NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena BJP: బిజేపీ చేతికి తాళం ..! టీడీపీ లో పెద్ద భయం ఇదే..!

TDP Janasena BJP: తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతోంది. అందులో ఏటువంటి సందేహం లేదు. జనసేన అధినేత పవన్ కూడా పొత్తుకు రెడీ గా ఉన్నట్లు పరోక్షంగా చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి, వైసీపీని అధికారంలో నుండి దించడానికి మేము ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని నిన్న మరో సారి చెప్పారు పవన్ కళ్యాణ్. ఇదే సందర్భంలో టీడీపీ కూడా పొత్తులకు రెడీగా ఉంది. అయితే ఈ రెండు పార్టీల పొత్తులో బీజేపీ డ్రామా ప్లే చేస్తుందా..? డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తుందా..? ఇండైరెక్ట్ పాలిటిక్స్ చేస్తుందా..? పొత్తులో కలిసి వస్తుందా..? మేము రాము అని దూరంగా జరిగిపోతుందా..? వైసీపీకి మద్దతు ఇస్తుందా..? అనేది చాలా కీలకం. క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నది టీడీపీ. ఆ తరువాత క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నది జనసేన. ఓట్లు పంచుకోవాలన్నా, సీట్లు పంచుకోవాలన్నా ఈ రెండు పార్టీలే ముఖ్యం. బీజేపికి ఓటింగ్ లేదు. సొంతంగా సీట్లు గెలవలేరు కానీ..బీజేపీకి పవర్ ఉంది. ప్రస్తుత మన వ్యవస్థలో ఓట్లు, సీట్లు ఉన్నవాడికంటే పవర్ ఉన్న వాడిదే పెత్తనం నడుస్తుంది. అందుకే జనసేన – టీడీపీ పొత్తును బీజేపీ శాసించబోతున్నది. బీజేపీని వదిలి వేసి టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ బీజేపీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి. బీజేపీ చేతిలో పవర్ ఉంది. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ బద్ద శత్రువుగా మారింది కాబట్టి బీజేపీ తన చేతిలో ఉన్న వ్యవస్థల ద్వారా పరోక్షంగా వైసీపీకి సహకరించింది. ఎన్నికలకు ముందే అధికారులను మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, సీఎస్ ను మార్చారు. ఎన్నికల కమిషనర్ ను మార్చారు. చాలా మార్పులు వచ్చాయి. ఎన్నికల కమిషనర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి.

TDP Janasena BJP alliance politics
TDP Janasena BJP alliance politics

TDP Janasena BJP: బీజేపీకి రాష్ట్రంలో ప్రజా బలం లేకపోయినా..

వ్యవస్థలు సహకరించకపోయినా, నూట్రల్ గా ఉండకపోయినా ఏ పార్టీకి ఎంత ప్రజాబలం ఉన్నా ఏమి చేయలేని పరిస్థితులు ఎదురవుతాయి. 2019 ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బీజేపీ పవర్ ఏమిటో ఈ చర్యలతోనే అందరికీ తెలిసి వచ్చింది. అందుకే జనసేన – టీడీపీ పొత్తును బీజేపీ శాసిస్తుంది. వాళ్లు గెలవలేమని తెలిసినా ఇన్ని కావాలి అన్ని కావాలి అని సీట్లు అడుగుతారు. వీళ్లు వాళ్లను కాదు వెళ్లిపోండి అని చెప్పలేని పరిస్థితి. వాళ్లను బతిమిలాడుకుని వాళ్లు అడిగినన్ని సీట్లు కాకపోయినా కొంత తగ్గించి అయినా ఇవ్వాలి. ఒక వేళ బీజేపీని కలుపుకోకపోతే వైసీపీకి సహకరించే అవకాశం ఉంటుంది. బీజేపీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోయినా వ్యవస్థల ద్వారా 2019 ఎన్నికల సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యవస్థలు అన్ని టీడీపీ, జనసేనకు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. సో..అందుకే బీజేపీ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి టీడీపీ – జనసేనకు ఉంది.ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటకు వస్తే జనసేన మీద విమర్శలు వస్తాయి. అయిదు సంవత్సరాల వ్యవధిలోనే ఎన్ని పార్టీలు మారుస్తారు అంటూ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బీజేపీతో కలిసే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.

చంద్రబాబుకు అధికారంలోకి వస్తే మాట వినడనే

బీజేపీయేమో పొత్తులో భాగంగా పవన్ ను హైలెట్ చేయాలని, ఆయననే సీఎం కుర్చీలో కూర్చొబెట్టాలని ఉంది. ఎందుకంటే అధికారంలోకి వస్తే చంద్రబాబు బీజేపీ మాట వినవచ్చు, వినకపోవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే కఛ్చితంగా బీజేపీ మాట వింటారన్న నమ్మకం. ఈ లెక్కల్లో బీజేపీ ఉంది. తమ మాట వినేవాడు సీఎం కుర్చీలో ఉండాలన్నది బీజేపీ ఆలోచన. కేంద్రంలో పవర్ ఉంటుంది. రాష్ట్రంలో పవర్ ఉంటుంది. ఓట్లతో సంబంధం లేదు. సీట్లతో సంబంధం లేదు. ప్రజా బలంతో సంబంధం లేదు. పవర్ తమ చేతిలో ఉండాలి. పవన్ తో అయితేనే అది సాధ్యం అవుతుంది. చంద్రబాబుకు మ్యాజిక్ ఫిగర్ రాకుండా జనసేన, బీజేపీ సీట్లతో ఆధారపడితే చంద్రబాబును శాసించే అవకాశం ఉంటుంది. ఇది బీజేపిీ లెక్క. వాళ్ల పవర్ నిలబడుతుంది, పవర్ చేతిలోకి వస్తుంది అని తెలిస్తే ఈ కూటమిలో చేరతారు. పూర్తిగా సపోర్టు చేస్తారు. ఇది వర్క్ అవుట్ కాదని తెలిస్తే వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇస్తారు. వైసీపీ అధికారంలో ఉంటే పవర్ వాళ్ల చేతిలో ఉన్నట్లే. గత మూడేళ్లుగా చూస్తూనే ఉన్నాం. కేంద్రంలోని బీజేపీని వైసీపీ ఒక్క మాట కూడా విమర్శించలేదు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, పోలవరం నిధులు తదితర విషయాలపై కేంద్రంలోని బీజేపీని గట్టిగా అడగడం లేదు. డిమాండ్ చేయడం లేదు. మూడేళ్ల క్రితం అధికారం కోల్పోయిన టీడీపీని విమర్శిస్తున్నారు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వైసీపీ విమర్శించడం లేదు. సో..అందుకే బీజేపీ అలా ఉంది. బీజేపీయే కీలక శక్తిగా మారింది.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju