NewsOrbit
5th ఎస్టేట్ Featured

టీవీ 9 రవి ప్రకాష్ తో పాటూ వారూ ఇరుక్కున్నట్టే…!

టివి 9 రవి ప్రకాష్ కేసు అందరికీ తెలుసు కదా… ఫోర్జరీ సంతకాలు కేసులో కొన్నాళ్ళు జైల్లో కూడా ఉండి వచ్చారు…! ఇప్పుడు ఆయనపై ఈడీ కూడా కన్నేసిందన్నమాట. రూ. 18 కోట్లు వ్యవహారంలో మని లాండరింగ్ జరిగింది అని ఆరోపిస్తూ ఈడీ కేసు నమోదు చేసింది. ఇది ఇక్కడితో ఆగుతుందా..? నాటి టివి 9 భాగస్వాములు చుట్టు చేరుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

నాడు మీడియాని శాసించి…!!

రవి ప్రకాష్ టివి 9 సీఈవో గా చాల కాలం చక్రం తిప్పారు. తెలుగు మీడియా రంగాన్ని శాసించారు. పత్రికల విభాగంలో ఈనాడు లాగానే, ఎలక్ట్రానిక్ మీడియా ఛానెళ్లలో టివి 9 అలా వెలిగింది. నిజానికి ఈ రెండు మీడియాల అంతర ఉద్దేశం ఒకటే. ఒక నాయకుడు, ఒక సామజిక వర్గం అజెండాని భుజాన మోస్తూ ఉండడమే. అయితే గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సినవి చేసేసి, చేతులు దులుపుకోవడం రామోజీ తత్వం. అందుకే ఆయన ఎక్కడా దొరకలేదు. (ఒక్క ఉండవల్లికి తప్ప). కానీ రవి ప్రకాష్ చేసినవి చేసేసి, గట్టిగా దొరికిపోయారు. ఒకానొక దశలో రవి ప్రకాష్ ని కాపాడేందుకు స్వయంగా రామోజీరావు రంగంలోకి దిగారు. తెలంగాణ పెద్దలతో చర్చలు జరిపారు. ఇటు వైపు నుండి చంద్రబాబు కూడా పరోక్షంగా రంగంలోకి దిగారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కొన్నాలు జైలు జీవితం గడిపి రవి ప్రకాష్ బయటకు వచ్చారు.

 

ఈడీ ఊరుకోదుగా…!!

టివి 9 ని నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ఖాతా నుండి సెప్టెంబర్ 2018 నుండి అక్టోబర్ 2019 మధ్య కాలంలో రూ. 18 కోట్లు విత్ డ్రా చేశారు. అప్పటి సీఈఓ రవి ప్రకాష్, మరో ఇద్దరు డైరెక్టర్లు కలిసి ఇలా ఫోర్జరీ సంతకాలతో చేసారంటూ మరో డైరెక్టర్ గొట్టిపాటి సింగారావు పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ పిర్యాదు వెనుక కేసీఆర్, మై హోమ్ అధినేత(ప్రస్తుత టివి 9 అధినేత) రామలింగేశ్వరావు కూడా ఉన్నారు. దీంతో కేసు పెద్దదయింది. రవి ప్రకాష్ జైలుకి వెళ్లారు. రామోజీ, ఏబీఎన్ రాధా కృష్ణ, చంద్రబాబు వంటి సామజిక వర్గ పెద్దలు పరోక్షంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. సినీ నటుడు శివాజీ కి కూడా నాడు టివి 9 లో భాగస్వామ్యం ఉండేది అని ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఈడీ గట్టిగా పట్టుకుంటే, ఆరోపణల్లో నిజాలు వెతికి తీసే అవకాశం ఉంది. ఊరికే ఊరుకోదుగా.., రవి వెనుక ఎవరు? రవికి ముందు ఎవరు? భాగస్వాములు ఎవరు? చీకటి స్నేహితులు ఎవరు? అనేది మొత్తం ఆరా తీస్తుంది. చూద్దాం.. ఇంకేమైనా బయటకు వస్తాయేమో.

author avatar
Srinivas Manem

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau