TDP News: బాబు టేబుల్ పైకి ఆ జాబితా..! టీడీపీలో కోవర్టుల లిస్టు ఇదే..!

Share

TDP News: తెలుగుదేశం పార్టీలో ఓ అంశం ఆ పార్టీ వర్గాల్లోని చాలా మందికి  ఆందోళన కల్గిస్తోంది. నియోజకవర్గ ఇన్ చార్జిలు, ద్వితీయ, మండల స్థాయి నాయకులు ఒక అంశంలో భయపడుతున్నారు. ఎందుకంటే..టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఓ లిస్ట్ ఉంది. దానిలో పార్టీలో కోవర్టులు ఎవరు. పార్టీకి కంకణబద్దులు ఎవరు అనే లిస్ట్. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి ఆదుకునేందుకు అంకితభావంతో పని చేస్తున్న కార్యకర్తలు ఎవరు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తమ స్వలాభం కోసం అధికార పార్టీకి అమ్ముడుపోయి అంతర్గతంగా అధికార పార్టీకి సహకరించింది ఎవరు, మొదటి విభాగంలో కంకణబద్దులు, రెండవ విభాగంలో కోవర్టులకు సంబంధించి మొత్తం అన్ని జిల్లాలకు జాబితా చంద్రబాబు టేబుల్ మీద ఉందట. చంద్రబాబు ఆ లిస్ట్ పక్కన పెట్టుకుని గత వారంపది రోజులుగా ప్రతి నియోజకవర్గం నుండి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులను పిలిచి రివ్యూ చేస్తున్నారు. కొంత మంది నాయకులను నాలుగు గోడల మధ్యే అతను చేసిన తప్పిదాలను చెప్పి హెచ్చరిస్తున్నారుట. బాగా చేసిన వారిని అభినందిస్తున్నారు. మండల స్థాయి నాయకుల లిస్ట్ కూడా చంద్రబాబు వద్ద ఉంది. కోవర్టుల లెక్క తేలిపోయింది. ఏవరా కోవర్టులు, ఎంత మందిని సస్పెండ్ చేయనున్నారు. ఎంత మంది కొత్త వాళ్లు రాబోతున్నారు అనేది టీడీపీలో ఓ పెద్ద టాస్క్.  ఓ పెద్ద చర్చనీయాంశం.

TDP New: chandrababu reviews on constituency wise
TDP New: chandrababu reviews on constituency wise

 

TDP News: 50 నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల మార్పు ..?

ప్రస్తుతం దాదాపు 50 నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు, కోఆర్డినేటర్ లను మార్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు నాయకులను సస్పెండ్ చేయకుండా పక్క నియోజకవర్గాలకు పంపడమో లేక సెలెంట్ చేయడమో చేయనున్నారుట. వాళ్ల స్థానంలో అనూహ్యంగా ఇన్ చార్జిలుగా కొత్త వారిని తీసుకురానున్నారు.  పార్టీ నుండి సస్పెండ్ చేయబోయే ఇన్ చార్జిలు ఉన్నారు. వారిలో కడప జిల్లాలో ఒక ఇన్ చార్జి, ప్రకాశం జిల్లాలో ఒక ఇన్ చార్జిలను సస్పెండ్ చేయనున్నారట. కడప జిల్లాలో ఒక ఇన్ చార్జి నియోజకవర్గంలో పార్టీని బ్యాడ్ చేస్తున్నారని సమాచారం. ఒకప్పుడు టీడీపీ కంచుకోట గా ఉన్న ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎదగడం లేదు. వరుసగా ఆ నియోజకవర్గం ఓడిపోవడానికి కారణం ఆ ఇన్ చార్జి వ్యవహారాల శైలి అనేది పార్టీ వద్ద సమాచారం ఉంది. ఎప్పటి నుండో ఫిర్యాదులు ఉన్నా ఇప్పుడు చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సొంత సామాజికవర్గం కావడం వల్ల హెచ్చరించి తిరిగి కొనసాగిస్తారా అనేది చూడాలి. ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గానికి 2019 ఎన్నికలకు ముందే వచ్చిన ఒ నాయకుడు ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తన వ్యాపార లావాదేవీల కోసం వైసీపీతో అంతర్గత వ్యవహారాలు నడుపుతున్నట్లు పార్టీ దృష్టికి వచ్చింది. తన వ్యాపారాల కోసం నియోజకవర్గంలో పార్టీని తాకట్టు పెట్టి  వైసీపీ నేతలతో స్నేహాన్ని నెరుపుతున్నారు. వైసీపీ నేతల సామాజికవర్గం, ఆయన సామాజికవర్గం ఒకటే కావడంతో కొన్ని ఒత్తిళ్ల కారణంగా నియోజకవర్గంలో పార్టీ గురించి పట్టించుకోవడం లేదు. అయితే ఆ నాయకుడిపై చర్యలు తీసుకునే అవకాశాలు కష్టమేనట. ఎందుకంటే ఆ నియోజకవర్గ ఇన్ చార్జికి ఏబీఎన్ రాధాకృష్ణ కు మంచి స్నేహితుడు. గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గ టికెట్ కూడా ఆయన సిఫార్సుతోనే చంద్రబాబు ఇచ్చారు. ఆయనపై ఈగ కూడా వాలకుండా ఆర్కే చూసుకుంటారు. ఈయనేమో వైసీపీ వాళ్లతో రహాస్య వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటారు.

 

వైసీపీతో లాలూచి నేతలు 15 మంది

ఇక కృష్ణాజిల్లాలో ఇద్దరు, ఉత్తరాంధ్రలో ఆరుగురు ఇన్ చార్జిలు ఉన్నారు. వీళ్లందరూ అధికార పార్టీతో భయపడి వాళ్లతో చీకటి రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి వాళ్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా  15 మంది ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా ఇన్ చార్జి స్థాయి నాయకులు కావడంతో సస్పెండ్ చేస్తే అయిదుపదివేల ఓట్లు నష్టం కల్గించే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్లను పిలిపించి క్లాస్ పీకి అతని జాతకం మొత్తం చూపి అయిపోయిందేదో అయిపోయింది. రాబోయే రెండున్నర సంవత్సరాలు జాగ్రత్తగా చేసుకుంటే టికెట్ ఇవ్వడం జరుగుతుంది లేకపోతే టికెట్ ఇవ్వడం కుదరదు. పార్టీలో గుర్తింపు ఉండదు అని కరాఖండిగా చెప్పేస్తారు. మండల, ద్వితీయ శ్రేణి నాయకులను అయితే సస్పెండ్ చేస్తారు కానీ నియోజకవర్గ స్థాయి నాయకుడిని సస్పెండ్ చేయాలంటే పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి. అందుకే వాళ్లను ఇప్పటి నుండి అయినా లైన్ లో పెట్టేందుకు చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని సమాచారం.


Share

Related posts

‘నేను మాట ఇస్తున్నా’

sarath

Budama Kayalu: రూపాయి ఖర్చు లేని ఈ కాయలు తింటే ఈ ఆరోగ్య సమస్యలు పరార్..!!

bharani jella

Vizag Steel Plant : మాటల్లేవ్ !మాట్లాడుకోడాల్లేవ్! స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం అడుగు ముందుకే !

Yandamuri