TDP Mahanadu: తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పండుగ లాంటిది. టీడీపీ ఆవిర్భావం నుండి ప్రతి సంవత్సరం మహనాడు నిర్వహిస్తారు. మహానాడులో టీడీపీ విధి విధానాలు ఖరారు అవ్వడంతో పాటు అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. కార్యకర్తలు దీన్ని పండుగగా భావించి స్వచ్చందంగా హాజరు అవుతారు. తీర్మానాలు ఉంటాయి. నాయకుల ప్రసంగాలు, రాబోయే కాలంలో ఎటువంటి ప్రణాళికలపై చెబుతారు. ఈ మహానాడు కోసం రెండు మూడు నెలల ముందు నుండే ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తుంటాయి. మహానాడు ఎవరెవరు వస్తారు..? ఏమేమి మాట్లాడతారు..? రెస్పాన్స్ ఎలా ఉంటుంది..? ఎంత మంది వస్తారు..? అనే దానిపై ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే గత మూడు సంవత్సరాలుగా మహానాడు జరగలేదు. 2019లో పార్టీ ఓటమి, భయం బాధ కారణంగా జరగలేదు. ఆ తరువాత రెండేళ్లు కరోనా ఫస్ట్, సెకండే వేవ్ కారణంగా మహానాడు జరపలేదు.
ఇప్పుడు 2022 లో తప్పనిసరిగా మహానాడు నిర్వహించాల్సిన పరిస్థితి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఘోర ఓటమి తరువాత వరుసగా మూడేళ్లు మహానాడు జరపలేదు కాబట్టి ఈ సారి మహానాడు నిర్వహించి పార్టీని యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా పార్టీ శ్రేణులను వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు మహానాడు తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రెస్టేజియస్ మారింది. ఆ పార్టీ ఘనంగా మహానాడు నిర్వహించాల్సి ఉంది. అందుకు ఆ పార్టీ వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకుంది. ఆ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో దాదాపు 15, 16 కమిటీలను ఏర్పాటు చేసుకుంది. ఈ కమిటీలు అన్నీ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 30 నుండి 50 మంది నాయకుల బృందం గత పదిహేను రోజులుగా ఈ పనిలో బిజీగా ఉంది.
దీన్ని ఏ విధంగా డిస్ట్రబ్ చేయాలని వైసీపీ చూస్తుంటే ఏ విధంగా సక్సెస్ చేయాలా అనేది టీడీపీ చూస్తోంది. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్లదే పై చేయి అవుతుంది. రాజకీయ ప్రత్యర్ధుల మీటింగ్ అంత సులువుగా జరుపుకుంటుంటే అధికార వైసీపీ చూస్తూ ఊరుకుండే రకం కాదు. ఒంగోలులో మహానాడు నిర్వహించుకునేందుకు జాతీయ రహదారి పక్క ఓ పెద్ద ఖాళీ మైదానాన్ని చూశారు. రాష్ట్రంలో ఏ మూల నుండైనా రాకపోకలు సాగించేందుకు ఈ వేదిక అనుకూలంగా ఉంటుంది. కానీ అక్కడ ప్రభుత్వం (పోలీసులు) కొన్ని కారణాలు చూపి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఒంగోలు సమీపంలో 15 కిలో మీటర్ల గొల్లేపల్లికి జాతీయ రహదారికి కొద్దిగా లోపలకు మహానాడు వేదికను మార్చారు. వేదిక విషయంలోనే అడ్డుతగిలారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మహానాడు వేదికకు ఇబ్బందులు పెట్టలేదు. అంతకు ముందు ఏ ముఖ్యమంత్రి ఇబ్బంది పెట్టలేేదు. మొదటి సారి మహానాడు నిర్వహణకు సవాళ్లు, ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో ఎదురవుతున్నాయి. మహానాడుకు ఇంకా 8 రోజులు ఉంది. మహానాడు సక్సెస్ కాకుండా ఉండాలని వైసీపీ ప్రయత్నిస్తుందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మహానాడు నుండి దృష్టి మళ్లించేందుకే వైసీపీ బస్సు యాత్ర పెట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. మహానాడు జరిగేలోగా ఇంకా ఎన్ని అడ్డంకులు ఉంటాయి. అడ్డంకులు దాటుకుని మహానాడును టీడీపీ సక్సెస్ చేసుకోగలగుతుందా అనేది వేచి చూడాలి.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…