TV 9 Debate: ఏపీ రాజకీయాల్లోకి పుష్ప విలన్..!? వీళ్లు మన నాయకులు..ఇదీ మన రాజకీయం..!

TV 9 Debate: Pushpa Villian in AP Politics?
Share

TV 9 Debate: మనం ఒక బురదలో బతుకుతున్నాం..! నిజమే.., మనందరం ఒక రొచ్చు..ఒక బురదలో బతుకుతున్నాం..! ఆ బురద దేశం మొత్తం ఉందీ. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మరీ ఎక్కువగా ఉంది. భారతదేశం మొత్తం మీద రెండు రకాల బురద ఉంది. ఒకటి కుల బురద, మరొకటి మతం బురద. ఇది దశాబ్దాల తరబడి అలా అలా రొచ్చులా పేరుకుపోయింది. మన ఆంధ్రప్రదేశ్ లో మత బురద కంటే కుల బురద, కుల దురద ఎక్కువ. పార్టీలకు సంబంధం లేదు. నాయకులకు సంబంధం లేదు.. ప్రాంతాలకు సంబంధం లేదు. కులాలకు సంబంధం లేదు. కానీ కుల దురద/బురద ఎక్కువగా ఉంటుంది. అది ఇప్పుడు ఎంత పీక్స్‌కి వచ్చింది అంటే..? టీవీ 9 లో నిన్న ఓ డిబేట్ సందర్భంగా ఒక నాయకుడు మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం కల్గిస్తుంది…!

TV 9 Debate: పుష్పలో విలన్ రెడ్డి అంట.. ఏం చేద్దాం వీళ్ళని..!?

నిన్న టీవీ 9 అనే ఒక నీతి మరీ ఎక్కువగా ఉన్న ఛానెల్ ఓ డిబేట్ నిర్వహించింది. అందులో అన్ని పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఓ పెద్ద విఖ్యాత జర్నలిస్టుగా పిలవబడే రజనీకాంత్ దీనికి వ్యాఖ్యాత, నిర్వాహకుడు కూడా..! ఈ డిబేట్ లో వైసీపీ నాయకుడు ఓ రెడ్డి గారు… మాట్లాడుతూ “.. “పుష్ప” సినిమాలో తప్పుడు పనులు చేసే వారి అందరి పేర్లు (విలన్‌లు) రెడ్డి అనే ఉన్నాయిట. పుష్ప సినిమా నిర్మాతయేమో చౌదరి అట. రెడ్ల మీద వ్యతిరేకత పెరగాలని చంద్రబాబు భావజాలంలో ఇండస్ట్రీలో బలిసి కొట్టుకుంటున్న చాలా మంది నిర్మాతలు ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఈ కామెంట్ చూస్తే ఎంత మన రాష్ట్ర రాజకీయాలు దౌర్బాగ్యంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. ఇది ఎంత దురదో కనబడుతుంది కదా..! అధికార పార్టీకి చెందిన ఓ కీలకమైన నాయకుడు మాట్లాడిన మాటలు ఇవి. టీవీ 9 లో నిన్న జరిగిన చర్చలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఇది చూసిన చాలా మందికి ఈ బురదలో మనం ఎందుకు బతుకున్నామా.. ? అని అనిపించి ఉంటుంది.

TV 9 Debate:
TV 9 Debate:

TV 9 Debate: పుష్పాన్ని ఓ సారి చూసొద్దాం..!

ఆయన చెప్పింది పుష్ప సినిమా గురించి.. పుష్ప సినిమాలో మెయిన్ విలన్ మంగళం శ్రీను. ఆ సినిమాలో మంగళం శ్రీను రెడ్డి కాదు. దీనిలో అందరికంటే పెద్ద విలన్ హీరో కారెక్టరే. పుష్పరాజ్ రెడ్డి కాదు. అలానే ఎంపీ క్యారెక్టర్ చేసిన రావు రమేష్ క్యారెక్టర్ పేరు సిద్ధప్ప, ఆయన పేరు కూడా రెడ్డి కాదు. ఇలా ఒక్కో పాత్ర ఉండగా ఆ ప్రముఖ నాయకుడు టీవీ డిబేట్ లో ఎందుకో రెడ్డి కమ్యూనిటీని తీసుకొచ్చి.., కమ్మ భావజాలాన్ని రుద్దారు..! ఎంత దురద..? ఎంత గజ్జి..? అనేది అర్ధం అవుతోంది. కులం కోసం ఎంతకైనా తెగిస్తారు. కులాల పేరిట జానాలను రెచ్చగొట్టడానికి ఎంత దూరమైనా వెళతారు. ఎంత మాటలైనా మాట్లాడతారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా ఉందనుకోండి, ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన సినిమాలో హీరో క్యారెక్టర్ రెడ్డి పేరుతో చేయలేదా.. అలా చాలా సినిమాల్లో రెడ్డి పేరుతో హీరో క్యారెక్టర్ లు పెట్టారు. చిరంజీవి నటించిన ఇంద్రసేనారెడ్డి ఉంది. అఖండ సినిమా నిర్మాత రవీందర్ రెడ్డి. ఆ సినిమా డైరెక్టర్ బోయపాటి చౌదరి. సినిమాల వరకు వచ్చే సరికి రెడ్డి, చౌదరి, కమ్మ, కాపు అనే తేడాలు ఉండవు. అందరూ ఒకటే. కానీ ఇటువంటి రాజకీయ నాయకులు కులం అనే దరిద్రాన్ని తీసుకువచ్చి రాజకీయాల్లో రుద్దుతారు. ఎలా కావాలంటే ఆలా వాడుకుంటారు. ఆ నిర్మాతలకు అలాంటి ఉద్దేశాలు ఏమీ ఉండవు..! అయితే చంద్రబాబు భావజాలాన్ని, పాత్రని నిరూపించాలి అనుకుంటే..

TV 9 Debate: Pushpa Villian in AP Politics?
TV 9 Debate: Pushpa Villian in AP Politics?

ఏదో అనాలనుకుని.. ఇంకేదో..!

నిజానికి రెడ్డిలకు వ్యతిరేకంగా చంద్రబాబుని చిత్రీకరించడానికి చాలా వేరే మార్గాలున్నాయి. సినీ పెద్దలతో చంద్రబాబుకి సన్నిహిత సంబంధాలు, భావజాలాలు సినిమాలు అనేది నిరూపించడానికి ఇంకా అనేక మార్గాలున్నాయి. అయినా ఉన్నపళంగా చంద్రబాబుని రెడ్డిలకు వ్యతిరేకంగా చూపించినంత మాత్రానా వైసీపీకి ఏమి ఓట్లు గంపగుత్తగా వచ్చి పడిపోవు..! ఆయనను బీసీ, ఎస్సి, ముస్లిం, కాపులకు వ్యతిరేకంగా చూపితే వైసీపీకి ఎంతో కొంత ప్రయోజనం ఉండొచ్చేమో.. అందుకు గతంలో చంద్రబాబు చేసిన కొన్ని నష్టాలు, ఆ కులాలకు చేసిన అన్యాయాలు ప్రస్తావించవచ్చు..! అలా కాకుండా రెడ్డి – కమ్మ మధ్య వైరం కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు.. దీనికి సినిమాను వాడుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు..! అయినా ఈ అసందర్భ వాగుడుకు పెద్దగా చింతించాల్సిన పని లేదు.. ఈ కుల దురద/ బురదలో కూరుకుపోయిన అందరం సిగ్గుపడాల్సిందే. “మనం ఈ బురదకు అలవాటుపడిపోయాం. స్కిన్ డిసీజ్‌లు వస్తే నెలలు తరబడి సంవత్సరాల తరబడి తగ్గవు. ఈ కుల దురద అంతకంటే దారుణమైంది. పుటుకతో వచ్చింది చావుతోనే పోతుంది అన్నట్లు.. ఈ కుల జాడ్యం అనేది రాజకీయం కోసం, సెంటిమెంట్ కోసం, ఇలా రెచ్చగొట్టడానికి తప్పితే.. ఇంకెందుకు..!? ఏ పార్టీ అయినా అంతే, ఏ కులం వారు అయినా అంతే. మన ఆంధ్రప్రదేశ్ అటువంటి బురదలో కూరుకుపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు..!


Share

Related posts

అమరావతి పై బాబు ఆరాటం ఈ రేంజ్ కు వెళ్ళిందా? చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు

siddhu

నేతల కంట్లో ఇసుక..! జగన్ కి ఇదే పెద్ద మసక..!!

Muraliak

Chandrababu : చంద్ర‌బాబుకు క‌ష్టం… వైసీపీ ఎంపీకి బాధ‌!

sridhar