TDP News: తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలు నారా, నందమూరి కుటుంబాల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్నారు. వీరు ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనేది ఇప్పటి వరకూ ఒక క్లారిటీ ఉంది. చంద్రబాబు మొదటి నుండి కుప్పం నుండే పోటీ చేస్తున్నారు. వరుసగా గెలుస్తూ వస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చి హిందూపూర్ నుండి పోటీ చేసి గెలిచారు. రెండవ సారి 2019లోనూ అక్కడి నుండే ఎమ్మెల్యే అయ్యారు. నారా లోకేష్ 2019లో మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లోనూ మంగళగిరి నుండే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇటీవల టీడీపీలో అంతర్గతంగా కొన్ని చర్చలు జరుగుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. దీంతో కన్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి. టీడీపీలో ఈ అంశం చర్చకు దారి తీస్తోంది. అది ఏమిటంటే నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తారా చేయరా..లోకేష్ కుప్పం వెళతారనీ, చంద్రబాబు రాజధాని ప్రాంతంలోని ఏదో ఒక నియోజకవర్గం అంటే మంగళగిరి గానీ లేక వేరే నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనీ, బాలకృష్ణ గుడివాడ వస్తారనీ పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు లేవు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల గడువు ఉంది. అయినప్పటికీ ఏవేవో పుకార్లు మాత్రం వస్తున్నాయి.

Read More: Gudivada: కొడాలి నాని పై విచారణ..? గోవా క్యాసినో పై సీరియస్ ఆదేశాలు..!
TDP News: మంగళగిరి నుండే నారా లోకేష్
అయితే నారా లోకేష్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మంగళగిరి నుండి పోటీ చేయడం పక్కా అనే సమాచారం అందుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మంగళగిరిపై లోకేష్ ఫోకస్ పెంచారు. గత నవంబర్ నెల చివరి నుండి ఆయన మంగళగిరిలో వారానికి రెండు మూడు రోజులు పర్యటిస్తున్నారు. డిసెంబర్ నెలలో నాలుగు సార్లు వెళ్లారు. నవంబర్ నెలలో పర్యటనకు వెళ్లక ముందే నారా లోకేష్ తన వద్ద ఉన్న మూడు సర్వే సంస్థల ద్వారా సర్వే చేయించుకున్నారు. చంద్రబాబు కూడా సర్వే చేయించారు. లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు అన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఆయన ఓడిపోవడం వల్ల ప్రజల్లో కొంత సానుభూతి ఉందని సర్వే ద్వారా తెలిసిందట. అలానే వైసీపీ ఎమ్మెల్యే పట్ల కొంత వ్యతిరేకత కూడా ఉన్నట్లు చెబుతున్నారుట. రాజధాని ప్రాంత ప్రభావం మంగళగిరిలో ఎక్కువగా ఉందట. నారా లోకేష్ పోటీ చేస్తే బాగుంటుంది అని సర్వేలు చెప్పాయట. తను సర్వే చేయించుకున్న తరువాత లోకేష్ లో ఒక ధీమా వచ్చిందని అంటున్నారు.
బాలకృష్ణ గుడివాడకు రావాలని కోరుతున్న పార్టీ శ్రేణులు
అక్టోబర్ నెలలో టీడీపీ ఆఫీసుపై వైసీపీ దాడి అనంతరం చంద్రబాబు దీక్ష చేసిన సందర్భంలో నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు. మంగళగిరి నుండి తానే పోటీ చేస్తాను, భారీ మెజార్టీతో గెలిపించి గిఫ్ట్ ఇస్తాను అని చంద్రబాబుకు సభాముఖంగా హామీ ఇచ్చారు. అయినప్పటికీ అనవసరమైన చర్చలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే హిందూపూర్ వదలి గుడివాడ వస్తారు అని అంటున్నారు. దీనిలో కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని సమాచారం. బాలకృష్ణకు మనసులో ఉందో లేదో కానీ పార్టీ శ్రేణులు మాత్రం బాలకృష్ణ గుడివాడ గానీ గన్నవరం గానీ పోటీ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారుట. కొడాలి నాని, వల్లభనేని వంశీపై టీడీపీ క్యాడర్ లో ఉన్న ఆగ్రహం కారణంగా నందమూరి లేదా నారా కుటుంబాల నుండి వీరిపై పోటీ నిలిపి ఓడించాలని కోరుకుంటున్నారు.
హిందూపూర్ నుండే బాలకృష్ణ
అభిమానుల కోరిక అలా ఉన్నప్పటికీ బాలకృష్ణ కూడా మూడవసారి హిందూపూర్ నుండే పోటీ చేయాలని భావిస్తున్నారుట. ఆయన కూడా నియోజకవర్గం మారే అవకాశం లేదు. ఇక చంద్రబాబు నాయుడు అయితే రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారుట. కుప్పంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారని సమాచారం. చంద్రబాబు రాబోయే ఎన్నికల్లోనూ కుప్పం నుండి తప్పనిసరిగా పోటీ చేస్తారు. మరో పక్క విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తూ వైసీపీ యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయడం ద్వారా అక్కడ పార్టీ బలోపేతం చేయవచ్చని ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.