NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

టీవీ-9 లో అంతర్గత లొల్లి..! రజనీ కాంత్ ఉన్నట్టే..! కీలక వికెట్ అవుట్..!!

ఒక వెలుగు వెలగడం ఈజీనే. తగిన ప్లాన్ వేసుకుని, వనరులు సమకూర్చుకుంటే అయిపోతుంది. కానీ ఆ వెలుగుని నిలబెట్టుకోవడమే కష్టం..! అందుకు టీవీ – 9 చక్కని ఉదాహరణ. ఓ సంచలనంగా ఏర్పడి, సంచలనంగా వార్తలు అందించి, సంచలనంగా ఎదిగి, సంచలనంగా కిందకు జారిపోతుంది. పాపం..!! కొత్త యాజమాన్యం వచ్చినా ఏం లాభం లేదు. ఏమి కలిసిరావడం లేదు. ఒకదానికొకటి వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వార్తల ఛానెల్ ఇతర చానెళ్లకు వార్తగా మారుతుంది. టీవీ 9 నుండి రజనీ కాంత్ వెళ్లిపోతున్నారు అనుకున్న సమయంలో ఆయన సేఫ్ గా ఉంటూ మరో కీలక వ్యక్తి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

వరుసగా మార్పులు..! గెంటివేతలు..!!

టీవీ 9 అంటే రవిప్రకాష్. తప్పో, ఒప్పో.., తాను అనుకున్నవి సంచలనాలుగా చూపించి మీడియాని ఓ స్థాయికి తీసుకువెళ్లారు. ఎన్ని అపవాదులు మూటగట్టుకున్న కమర్షియల్ గా బాగా వెళ్ళింది. అటువంటి వ్యక్తిని గెంటేశారు. ఆ తర్వాత అతని నీడలుగా ఉన్న జాఫర్, దీప్తి వంటి వారిని గెంటేశారు. తర్వాత కీలక వికెట్ రజనీ కాంత్ వెళ్ళిపోయినట్టే అంటూ ప్రచారం జరిగింది. మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా రజనీ కాంత్ సేఫ్ అయ్యారు. కొత్త మేనేజ్మెంట్ ప్రతినిధిగా వచ్చిన సింగారావు బయటకు వెళ్లిపోయారు. కొత్త యాజమాన్యం మై హోమ్ రామేశ్వరరావు ఛానెల్ ని తీసుకున్న తర్వాత ఆయన తరపున ప్రతినిధిగా వచ్చిన సింగారావు అన్నిట్లో వేలు పెడుతుండడంతో రజనీ కాంత్ కి నచ్చట్లేదు. ఇటు రజనీ వ్యవహారం కూడా సింగరావుకి నచ్చక.., ఇద్దరూ తాడోపేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రజనీ వెళ్లిపోవాల్సిన తరుణంగా.., ఆయన లోపలకు, సింగరావు బయటకు అనే పరిస్థితి వచ్చింది.

జగన్ కొనడం బూటకమే..! రవి ప్రకాష్ కేసు కీలక దశకు..!!

మరోవైపు టీవీ 9 ని సాక్షి కోనేస్తుంది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంటే ఏపీలో జగనూ, తెలంగాణలో కేసీఆర్ కలిపి ఈ రెండు ఛానెళ్లతో జాతీయ స్థాయికి వెళ్లి.., వెలిగిపోదాం అనుకున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ దీనిలో నిజాలు లేవు. అసలే మీడియాకి రోజులు బాలేవు. సాక్షి కూడా కొంత నష్టాల్లో ఉంది. జగన్ ఛరిష్మా, అధికారం లేకపోతే సాక్షి లేనట్టే. బోలెడన్ని అపవాదులు మూటగట్టుకుంటుంది. జగన్ కి సాక్షి ప్లస్ అవ్వాల్సింది, సాక్షికే జగన్ ప్లస్ అయ్యారు. ఇక ఈ పరిస్థితుల్లో కొత్త ఛానెల్ కొనే సాహసం జగన్ చేయరు. అందుకే టీవీ 9 ని జగన్ కొంటారు అనేది బూటకం.

* ఇక టీవీ 9 ని నాకు అమ్మేయండి, నేను కొనేస్తాను అంటూ రవిప్రకాష్ వేసిన కేసు ఇంకా విచారణ దశలో ఉంది. ఇది కంపెనీస్ లా ట్రిబ్యునల్ లో కీలక దశలో ఉంది. “టీవీ 9 ని అమ్మేయండి. నేను కొనేస్తాను. నేను ఉన్నప్పుడు ఆ ఛానెల్ లాభాల్లో ఉండేది. ఇప్పుడు నష్టాల్లో ఉంది. షేర్లు పడిపోయాయి. ఉద్యోగులు వెళ్లిపోతున్నారు. నా ఛానెల్, నేను కొంటాను, అమ్మిన ధరకే కొనేస్తాను. ఇచ్చేయండి” అంటూ రవి ప్రకాష్ వేసిన కేసులో ప్రస్తుతానికి వాదనలు నడుస్తున్నాయి. ఇది సాధ్యం కాకపోయినప్పటికీ రవి ప్రకాష్ ప్రయత్నం ఆపే పరిస్థితి లేదు. మీడియా మేనేజ్మెంట్ పై పట్టులేని మై హోమ్ రామేశ్వరరావు పూర్తిగా ఓ ట్రైనింగ్ తీసుకుని, వారంలో రెండు రోజులు ఈ ఛానెల్ పై దృష్టి పెడితే తప్ప ఛానెల్ ఒడ్డుకి చేరేలా లేదు..!!

author avatar
Srinivas Manem

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju