Vangaveeti Radhakrishna: వంగవీటి రాధపై జగన్ వ్యూహం..!? పవన్ కు ధీటుగా ఆ వర్గం..?

Share

Vangaveeti Radhakrishna: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వంగవీటి రాధా వ్యాఖ్యల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇటీవల దివంగత వంగవీటీ రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా స్ట్రాటజీ ఉందా, నిజంగా జరిగిందా, నిజంగా జరిగే అవకాశం ఉంటే ఎవరు టార్గెట్ చేస్తారు. ఆయన అంత కాంట్రివర్సీ కాదు. ఆయన ఏమీ వివాదాల జోలికివెళ్లడు. గొడవలకు వెళ్లే టైపు కాదు. మరీ ఆయన్ను ఎవరు టార్గెట్ చేస్తారు. లేక ఇంకేమైనా స్ట్రాటజీ ప్రకారం ఒక పార్టీ తెరవెనుక ఉంటూ ఈయన చేత ఈ వ్యాఖ్యలు చేయించిందా అన్నట్లు రకరకాల అనుమానాలు షికారు చేస్తున్నాయి. ఎందుకంటే ఆ వేదికను పంచుకున్న నాయకులను పోల్చుకుని చూస్తే. తెరమీదకు అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్నది టీడీపీ, జనసేన పొత్తు ఉండబోతున్నది అన్నది. కొద్ది రోజులుగా ఇది ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగైదు నెలల్లో ఆ పార్టీల నుండి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 30శాతం అంటే సుమారు 50లక్షల కాపు సామాజికవర్గ ఓట్లు 60 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ – జనసేన అభ్యర్ధుల విజయానికి అవకాశాలు ఉంటాయి. 2019 ఎన్నికల్లోనూ దాదాపు 30కిపైగా నియోజకవర్గాల్లో జనసేన ఎక్కువ ఓట్లు చీల్చిన కారణంగా వైసీపీ అభ్యర్ధులు గెలిచారు.

Vangaveeti Radhakrishna ycp strategy ..?
Vangaveeti Radhakrishna ycp strategy ..?

 

Vangaveeti Radhakrishna: విజయవాడ సెంట్రల్ ఇస్తే..

ఆ ఫ్యాక్టర్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ను, ఆ సామాజికవర్గాన్ని ఎదుర్కోవాలంటే ఈ సామాజికవర్గం నుండి బలమైన నాయకుడు ఉండాలి అని చూసే క్రమంలో వంగవీటి రాధపై చూస్తుండవచ్చు. వంగవీటి రాధా బలమైన నాయకుడు అనే కంటే ఒక బ్రాండ్ ఉన్న నాయకుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే దివంగత నేత వంగవీటి రంగా వారసుడుగా రాధాకు ఒక బ్రాండ్ ఉంది. బ్రాండ్ వేరు, బలం వేరు. ఉదాహరణకు చూసుకుంటే కర్నూలు కోట్ల సూర్యప్రకాశరెడ్డికి ఒక బ్రాండ్ ఉంది. కోట్ల విజయభాస్కరరెడ్డి రూపంలో. కానీ మొన్నటి ఎన్నికల్లో బలం లేక ఓడిపోయారు. అదే విధంగా నారా లోకేష్ చంద్రబాబు కుమారుడుగా ఒక బ్రాండ్. కానీ మంగళగిరిలో ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపునకు బ్రాండ్ పని చేయదు. బలమే పని చేస్తుంది. వంగవీటి రాధాకు బలం లేదు కానీ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ను వాడుకుని 2024 ఎన్నికల్లో కాపు సామాజికవర్గంలో కొంత మేర వైసీపీ లబ్దిపొందాలన్న వ్యూహంలో భాగంగా వంగవీటి విజయవాడలో అడుగుతున్న సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆయనకే ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ ఇవ్వనన్నారు కాబట్టే ఆయన పార్టీ మారారు. అప్పుడు పీకే (ప్రశాంత్ కిషోర్) స్ట్రాటజీ ప్రకారం సెంట్రల్ నియోజకవర్గం బ్రాహ్మణులకు ఇస్తేనే  గెలుస్తుందని చెప్పడంతో మల్లాది విష్ణుకు ఇవ్వడం కోసం రాధకు నో చెప్పడంతో పార్టీ మీద అలిగి టీడీపీలో చేరారు. టీడీపీలో కూడా సెంట్రల్ నియోజకవర్గం ఇవ్వకపోయినా ఎక్కడ నుండి పోటీ చేయలేదు.

కాపు సామాజికవర్గ ఓట్ల కట్టడి కోసం

ఇప్పుడు ఆయన మిత్రులు వల్లభనేని వంశీ, కొడాలి నాని వైసీపీలో ఉన్నారు. వంశీ అయితే దాదాపు రెండు దశాబ్దాలకుపైగా వంగవీటి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఫ్యామిలీ రిలేషన్స్, వ్యక్తిగత స్నేహం నేపథ్యంలో వాళ్లు ఇద్దరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి రాధ కూడా ఆ పార్టీలో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మరో పక్క వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కూడా వంగవీటి రాధా పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఆయన అడిగిన సీటు ఇచ్చేస్తే టీడీపీ జనసేన పోత్తులో భాగంగా కాపు సామాజికవర్గ ఓట్లు కొంత మేరకు వెళ్లకుండా చేయవచ్చు అనేది ఒక ప్లాన్. ఒక వేళ ఇదే గనుక నిజమైతే భవిష్యత్తులో టీడీపీ వాళ్లే నా మీద ఇలా చేయించారు అని కూడా రాధాతో చెప్పించే అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి రెక్కీ నిర్వహించడం వాస్తవం అయితే ఎవరు చేశారు అనేది ఆయనే పూర్తి స్థాయిలో వెల్లడించాల్సి ఉంటుంది. ఆయన సగమే చెప్పి వదిలివేయడంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వెంటనే జగన్మోహనరెడ్డి స్పందించి 2 ప్లస్ 2 గన్ మెన్ల భద్రత ఇవ్వడం, విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇవడం చూస్తుంటే వైసీపీ ఆయనకు స్వాగతం పలుకుతుందనీ, ఆ సెంట్రల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందనీ ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇది ఎంత వరకు నిజమనేది రాధా నోటి నుండే రావాలి. టీడీపీలో సెంట్రల్ నియోజకవర్గం ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి వైసీపీ ఇస్తే వెళ్లే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఆ తరువాత ఆ పార్టీ స్ట్రాటజీ ప్రకారం మాట్లాడే అవకాశాలు ఉంటాయి. చూడాలి ఏమి జరుగుతుందో?


Share

Related posts

ఆందోళనకరంగా ట్రంప్ ఆరోగ్యం.. 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్న వైద్యులు

Varun G

హనిమూన్ కి వెళ్లిన జంట జైలుపాలయ్యింది.. కారణం ఏమిటో తెలిస్తే షాక్?

Teja

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ గురించి కంగనారనౌత్ షాకింగ్ కామెంట్స్..!!

sekhar