NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP Internal: టీడీపీలో తిరుగుబాటు..!? బాబుకి ఏమైంది..??

TDP Internal: ఏపిలో తెలుగుదేశం పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మాత్రం పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి తప్పులు చేస్తున్నారు..! రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి..! రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు..! పరిశ్రమలు తీసుకురావడం లేదు..! ప్రాజెక్టులు రావడం లేదు..! హామీలు ఏవీ నెరవేర్చడం లేదు..! ప్రజలను మోసం చేస్తున్నారు.. ! ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు..! ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది..! అందుకు తమ పార్టీకి 110 సీట్లు వస్తాయి, 160 సీట్లు వచ్చేస్తాయి అన్నట్లుగా టీడీపీ ఒక ధీమాలో ఉంది. బాగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. కొంత మంది ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే జగన్మోహనరెడ్డి తప్పులు చేసినప్పటికీ ఇంకా రెండేళ్లలో తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది.

TDP Internal: చంద్రబాబు నిర్ణయాలు కొంత మందికి నచ్చడం లేదు

తెలుగుదేశం పార్టీలో ప్రాక్టికల్ గా ఆలోచించే, రియాలిటీకి దగ్గరగా ఆలోచించే కొంత మందికి చంద్రబాబు తీరు నచ్చడం లేదు. ఎందుకంటే ..2009 నుండి 2014 వరకూ టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. 2004 నుండి 2009 వరకూ కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు వంట గ్యాస్ రేటు పెరిగినా, విద్యుత్ చార్జీలు పెరిగినా, నిత్యావసర వస్తువుల ధరలు ఇలా ఏవి పెరిగినా టీడీపీ కార్యకర్తలు జెండాలతో రోడ్డు మీదకు వచ్చి దర్నాలు చేసే వాళ్లు. ప్రజల దగ్గరకు వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పోరాట స్పూర్తి టీడీపీలో లేదు. కాకపోతే “బాదుడే బాదుడు” అని, “ఆత్మగౌరవ సభ” అని పేరు పెట్టి ధర్నాలు చేయండి, ఆందోళనలు చేయండి అని పిలుపు ను అయితే ఇస్తున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే కేవలం 30 నుండి 40 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయి. ఎక్కడెక్కడ జరగలేదు అనేది ఫాలోఅప్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఫాలో అప్ కూడా లేదు. ఒక పిలుపు ఇస్తున్నారు.. చేసే వాళ్లు చేస్తున్నారు, వదిలేసే వాళ్లు వదిలేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద కార్యక్రమాలు చేయడం లేదన్న విమర్శ ఉంది. ఆ పార్టీలోనే కొందరు నాయకుల్లో ఈ అభిప్రాయం ఉంది. అందుకే చంద్రబాబు నిర్ణయాలు కొంత మందికి నచ్చడం లేదు.

chandrababu plans for tdp development

TDP Internal: 40 నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు

ఇటీవల టీడీపీ 40 వ ఆవిర్భావ దినోత్సవ వేడుక జరిగింది. ఈ సందర్భంలో చంద్రబాబు 40 శాతం సీట్లు యువతకు ఇస్తామన్నారు. అది ఎలా సాధ్యం అని ప్రాక్టికల్ గా చెప్పలేదు. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో వారసులే కనబడుతున్నారు. వారసత్వం లేని యువతను ఇప్పటి నుండి ప్రోత్సహిస్తున్న దాఖలాలు కూడా లేవు. వారసత్వం లేని యువత ముందుకు వచ్చినా వారికి పార్టీ ఆర్ధిక తోడ్పాటు అందించాలి, ఆ నియోజకవర్గాల్లో గ్రూపులు రాకుండా చూసుకోవాలి. దానిపై పార్టీ ఏమి మాట్లాడటం లేదు. ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉందని టీడీపీ అనుకుంటోంది. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అనుకున్నప్పుడు ఎంత త్వరలో క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళితే అంత మంచింది. 40 వ పార్టీ ఆవిర్భావ వేడుకల్లోనూ యువతను ప్రోత్సహించిన దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో యువతను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేయడం లేదు. ఇన్ చార్జిల విషయంలో కఠినంగా వ్యవహరించడం లేదు. 175 నియోజకవర్గాల్లో సుమారు 40 నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇస్తారు అనేది క్లారిటీగా చెప్పడం లేదు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టికెట్ ఎవరికి ఇస్తారో క్లారిటీ లేదు. ఏడ్చర్ల టికెట్ ఎవరికి ఇస్తారో తెలియదు. ఒక్కో జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో నాలుగు, శ్రీకాకుళం జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఇలా క్లారిటీ లేని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా 30 నుండి 40 ఉన్నాయి.  ఎవరు పోటీ చేస్తారో అనేది క్లారిటీ లేదు, గ్రూపులు ఉన్నాయి. సో..ఇవన్నీ పరిష్కరించాల్సి ఉంది.

Chandrababu Naidu: That Caste Angry on TDP.. 12 Lakhs Voters

TDP Internal: క్షేత్ర స్థాయిలో పోరాటాలు లేవు

క్షేత్ర స్థాయిలో గతంతో పోలిస్తే పోరాటాలు లేవు. వారసత్వ ముద్ర లేని యువ నాయకత్వానికి ప్రోత్సాహం లేదు. కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు. టెలికాన్ఫరెన్స్ లకు, వీడియో కాన్ఫరెన్స్ లకు, ఫోన్ లలో జూమ్ మీటింగ్ లకే పరిమితం అవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లడం లేదు అన్న అపవాదు ఉంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్న ఆ పార్టీ నేతల్లో ఈ అభిప్రాయం ఉంది. అందుకే చంద్రబాబు తీరు కొందరికి నచ్చడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొందరు నాయకులు ఎన్నికల ముందు పార్టీ నుండి బయటకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటీవల టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబుతో ఓ ఎమ్మెల్సీ  మాట్లాడుతూ కరోనా పోయింది. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది. క్షేత్ర స్థాయి కార్యక్రమాలకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాల వారీగా మీటింగ్ లు ఎందుకు పెట్టడం లేదని అడిగితే.. టైమ్ ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తోంది. వ్యతిరేకత ఇంకా పెరగనివ్వనీ అన్నారుట. దీంతో ఆ ఎమ్మెల్సీ హర్ట్ అయి ఇదేమిటీ చంద్రబాబు అంత ధీమాగా ఉన్నారు. క్షేత్ర స్థాయిలో చూసుకుంటే వైసీపీపై అనుకున్నంత వ్యతిరేకత లేదు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రభుత్వ తప్పులు ప్రజలకు వివరిస్తేకదా వారు తెలుసుకునేది. అలా చేయడానికి నాయకులుగా మేము సిద్దంగా ఉన్నా ఆయన పిలుపు ఇవ్వడం లేదని కొంత మందిలో అసంతృప్తి ఉంది. టీడీపీలో ఇది ముదిరి ముదిరి చంద్రబాబు నాయకత్వాన్ని కొంత మంది బయటకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. టీడీపీలోని కొంత మందిలో అగ్నిపర్వతం అయితే రగులుతోంది అని చెప్పుకోవచ్చు. ఇది ఎంత వరకూ వెళుతుంది. చంద్రబాబు ఈ రెండేళ్లలో సరి చేసుకుంటారా లేదా చూద్దాం..!

author avatar
Srinivas Manem

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju