TDP News: టీడీపీలో ఈ కష్టాలు తప్పవా..!? చంద్రబాబుపై తిరుగుబాటు కామెంట్స్..!

Share

TDP News: “ఏపిలో రైతు ఆత్మహత్యలు ఏ విధంగా ఉన్నాయో 2024 ఎన్నికల (Elections) తరువాత ఒక వేళ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే టీడీపీ (TDP) నాయకుల, కార్యకర్తల ఆత్మహత్యలు (Suicide) ఆ విధంగానే ఉండబోతాయి. టీడీపీ నాయకులు ఆస్తులు అమ్ముకుని, తాకట్టు పెట్టుకుని, భారీగా వడ్డీలకు అప్పులు తెచ్చుకుని ప్రస్తుతానికి రోడ్ల మీద తిరుగుతున్నారు. పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు. మళ్లీ 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల ఫలితమే వస్తే టీడీపీ నాయకులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కుటుంబాలు రోడ్డున పడతాయి. చంద్రబాబు ఈ బాధను పట్టించుకోవాలి. నాయకులను ఆదుకోవాలి” అని టీడీపీ నాయకుడు, ఒక నియోజకవర్గానికి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న నాయకుడు సంచలన కామెంట్స్ చేశారు. ఈ నాయకుడి మాటల్లో చాలా అంతరాద్ధం ఉంది. చాలా ఆవేదన ఉంది. ప్రాక్టికాలిటీ, రియాలిటీ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చాలా మంది పడుతున్న ఆవేదనను ఆయన పూసగుచ్చినట్లు చెప్పారు. టీడీపీ నాయకులు ఇప్పుడు పొలిటికల్ రిస్క్ చేస్తున్నారు. ఒక లాటరీ ఆడుతున్నట్లుగా చెప్పుకోవచ్చు.

TDP News Leader Financial troubles

TDP News: ఏడాదికి రూ.25 – 30 లక్షల ఖర్చు

ఆ మాటలను కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జి తిక్కారెడ్డి అన్నారు. ఆయన వరుసగా 2014, 2019 రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. రెండు ఎన్నికల్లోనూ భారీగానే ఖర్చు చేశారు. ఇప్పుడు మూడవ ఎన్నికకు ఆయన రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని ఆస్తులను అమ్ముకోవడంతో పాటు కొన్ని తాకట్టు పెట్టారట. ఒక నియోజకవర్గానికి పార్టీ ఇన్ చార్జిగా వ్యవహరించాలి అంటే రోజుకు కనీసం లక్ష రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. బహిరంగ సభ గానీ ర్యాలీలు నిర్వహించాలి అంటే రూ.20 నుండి 25 లక్షలు ఖర్చు అవుతుంది. ఏడాదికి సుమారుగా రూ.25 నుండి 30 లక్షలు వరకూ ఇన్ చార్జిలకు ఖర్చు అవుతుంది. అదే ఎన్నికలకు ముందు సంవత్సరంలో అయితే 3 నుండి 5 కోట్లు ఖర్చు అయిపోతాయి. ఆ తరువాత ఎన్నికల ఖర్చు చెప్పాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఇన్ చార్జిలకు ఇదే సమస్యగా మారింది. చాలా మంది నాయకులకు రోజు వారి ఖర్చులకు కూడా డబ్బులు లేవు. ఇప్పుడు వీళ్లు ఏదో విధంగా అప్పు తెచ్చి ఖర్చు చేస్తారు. ఎన్నికల్లో గెలిస్తే పార్టీ అధికారంలోకి వస్తే ఇబ్బంది లేదు. ఏవో చిన్న చిన్న కాంట్రాక్ట్ లు చేసుకుంటారు. సంపాదించుకుంటారు. లేదా అధికారంలో ఉంటారు కాబట్టి ఏదోలా సంపాదించుకుని అప్పులు తీర్చుకుంటారు.

 

TDP News: మళ్లీ ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తే..

ఒక వేళ మళ్లీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తే అధికార పార్టీ వేధింపులు తప్పువు. కార్యకర్తల మీద కేసులు తప్పవు. వాళ్లకు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ మెయింటనెన్స్ తట్టుకోలేరు. ఇప్పటికే చాలా మంది ఇన్ చార్జిలు ఇబ్బందులు పడుతున్నారు. తల (ఇల్లు) తాకట్టు పెట్టి అయినా డబ్బులు తెచ్చి రంగంలో ఉండేందుకు రెడీ అవుతున్నారు. కొందరు అయితే తాకట్టు పెట్టడానికి ఇల్లు లేని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏమిటి..? టీడీపీ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుంది..? నిజంగా తిక్కారెడ్డి చెప్పింది నిజమైతే 2024లో పార్టీ ఓడిపోతే పరిస్థితి ఏమిటి..? వీళ్ల ఆర్ధిక కష్టాలు తీర్చడానికి లేదా ఎన్నికల్లో ఖర్చును తగ్గించడానికి టీడీపీ ఏమైనా ప్లాన్స్ వేస్తుందా..? ఎందుకంటే వచ్చే ఎన్నికలు చాలా దారుణంగా ఉంటాయి. ఖర్చులు చాలా భారీగా ఉంటాయి. 2019 ఎన్నికల్లోనే టీడీపీ కంటే వైసీపీయే ఎక్కువ ఖర్చు పెట్టింది. అధికారంలో ఉండి కూడా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులకు డబ్బులు సర్దుబాటు కాక చివరి నిమిషంలో చేతులు ఎత్తేశారు. ఈ సారి 2024 లో వైసీపీ గతం కంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. టీడీపీలో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతల వివరాలు మరో కథనంలో..


Share

Recent Posts

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. టార్కెట్ ఆఫ్ సర్కార్

దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరుపుతోంది. మొత్తం…

1 నిమి ago

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

5 నిమిషాలు ago

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ…

8 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago