NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vangaveeti Radha: గుడివాడలో ఏం చేస్తున్నారు..!? సైలెంట్ ఆపరేషన్ చేస్తున్న బాబు..?

Vangaveeti Radha: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తరచుగా గుడివాడ లో తరచుగా కాపు నేతలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. అసలు వంగవీటి రాధా రాజకీయ ప్రణాళికలు ఏమిటి..? ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనేది చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అసలు వంగవీటి రాధా గుడివాడలో కాపు నేతలతో సమావేశం అవ్వడం వెనుక అజెండా ఏమిటి..? రాధాకు అక్కడ పోటీ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా..? లేదా.. ఆయన ఏ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు..? .టీడీపీలో ఆయన పాత్ర ఏమిటి..? అనేది విశ్లేషించుకుంటే.. నాలుగైదు నెలల క్రితం కూడా వంగవీటి రాధా గడివాడ వెళ్లారు. కాపు నేతలతో మీటింగ్ పెట్టారు. నేను వస్తాను అంటూ సంకేతాలు ఇచ్చారు. రెండు నెలలు గడిచిన తరువాత విజయవాడలో కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి వాళ్లతో పర్సనల్ గా భేటీ అయ్యారు. ఆ తరువాత తన తండ్రి రంగా విగ్రహావిష్కరణ సభలో తన హత్యకు కుట్ర జరుగుతోందనీ, కొందరు రెక్కీ కూడా నిర్వహిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ తరువాత రంగా రకరకాల కాపు నేతలతో సమావేశమవుతున్నారు.

Vangaveeti Radha gudivada politics
Vangaveeti Radha gudivada politics

Vangaveeti Radha: తన సామాజికవర్గ పెద్దలతో మీటింగ్ అందుకే..?

అటు విజయనగరం నుండి అనంతపురం వరకూ తన సామాజికవర్గ పెద్దలతో మీటింగ్ లు పెట్టారు. తాజాగా గుడివాడలో కాపునేతలతో సమావేశమైయ్యారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. వంగవీటి రాధా గుడివాడ నుండి పోటీ చేయనున్నారు అంటూ వస్తున్న వార్తలు పుకారు మాత్రమే. ఆయన గుడివాడ నుండి పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకు అంటే.. వైసీపీ నుండి గుడివాడకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా మంచి స్నేహితులు అన్నది అందరికీ తెలిసిందే. పార్టీలు వేరు అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వంగవీటి రాధ గుడివాడ నుండి పోటీ చేస్తే ఇద్దరి మధ్య స్నేహ బంధం చెడిపోయి శతృత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. గుడివాడను టీడీపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ తరుణంలో వారి మధ్య ఫ్రెండ్లీ పోటీ అవకాశం ఉండదు. వంగవీటి రాధ మాట కొంత కఠినంగా ఉన్నా, ఆయన రాజకీయం మాత్రం అంత కఠినంగా ఉండదు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన అంత దూకుడుగా వ్యవహరించే నాయకుడు కాదు. మీడియా ముందు ఎమోషన్ లో ఏదో మాట్లాడతారు కానీ రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే స్వభావం కాదు. అందుకే ఆయనకు ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ ఒక స్థాయికి వెళ్లలేకపోయారు.

Vangaveeti Radha: విజయవాడ సెంట్రల్ పైనే ఆలోచన

వంగవీటి రాధా గుడివాడలో తన సామాజికవర్గం వారిని టీడీపీ వైపునకు మళ్లించేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరు పోటీ చేసినా టీడీపీకి మద్దతు ఇవ్వండి అని సూచన చేయగలరు గానీ తాను పోటీ చేస్తాను, తనకు పని చేయండి అని చెప్పే అవకాశం లేదు. ఇదే సందర్భంలో వంగవీటి రాధాకు వల్లభనేని వంశీతోనే అదే రకమైన స్నేహసంబంధం ఉంది. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ కావాలని గతంలో అడిగారు. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా స్ట్రాంగ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతోనే మాత్రమే బొండా ఉమా ఓడిపోయారు. గుడివాడ, గన్నవరం, విజయవాడ సెంట్రల్ లో ఎవరు పోటీ చేసినా కాపు సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించుకునేందుకు వంగవీటి రాధాను ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ కాపు సామాజికవర్గ ఓట్లు అధికంగానే ఉన్నాయి. ఇది ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నప్పటికీ పొత్తులు, మార్పులు అంటున్నారు కావున రాధాకు అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు.

Vangaveeti Radha: తెరవెనుక రాజకీయాలకు..?

విజయవాడ తూర్పు చూసుకుంటే అక్కడ గద్దె రామ్మోహన్ స్ట్రాంగ్ గా ఉన్నారు. పునర్విభజనకు ముందు ఆయన అక్కడ నుండే పోటీ చేశారు కాబట్టి అక్కడ నుండి పోటీ చేయడానికి వంగవీటి రాధా సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. గద్దె రామ్మోహన్ ను ఒక వేళ గన్నవరం పంపితే ఆ స్థానం వంగవీటి రాధాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ వంగవీటి రాధా మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్నే అడుగుతున్నారని సమాచారం. మరో సమాచారం ఏమిటంటే వంగవీటి రాధ ఎక్కడ నుండి పోటీ చేయడం లేదనీ, ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఒక వాదన వినబడుతోంది. వంగవీటి రాధాను తెరవెనుక రాజకీయాలకు ఉపయోగించుకోవాలని టీడీపీ ఆలోచన చేస్తోందని టాక్. వంగవీటి రాధా పోటీ చేస్తారా..? చేయరా..? అనే దానిపై మరో ఆరు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

author avatar
Srinivas Manem

Related posts

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju