక్షానికి మైక్ ఇవ్వరు. ఇచ్చినా మైక్ కట్ చేస్తారు, హేళన ఉంటుంది. సభలో లేకపోయినా చంద్రబాబును ఏదో రకంగా అధికార పక్షం విమర్శిస్తుంది. వాళ్లు అనే మాటలకు టీడీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కఛ్చితంగా గొడవ జరుగుతుంది. పూర్తిగా వెళ్లకపోవడమే మంచిది. గతంలో వాళ్లు కూడా సమావేశాలకు మానేశారు కాబట్టి మనం ఇప్పుడు మానేద్దాం అన్నట్లు టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయంగా ఉంది.

Read More: YS Viveka Climax: కొన్ని గంటల్లో పెద్ద అరెస్టు..!? ఢిల్లీ నుండి అనుమతులు సిద్ధం..!

డోలాయమాన పరిస్థితిలో

టీడీపీ ఎమ్మెల్యేలలో అసెంబ్లీకి వెళ్లాలా..? వద్దా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఈ విషయంపై ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఈ అంశంలో టీడీపీ ఒక డోలాయమాన పరిస్థితిలో ఉంది. 2017లో 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకూ తాము అసెంబ్లీకి వెళ్లము అంటూ జగన్మోహనరెడ్డి సమావేశాలను బహిష్కరించారు.  వైసీీపీ శాసనసభ్యులు ఎవరూ అసెంబ్లీ హజరు కావద్దని నిర్ణయం తీసుకున్నప్పుడు టీడీపీ విమర్శలు చేసింది. ఇదే చంద్రబాబు, అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు నిర్వహించాలి, అసెంబ్లీకి రావాలి అన్నట్లుగా విమర్శించారు. ఇప్పుడు టీడీపీకి అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ టీడీపీ అసెంబ్లీకి వెళ్లకపోతే అంతకంటే దారుణంగా వైసీపీ నుండి విమర్శలే రావచ్చు. టీడీపీ గతంలో ఆ రకంగా విమర్శలు చేసి వాళ్లు కూడా అదే బాటలో వెళతారా లేదా అనేది చర్చనీయాంశం. ఈ విషయంలో టీడీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju