TDP News: టీడీపీలో బయటకు తెలియని చిచ్చు..! అచ్చెన్న విషయంలో చంద్రబాబు తప్పులు..?

Share

TDP News: రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఈ అంశం అంతర్గతంగా రగిలిపోతున్నది. టీడీపి రాష్ట్ర అధ్యక్షుడుగా కింజారపు అచ్చెన్నాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆయనకు పదవి అయితే ఇచ్చారు కానీ ఆయన ఎంత వరకు ఫ్రీ హ్యాండ్ తో పని చేస్తున్నారు. ఎంత వరకు ఆయనకు స్వేచ్చ ఉంది. ఎంత వరకు ఆయనకు నిర్ణయాధికారం ఉంది అనేది టీడీపీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశం. అందరూ తెలుసుకోవాల్సిన అంశం. అచ్చెన్నాయుడుకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు కట్టబెట్టారు. ఆయనకు ఆ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉంది. మంచి వాగ్దాటి ఉన్న నాయకుడు. ఏ అంశంపై అయినా స్పష్టంగా అందరికీ అర్ధమయ్యేలా మాట్లాడగలరు. అన్నింటికీ మించి పార్టీ అంటే పడిచచ్చే కుటుంబం. కింజారపు ఎర్రంనాయుడు నుండి దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా ఆ కుటుంబం పార్టీకి అంకితభావంతో పని చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫ్యామిలీ. ఏనాడు పార్టీ మీద తిరుగుబాటు చేయలేదు. క్రమశిక్షణ ఉంది. పార్టీలో అందరికీ తెలిసిన నాయకుడు. అన్నింటికంటే మించి రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువ. అచ్చెన్నాయుడు కూడా ఆ వర్గంలో మంచి పట్టు ఉన్న బీసీ సామాజికవర్గ నాయకుడు. ఇన్ని పాజిటివ్స్ చూసే అచ్చెన్నాయుడుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ ఎంత వరకూ స్వేచ్చగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్న అంశం.

 

TDP News chandrababu ignore atchannaidu powers
TDP News chandrababu ignore atchannaidu powers

TDP News: నేతలకు, పార్టీకి మధ్య వారధిగానే అచ్చెన్నాయుడు

ఎందుకంటే నియోజకవర్గ ఇన్ చార్జిల నియామకానికి వచ్చే సరికి అచ్చెన్నాయుడు మాటకు విలువ ఉండటం లేదు. ఆయనకు బాగా పట్టు ఉన్న జిల్లాల్లో కూడా పార్టీకి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల్లో అచ్చెన్నాయుడును సంప్రదిస్తున్నారో లేదో తెలియదు కానీ ఆయన అభిప్రాయాలను అమలు చేయడం లేదు. మండల, నియోజకవర్గ స్థాయి నేతలకు, పార్టీకి మధ్య వారధిగా అచ్చెన్నాయుడును వాడుకుంటున్నారే తప్ప ఆయనకు ఉన్న పాజిటివ్స్ ను పార్టీ పాజిటివ్స్ కు వాడుకోవడం లో ఫెయిల్ అవుతోంది. వాస్తవానికి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటించవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఓ పెద్ద ఉద్యమాన్ని చేయించవచ్చు. ఇటువంటి కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేయడం లేదు. అచ్చెన్నాయుడు ద్వారా బీసీ వర్గాలను ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపొందించవచ్చు కానీ అదీ చేయడం లేదు. ఆయనకు కొన్ని ప్రత్యేక పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చు. అదీ చేయడం లేదు. అచ్చెన్నాయుడుకు ఉన్న బలాలు పార్టీకి తెలుసు. కానీ ఆ బలాలను పార్టీ ఉపయోగించుకోవడం లేదన్న మాట వినబడుతోంది. ఇది పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశం.

చంద్రబాబు, లోకేష్ చుట్టూనే పార్టీ నేతలు

నారా లోకేష్ కు రాజకీయంగా అంత అనుభవం లేదు. వాగ్దాటి లేదు. వక్త కాదు. ఇప్పుడిప్పుడే ఆయన నాయకుడిగా ఎదుగుతున్నారు. నాయకుడుగా నిరూపించుకోవడానికి లోకేష్ కు ఇంకా టైమ్ ఉంది. పార్టీ అధినేత కుమారుడు కావచ్చు, మంగళగిరిలో ఒక సారి పరీక్ష రాసి ఫెయిల్ అయ్యారు. నాయకుడిగా ఆయన ఎదురు ఈదుతున్నారు. లోకేష్ కు ఇంకా అయిదు సంవత్సరాలో, పది సంవత్సరాల్లో సమయం ఉంది. కానీ పార్టీ మొత్తం లోకేష్ చుట్టే తిరుగుతోంది. పార్టీ సోషల్ మీడియా గానీ, నియోజకవర్గ ఇన్ చార్జిలు గానీ లోకేష్ చుట్టూ లేక చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు. అచ్చెన్నాయుడు చుట్టూ ఎందుకు తిరగడం లేదు. నియోజకవర్గ లేక మండల స్థాయి నాయకుడో కార్యకర్తో అచ్చెన్నాయుడుకు ఫోన్ చేస్తే ఆయన నింపాదిగా మాట్లాడుతారు. సమాధానం చెబుతారు. చెప్పేది వింటారు. కానీ దాన్ని అమలు చేయలేకపోతున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే శక్తి అచ్చెన్నాయుడు వద్ద లేదు. నిర్ణయాధికారం ఆయనకు లేదు. ఆయనకు పవర్స్ ఇవ్వలేదు. కేవలం కోఆర్డినేషన్ బాధ్యతలే అప్పగించారు. దీన్ని ఇలా ఎంత కాలం నెట్టుకు వస్తారు. ఆయనకు ఉన్న పాజిటివ్స్ ను పార్టీ ఎందుకు ఉపయోగించుకోవడం లేదు. ఆయనను ఉపయోగించుకునేలా రానున్న రెండున్నరేళ్లలో కార్యక్రమాలు చేస్తారా. లేక అలానే వారధిగా ఉంచుతారా అనేది పార్టీ అంతర్గతంగా చర్చించుకుని నిర్ధారించుకోవాల్సి అంశం.


Share

Related posts

సుపరిపాలనపై శ్వేతపత్రం

somaraju sharma

గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి:నిర్ధారించిన డబ్ల్యు హెచ్ ఒ

somaraju sharma

Tollywood: పెళ్లయిన తర్వాత రెండోసారి సినిమా చేయడానికి రెడీ అవుతున్న హిట్ పెయిర్..??

sekhar