NewsOrbit
5th ఎస్టేట్

తెలుగునాట రాజకీయం అంతే మరి .. సంచయిత కే అలవాటైంది అంటే అర్ధం చేసుకోండి 

మన తెలుగు రాష్ట్రంలో రాజకీయం ఒంటబట్టించుకోవడం అరటికాయ తిన్నంత సులువు. ఏం చదువుకున్నా.. ఎంతటి అనుభవం ఉన్నా.. ఏ పరిస్థితుల మధ్య పుట్టి పెరిగినా ఒక్కసారి పదవి చేతిలో పడింది అంటే చాలు రాజకీయం ఓనమాలను ఎవరి సహాయం లేకుండానే అలవోకగా దిద్దేస్తుంటారు మన ఆంధ్ర రాష్ట్రం పెద్దలు. ఇదంతా చెబుతుంది అశోక్ గజపతిరాజు కుమార్తె సంచయిత గురించి. గుర్తు వచ్చిందా…? అనూహ్యంగా సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ కే చైర్మన్ అయిన ఆమె అసలు హిందువే కాదు అంటూ అతని పెదనాన్న అశోకుడే కోర్టుకెక్కాడు కదా.. ఆ సంజయితనే.

Sanchaita Gajapati Raju takes office as chairperson of MANSAS ...

ఇక వివరాల్లోకి వెళితే మంచి సేవ కార్యకర్త గా మరియు భిన్నమైన వ్యక్తిగా కనిపించే సంచయిత యవ్వనంలోనే మంచి రాజకీయ నాయకురాలి లక్షణాలు చూపిస్తోంది. పరిస్థితులన్నీ ఆమెకు ప్రతికూలంగా ఉన్న సమయంలో ఆమె ఒక సెక్రెటరీ నియమించుకుంది. మోహన్ కుమార్ అనే పేరు గల ఇతను ఒక మద్రాసి. నాలుగైదు రోజుల క్రితమే విజయనగరం చేరాడు. ఇంకా జగన్ ప్రభుత్వం వేలకోట్ల విలువైన ఆస్తులు ఉన్న ప్రఖ్యాత మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత నియమించిన నా విషయం తెలుసు కదా…. ఆ మన్సాస్ ఆఫీసు అయిన రాజుగారి కోటలోనే వెళ్లి తిష్ట వేశారు.

ఇదంతా బాగానే ఉంది కానీ అసలు లాక్ డౌన్ సమయంలో ఇతనిని ఆంధ్రరాష్ట్రంలోకి ఎవరు అనుమతించినట్లు? ఇప్పటికే ఎన్నికల కమిషనర్ కనగరాజును చెన్నై నుండి అంబులెన్స్లో తీసుకువచ్చారన్న వివాదం నడుస్తూ ఉంది. అది పూర్తి కాకముందే మన మోహనుడు ఎలా ఇక్కడికి వచ్చాడో అర్థంకాక అంతా తలలు పట్టుకున్నారు. సరే రానే వచ్చాడు…. మరి క్వారంటైన్ చేయాలి కదా…? లేదు వెంటనే మన్సాస్ కోటలో చేరాడు. ఆ విషయానికి వస్తే చెన్నై కరోనా కోణంలో హాట్ స్పాట్. విజయనగరం చూస్తేనేమో గ్రీన్ జోన్. ఒక్క కేసూ నమోదు కాలేదు. దీంతో ఆందోళన చెందిన కొంతమంది ఎస్పీ వద్దకు చేరగా ఆమె సిఐకు పని అప్పచెప్పింది. సిఐ దర్యాప్తు చేసి చివరికి మోహనుడికి ఎలాంటి కరోనా టెస్టులు చేయలేదు అని…. క్వారంటైన్ తప్పక చేయాలని నిర్ణయించాడు.

ఇక్కడే మన సంచయిత రాజకీయం మొదలౌతుంది. ప్రధాన పోస్టుల్లో ఉన్న ఆమె నిబంధనలకు విరుద్ధంగా రాజకీయంగా వారిపై ఒత్తిడి తెచ్చి కోటలోనే క్వారణ్ంటైన్ ఉండేలా వారిని ప్రేరేపించింది. దీనితో అధికారులు కూడా చేసేది ఏమీ లేక కోటలోనే క్వారంటైన్ ఉండమని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. ఒక గెస్ట్ హౌస్ లో జన సంచారం బాగా ఉండే చోట క్వారంటైన్ ఏమిటో వారికే తెలియాలి. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సింహాచలం దేవస్థానంలో పవిత్ర చందనోత్సవం రోజు ఒక ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ తప్ప ప్రధాన అర్చకుడి కూడా లోపలికి అనుమతి లేదు. అలాంటిది తిరుపతి శ్రీను అనే వ్యక్తి నేరుగా గుడి లోనికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నాడు.

ఇక ఈ విషయం మీడియా ద్వారా బయట పడగా చివరికి ఆలయ ప్రధాన పూజారి గొడవర్తి గోపాల కృష్ణమాచార్యులుని బకరాని చేసి అధికారులు అతనిని సస్పెండ్ చేశారు. సరే ఇంతకీ దీనంతటికీ కారణమైన ఈ శ్రీనివాసులు ఎవరంటే స్వామి వారి సేవలకు సంబంధించిన అన్నింటిని సప్లై చేసే ఇస్కాన్ యాక్టివిస్ట్. ఇక అర్చకుడినే బయట ఉంచి శ్రీనివాసులు అంతరాలయంలో  అనుమతించిన అధికారులు వెనక ఎవరున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంకా ఇలాంటివి చాలానే ఉండగా అన్నింటికీ సంచయిత సమాధానం చెప్పాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ఆమె ఇప్పుడు ట్రస్ట్ చైర్పర్సన్ కాదు ఒక మంచి రాజకీయవేత్త అని అందరి అభిప్రాయం.

author avatar
Siva Prasad

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment