NewsOrbit
5th ఎస్టేట్

ఏపీ అప్పుల ఊబి : జగన్ – చంద్రబాబు ఇద్దరిదీ ఈ పాపం

స్వర్ణాంధ్ర గా పేరొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజంగా బాగా అభివృద్ధి లోకి వస్తుంది అనుకుంటున్న సమయంలో విభజన వల్ల ఉత్తి ఆంధ్రప్రదేశ్ గా13 జిల్లాల తో మిగిలిపోయింది. తెలంగాణ లో హైదరాబాదు అంత మహానగరంగా తయారయ్యేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే ఆంధ్ర ప్రజలు ఓటు వేశారు. ఇక్కడ కూడా ఆయన స్వర్ణాంధ్ర చేస్తాడు అని ఆశపడ్డారు కానీ బాబు ఐదేళ్ల పాలనలో చివరికి మిగిలింది అప్పులే ఆర్థిక నిపుణులు లెక్కలు కట్టారు. కానీ టిడిపి వారు మాత్రం వాటిని ఖండించి ఖండించి ఓపిక చనిపోయి చాలా విచిత్రంగా ఇక్కడ అప్పుల తప్పులు జరిగాయని ఒప్పుకుంటున్నారు.

NewsSting - Naidu writes a letter to Jagan, alleges of scam in ...

మొత్తం రెండున్నర లక్షల కోట్ల అప్పు చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో చేశారని వైసీపీ నేతలు లెక్కలు చెప్పారు. విభజన కాలం నాటి అప్పులు 90 వేల కోట్లను జతచేస్తే మొత్తం మూడున్నర కోట్లకు పైగా అప్పుతో ఏపీ ఖజానా జగన్ చేతికి వచ్చింది. ఇప్పుడు జగన్ సీఎంగా ఏడాది పనిచేశారు. టిడిపి నుంచి కూడా అవే విమర్శలు వస్తున్నాయి. జగన్ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బాబు జమానాలో ఆర్థికమంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు అన్నాడు. దీంతో వైసిపి వారు ఖండించి ఎందుకు పరువు పోగొట్టుకోవడం అని తామూ చేశామని ఒప్పుకున్నారు.

అయితే అసలు తెలుగుదేశం పాలనలో ఏటా 20 వేల కోట్ల రూపాయల అప్పుగా తెచ్చామని యనమల అంటుండగా మొన్నటిదాకా వారి పార్టీ వారు అంతా అసలు తాము అప్పే చేయలేదని…. ఏపీ సంపదను ఇంకా భారీగా పెంచామని…. ప్రస్తుతం ఉన్న వైసిపి వారికి ఏమీ అర్థం కావడం లేదని చంద్రబాబుతో సహా పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తు చేయాలన్న ఆత్రుతలో గొంతులో నుంచి యనమల వారు పచ్చి నిజాలను కక్కేశారు. సరే యనమల చెప్పింది అక్షరాలా నిజం అనుకున్నా ఐదేళ్ల కాలానికి దాదాపు లక్ష కోట్లు టిడిపి అప్పులు తెచ్చి పెట్టింది. అన్నమాట మరి తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో ఏవైనా శాశ్వత అభివృద్ధి పనులు జరిగాయి అంటే ఎవరికి ఏమి కనిపించడం లేదు.

ఇక జగన్ సర్కార్ కేవలం ఏడాది కాలంలోనే 80 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏపీని అగాధం లోకి నెట్టేసింది అని యనమల ఆరోపించారు. ఇప్పుడు కూడా యనమల చెప్పిన మాటలను తీసుకుంటే ఐదేళ్ల పాలనలో వైసీపీ అక్షరాల నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది అన్నమాట. ఇప్పుడున్న మూడున్నర లక్షల కోట్లకు నాలుగు లక్షల కోట్లను కలిపితే ఏపీని బాగు చేయడానికి దేవుడు దిగి రావాల్సిందే అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అప్పు చేయడం తప్పు కాదు. ఇప్పుడు అప్పులూ వడ్డీలు జనాలకు మాత్రం తరతరాల భారంగా మారుతున్నాయన్నమాట.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau