NewsOrbit
5th ఎస్టేట్

స్ట్రాంగ్ – వీక్ – సూపర్ హిట్ – డిజాస్టర్ – జగన్ దారెటు?

జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. అంతా…. జగన్ తన తొమ్మిదేళ్ల ప్రతిపక్షంలో అధికార పార్టీ వారు చేసే తప్పులను చూసి బాగా రాటుదేలాడు అని జగన్ తన అధికారం చేపట్టిన తొలినాళ్లలో తీసుకున్న నిర్ణయాలను చూసి అభిప్రాయపడ్డారు. అయితే ఏడాది కాలంలో జగన్ పార్టీ తీరు ఎలా ఉంది? మరీ ఘోరంగా ఉందా లేదా సూపర్ హిట్టా? పర్వాలేదా?

జగన్ ఏడాది పాలన పూర్తయ్యే చాలా రోజులు అయినా ఇప్పటికీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే పెద్ద చర్చగా నడుస్తోంది. ముందుగా నవ రత్నాలు, మద్యం నియంత్రణ, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం వంటి విషయాలను పక్కన పెడదాం. విశ్లేషకులు ఇప్పుడు పాలనా సామర్థ్యాన్ని ప్రజాదరణ తో పాటు రాష్ట్ర రాజకీయ నాయకుల తీరుని విశ్లేషించే ప్రక్రియను చేపట్టు చివరికి ఒక నివేదిక ను ఇస్తున్నారు.

YS Jagan Mohan Reddy: HC orders CBI probe into death of YS Jagan ...

ఇక దారిలొ వెళ్తే…. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వివిధ రకాల ప్రలోభాలకు గురి చేసి వైసీపీకి చెందిన 23 ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. గతంలో వారు పదవికి రాజీనామా చేయలేదు సరికదా తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని అసెంబ్లీలో కూడా చెప్పలేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం లోని వినియోగించుకొని తతంగం అంతా నడిపారు. నాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా ఎక్కడా ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇకపోతే జగన్ మాత్రం విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

పదవికి రాజీనామా చేసి తమ పార్టీలో చేరాలని షరతు పెట్టినా అది దాదాపు అసంభవమైన పని. అయితే ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో రూపు మారింది ఇక్కడే. ఎక్కడా ఎన్నడూ లేని విశంగా కొత్త రాజకీయాలకు తెరదీశారు. ఉదాహరణకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం తమ పదవులకు రాజీనామాలు చేయకుండానే జై జగన్ అనేశారు. వీరంతా సాంకేతికంగా టిడిపిలో ఉన్నా వైసీపీలో కొనసాగుతున్నట్లు లెక్క. పదవి లేని వారు మాత్రం దర్జాగా వైసీపీ కండువా కప్పుకున్నారు.

దీనిపై ప్రజల్లో చాలా తక్కువ శాతం వ్యతిరేక భావం వస్తుండగాచాలా శాతం మందికి అసలు రాజకీయాన్ని అర్థం చేసుకోలేక జగన్ ఏం చేసినా కరెక్టే అని అనేస్తున్నారు. అయితే టిడిపి వారు మాత్రం జగన్ తన నియమాన్ని పక్కన పెట్టేశారు అని తమ పార్టీ ఎమ్మెల్యేలను మభ్య పెడుతున్నారని ఆరోపణలు చేస్తూనే ఉన్నావైసిపి మాత్రం అంతా తమకు అనుకూలంగానే ఉందని నోరు మెదపకుండా ఉంటున్నారు.

అయితే ఇక్కడ జగన్ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అధికార పార్టీలోనికి ప్రతిపక్షం నుండి వచ్చే చేరతారో నియోజకవర్గంలో అధికార పార్టీకి చాలా వరకు ప్రజాదరణ తగ్గిపోతుంది. ఇది గతంలో అనేక సార్లు నిరూపితమైంది కూడా. అయితే ఇక్కడే బాబు పెద్ద తప్పటడుగు వేశాడు. ఎలాంటి స్పష్టత లేకుండా మా పార్టీ వారిని లూటీ చేస్తున్నారని తొందరపాటు ఆరోపణలు చేయడంతో ప్రజలకు విసుగొచ్చినువ్వు చేయగా వీరు చేస్తే తప్పేంటి అంటూ ఉండగా సీన్ మొత్తం ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. అంతా ఇక్కడ మనకు బాబు స్వయంకృతాపరాధం తప్ప ఏమీ కనిపించదు.

ఇక పోతే ఫిరాయింపుల విషయంలో గతానికి ప్రస్తుతానికి ఒక్కటే తేడా. పార్టీ మారేందుకు చంద్రబాబు లాగా జగన్ బంపర్ ఆఫర్ లు ఏమీ ఇవ్వడంలేదు. ప్రలోభాలకు గురి చేయడం లేదు. కేవలం వారి యొక్క ప్రతిపక్షం హోదాని దెబ్బతీయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆఖరికి మంత్రిపదవులను కూడా ఆశగా చూపించలేదు. అయినా వారంతా గోడదూకేందుకే మొగ్గుచూపుతున్నారు అంటే వైఫల్యం ఎవరి లో ఉన్నట్టు? ప్రతిపక్షం పార్టీ ఇప్పుడు కూడా తమ తప్పులు తెలుసుకోలేక పతనమవుతూ ఉంటే అధికార పార్టీ ముందంజలో ఉన్నట్లు కాదా? వారి ఏడాది పాలన బంపర్ హిట్టు అయిన్నట్లే కదా. వారిని కాదనేందుకు వారి పాలనలో తప్పులు లేనట్లే కదా. అంటే చివరికి వారు ఇన్ని రోజుల్లో ప్రజలతో పాటు ప్రతిపక్షాన్ని కూడా మెప్పించారు అనే కదా. ఇంతకన్నా పెద్ద విజయం ఏముంటుంది.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau