NewsOrbit
5th ఎస్టేట్ Featured

టీవీ 5 – ఎన్టీవీ లొల్లి.! సగం విప్పుకున్నారు.! “కమ్మ”గా కలిసిపోయారు.!

* ప్రోమోలతో ఒకరి బొక్కలు ఒకరు బయటకు 

* తమకే నష్టం అంటూ మళ్ళీ కాంప్రమైజ్

* నడిరోడ్డుపై తెలుగు మీడియా చీకటి బాగోతం…!!

మీడియా అంటే పిచ్చి..! మీడియా అంటే మోజు…! మీడియా అంటే క్రేజు…!! అవును తెలుగునాట మీడియా అంటే బీభత్సమైన ఫాలోయింగు ఉంది…! అది కులాలుగా విడిపోయి, కొట్టుకుని, విప్పుకుని, నడిరోడ్డుపై పడినా “నా కులం, నా మీడియా, నా ఛానెల్” అనే తత్వకులు అనేకం…!! కానీ మీడియాలోనే అనేక చీకటి కోణాలున్నాయని, అనేక బాగోతాలున్నాయని తెలిసినా బయటపడిన సందర్భాలు లేవు. కానీ, ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది.

దొంగ దొంగ తన్నుకుని… దొంగిలించిన సొత్తు సంగతి చెప్పేసినట్టు…!
మార్వాడీ మార్వాడీ కొట్టుకుని బంగారం అసలు ధర బయటపెట్టినట్టు…!!
టీవీ 5 – ఎన్టీవీ కొట్లాడుకుని తమ చీకటి వ్యవహారాలను బయట పెట్టుకున్నాయి. ఈ రెండు ఛానెళ్ల ఓనర్ల బట్టలు సగం విప్పేసుకున్నాయి. సగం విప్పితేనే కంపు వ్యాపించింది, ఇక పూర్తిగా విప్పితే తెలుగు మీడియా కంపు ఇంతగా ఉంటుందా..? అనేంత చెందాలంగా ఉంది ఆ బాగోతం అదేంటో సింపుల్ గా ఓ సారి చూసేద్దాం..!!

 

ఎన్టీవీ చౌదరిపై టీవీ 5 ప్రోమో…!!

ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి(కమ్మ) జూబ్లీహిల్స్ లోని హోసింగ్ సొసైటీకి ఎప్పటి నుండో అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను టార్గెట్ చేస్తూ టీవీ 5 ప్రోమో వేసింది. “జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఇంద్రజాలం…! సభ్యుల సంఖ్య ఎంత? వాస్తవంగా ఉన్న సభ్యులు ఎందరు? ఓటర్లుగా మిగిలింది ఎంత మంది? 16 ఏళ్లుగా సొసైటీకి ఎన్నికలకు ఎవరు అడ్డుపడుతున్నారు? అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లు ఎన్ని? అవినీతి పరుల ఇళ్లలో పోగైన సంపద ఎంత? సీఐడీ విచారణ వివరాలు బయటపెట్టాలంటున్న మెజార్టీ సభ్యులు… అందరినీ మింగేస్తున్న అనకొండ… ఎవరీ అనకొండ ఏమిటా కథ… జూబ్లీహిల్స్ జాలి కథలు…!! ఇదే ప్రోమోలో ఉన్న మేటర్.

టీవీ 5 ఓనర్ టార్గెట్ గా ఎన్టీవీ ప్రోమోలు…!!

చేతిలో కర్ర ఉంది. ఎదుటి వాడు కర్రతో కొడితే ఊరుకుంటావా..? అందుకే ఎన్టీవీ కూడా ఊరుకోలేదు. టీవీ 5 యజమాని నాయుడు (కమ్మ)ని టార్గెట్ చేస్తూ ఘాటుగా ప్రోమో విడుదల చేసేసింది. టీవీ 5 నిర్వహిస్తున్న న్యూజెన్ ఆయిల్ పై వేసింది. “అరచేతిపై వెంట్రుకలు మొలిపిస్తానని కొల్లగొట్టిన కోట్లెన్ని? న్యూజెన్ ఆయిల్ తో జనం నెత్తిన రాసిన ఆముదం ఎంత? ఒకటి కాదు… రెండు కాదు..! మోకాళ్ల నొప్పులు తగ్గిస్తానని ఆర్థోజెన్ హైడ్రామా నడిపిందెవరు? ఐసీఎంఆర్, స్టేట్ గవర్నమెంట్ అనుమతి లేకుండా బీఎస్ఎల్ 4 శానిటైజర్లు చేసిందెవరు? ఈ దుర్మార్గాలకు వెన్నుదన్ను ఎవరు? “ఒక నాయుడు వంద లీలలు” అంటూ ఎన్టీవీ ప్రొమో వేసింది.

* ఎన్టీవీలో మరో ప్రొమో కూడా ప్రసారమయ్యింది… ప్రస్తుతం టీవీ5 చానెల్ నిర్వహణ జరుగుతున్న న్యూజెన్ కార్యాలయం గురించి ప్రసారం చేసింది. ఇది చాలా పెద్ద విషయం. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర న్యూజెన్ భవనానికి అనుమతులు ఎలా వచ్చాయ్…? ఏ పర్మిషన్ లేకుండా ఈ అడ్డగోలు నిర్మాణం ఎలా లేచింది? BHEL, పఠాన్ చెరు చుట్టుపక్కల పేదల పొట్టలు కొట్టి భూములు మింగిందెవరు? అంటూ “ఒక నాయుడు..వంద లీలలు” అంటూ ఈ ప్రొమో కూడా ప్రసారం చేశారు.

సగం విప్పుకుని…! “కమ్మ”గా కాంప్రమైజ్ అయ్యారు..!!

ఈ ట్రైలర్లు (ప్రోమో) ఏ రాజకీయ నాయకుడిపైనో, ఏ పార్టీపైనే వేస్తే ఫోన్లు, తర్వాత కోట్లు వచ్చేవి. చానెళ్లకు అది అలవాటే. ప్రోమోలు వేసి, చీకటి బేరాలు నడిపి డ్రాప్ అవ్వడం అలవాటే. అలాగే ఇక్కడ కూడా “కమ్మ”గా కలిసిపోయారు. “నువ్వు దొంగవే- నేను దొంగనే. నువ్వు ఆ కులమే, నేను ఆ కులమే” ఇంకా ఎందుకు ఇంకా చీకటి సొత్తు బయటపెట్టుకోవడం..? అంటూ కాంప్రమైజ్ అయ్యారు. ఓ శక్తి మధ్యలో దూరి కాంప్రమైజ్ చేసింది. నిజానికి ఈ రెండు ఛానెళ్లలో వచ్చిన అంశాలు, ప్రజలకు సంబందించినవి. ప్రజలకే నష్టం కలిగించేవి. అంతగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుని.., అదే స్పీడ్ తో కథనాలు ఆగాయంటే ఆ చీకటి బాగోతం ఎంతగా ఉందొ చూసుకోవచ్చు. ఆ అంశాల ఆధారంగా ప్రభుత్వాలు, శాఖలు స్పందిస్తే బాగోతాలు బయటకు వస్తాయి. చూద్దాం…!! సర్కారుకి, నేతలకు కళ్ళు, కాళ్ళు ఉన్నాయో లేదో…!!

(ఇక ఈ రెండు చానెళ్లు ప్రసారం చేసిన అంశాలపై “న్యూస్ ఆర్బిట్” లోతుగా పరిశోధన ప్రారంభిస్తుంది. ప్రజాప్రయోజన అంశాలుగా పరిగణించి మరింత లోతుకి వెళ్లి నిజాలు బయట పెట్టేందుకు న్యూస్ ఆర్బిట్ ప్రయత్నం చేస్తుంది.)

author avatar
Srinivas Manem

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau