NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP Janasena: టీడీపీకి డేంజర్ డేస్ ..!? అభద్రత, ఆందోళనలో క్యాడర్..!

TDP Janasena: ఏపిలో టీడీపీ – జనసేన మధ్య పొత్తు అంశం ప్రాధమిక దశలో ఉంది. కానీ సోషల్ మీడియా వేదికగా సీట్ల పంపిణీపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. కానీ ముసుగులో గుద్దులాట ఆడుతున్నాయి. ఆ పార్టీకి మాతో అవసరం.. కాబట్టి ఆ పార్టీనే తమ వద్దకు రావాలి అంటూ ఇరు పార్టీలు భావిస్తున్నాయి కానీ ఎవరూ ముందడుగు వేయడం లేదు. అయితే ఈ విషయంలో తెలుగుదేశంలో ఒక భయం ఉంది. జనసేన విడిగా పోటీ చేస్తే 25 నుండి 30 స్థానాల్లో ఓట్లు చీల్చేస్తుందనీ, ఒక్కో నియోజకవర్గంలో 20 నుండి 25 వేల ఓట్లు చీలిక వస్తే ఆయా నియోజకవర్గాల్లో ఓటమి ఖాయమని టీడీపీ భయపడుతోంది.

TDP Janasena alliance fear
TDP Janasena alliance fear

Read More: AP Politics: ఫుల్ ప్లానింగ్ తో పవన్ కళ్యాణ్ ..! బీజేపీ – టీడీపీ మధ్యలో..కానీ..!?

TDP Janasena: రెండు పార్టీల్లో భయం

చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు మనసులో ఉంది వచ్చే ఎన్నికల్లో కలసి వెళ్లాలి అని. వేరువేరుగా పోటీ చేస్తే వైసీపీ లాభపడుతుందని ఈ పార్టీలు భావిస్తున్నాయి. అయితే పొత్తు కోసం టీడీపీతో ముందుగా ప్రయత్నిస్తే పదో పదిహేను సీట్లు ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇవ్వమని అంటుందని జనసేన భయపడుతోంది. ఒక వేళ టీడీపీయే ముందుగా జనసేనతో మాట్లాడితే 50 – 60 సీట్లు అడుగుతుందని టీడీపీ భయపడుతోంది. అందుకే రెండు పార్టీల్లోనూ ఎవరూ బయటపడలేదు. కానీ చంద్రబాబు ఒక చోట టంగ్ స్లిప్ అయ్యారు. వన్ సైడ్ లవ్ అంటూ నోరు జారారు. దాంతో జనసేన ముందు టీడీపీ చులకన అయ్యింది. జనసేనకు అవకాశం ఇచ్చినట్లే. జనసేన లేకపోతే మా పార్టీ గెలవదు అని ఒక రకంగా చంద్రబాబు ఒప్పుకున్నట్లు అయ్యింది. అయితే ఇదే క్రమంలో జనసేన కూడా తాము బలపడిపోతున్నాము అన్న భావనలో ఉంది. ఆ బలం గెలుపునకు దోహదపడుతుందా..? లేదా..? అన్నది గ్రహించడం లేదు. గతంలో ఆరు శాతం ఓటింగ్ 12 లేదా 18 వరకూ వెళ్లవచ్చు. కానీ ఇంత శాతం ఓట్లు వస్తే 25 – 30 సీట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. 13 శాతం ఓట్లు సాధించిన పార్టీ కూడా ఒకటి రెండు సీట్లకే పరిమితమైయ్యాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో 13 శాతం సీట్లు వచ్చిన పార్టీ ఒక సీటుకే పరిమితం అయ్యింది.

టీడీపీలో అభద్రత, ఆందోళన

జనసేనలో పొలిటికల్ ఇమెట్యూరిటీ ఉంది. జనసేన పార్టీలో అందరికీ తెలిసిన వాళల్లో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తప్ప ఎవరూ లేరు. జనసేన పార్టీ ఒక రకంగా గేమ్ ఆడుతోంది. టీడీపీ ఒక రకంగా భయపడుతోంది. అభద్రత, ఆందోళనలో చిక్కుకుపోయింది. ఈ రెండు పార్టీలు పొత్తుతో వెళ్లాలని అనుకుంటున్నాయి కానీ ఇంత వరకూ సీట్ల విషయంపై చర్చలు జరగలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది అంతా ఫేక్ ప్రచారమే. జనసేకు 60, టీడీపీకి వంద, జనసేనకు 40, టీడీపీకి 120 అంటూ జరుగుతుంది అంతా తప్పుడు ప్రచారం. ఈ రెండు పార్టీలకు సంబంధించి సీట్ల పంపిణీకి సంబంధించి చర్చలు జరగలేదు. అయితే పవర్ షేరింగ్ విషయం జనసేన మనసులో ఉంది. సీఎం సీటు పవన్ కళ్యాణ్ కు అడగాలని జనసేనలో ఉంది. దీన్ని టీడీపీ అంగీకరించే పరిస్థితిలో లేదు. ఈ విషయంలో రెండు పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

50 – 60 సీట్లు ఇస్తే..

టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఒక ఆందోళన ఉంది. ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీకి 40 స్థానాలు ఇస్తే పది మాత్రమే గెలుచుకుంది. దాంతో 30 స్థానాలు కోల్పోయింది. ఇప్పుడు జనసేనకు 50 – 60 సీట్లు ఇస్తే ఆ సీట్లలో వాళ్లు గెలవకపోతే తీవ్రంగా నష్టం జరుగుతుందని టీడీపీ శ్రేణులు భయపడుతున్నారు. సీఎం సీటు అడిగినా, 40కిపైగా స్థానాలు జనసేన అడిగినా టీడీపీ – జసనేన మధ్య పొత్తుపై సందిగ్దత ఏర్పడుతుంది. మొన్నటి వరకూ జనసేనతో పొత్తు ఉంటుందో లేదో అన్న భయపడిన టీడీపీ, ఇప్పుడు ఎక్కువ సీట్లు జనసేన అడుగుతుందేమో అన్న భయంలో ఉంది. పార్టీ నాయకులు ధీమాగా ఉన్నప్పటికీ క్యాడర్ లో మాత్రం అభద్రతాభావం, భయాలు చోటుచేసుకున్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju