NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: జగన్ మైండ్ లో ప్లాన్ బీ..! హైకోర్టు తీర్పుపై వైసీపీ రివర్స్ గేమ్ సిద్ధం..!?

YS Jagan: అమరావతి రాజధానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అందరికీ తెలిసిందే. ఏపీ హైకోర్టు..అమరావతి రాజధానికి సంబంధించి కీలక తీర్పు ఇచ్చింది. అయితే మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్న ప్రభుత్వం వద్ద ఇప్పుడు ఉన్న పరిష్కారం ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది అంటే..రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతి నుండి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని తెలిపింది. పిటిషనర్లందరికీ కోర్టు ఖర్చుల కింద రూ.50వేల చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని, అక్కడి నుండి అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని చెప్పింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది.

YS Jagan new plan for three capitals
YS Jagan new plan for three capitals

 

YS Jagan: వ్యతిరేక తీర్పు వస్తుందని ముందే ఊహించే..

సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని, ఆరు నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూములను తనఖా పెట్టేందుకు వీలులేదని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు అందరూ ఊహించిందే. ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల బిల్లు చట్టబద్దమైనది కాదు అని, దానిలో అనేక లోపాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఆ బిల్లులో లోపాలు ఉన్నాయి కాబట్టి దానిపై హైకోర్టు నుండి వ్యతిరేక తీర్పు వస్తుందని ముందే ఊహించిన ప్రభుత్వం ఆ మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంది. సీఆర్డీఏ రద్దు బిల్లును ఉపసంహరించింది. హైకోర్టు ఈ తీర్పు ఇవ్వకముందే ప్రభుత్వం దీన్ని ఊహించి ఆ పని చేసింది.

CM YS Jagan 1000 Days: How Many Marks..!?

YS Jagan: మళ్లీ వికేంద్రీకరణ బిల్లు

కోర్టు చెప్పింది కదా అమరావతే రాజధాని అనుకుంటే పొరపాటుపడినట్లే. ఎందుకంటే ప్రభుత్వానికి చట్టబద్దంగా బిల్లు లేదని తెలుసుకుని వెనక్కు తీసుకువచ్చిన ప్రభుత్వం మళ్లీ చట్టబద్దంగా ఉండే బిల్లును కఛ్చితంగా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. సీఎం జగన్మోహనరెడ్డి నవంబర్ నెలలో ఆ బిల్లును వెనక్కు తీసుకునే సమయంలోనే చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు మళ్లీ తీసుకువస్తాం. చట్టబద్దమైన బిల్లు తీసుకువస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం దీనిపై ఏమి చేయబోతున్నది అంటే.. కచ్చితంగా రాజధాని వికేంద్రీకరణ జరిపిస్తుంది. జగన్మోహనరెడ్డి సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దాన్ని ఎవరు అంగీకరించినా..అంగీకరించకపోయినా ముందుకు వేళ్లే స్వభావం ఆయనది.

YS Jagan: న్యాయపరమైన చిక్కులు లేకుండా చట్టబద్దంగా

విశాఖపట్నంపై ఆయనకు అమితమైన ప్రేమ ఉండటం వల్ల విశాఖను రాజధానిగా చేయడం కోసం ఏదో ఒకటి చేస్తారు. కాకపోతే ఈ సారి తీసుకువచ్చే బిల్లును చట్టబద్దంగా తీసుకువస్తారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చట్టం ఆమోదించేలా ఎటువంటి లోపాలు లేని వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుంది. మళ్లీ హైకోర్టులో ఏవరో ఒకరు పిటిషన్ వేస్తారు. మళ్లీ కొంత కాలం విచారణ తప్పకపోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన తీర్పు అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు అధికార పక్షం ఊహించిందే. హైకోర్టు తీర్పు వచ్చేసింది ఇక రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని అనుకుంటే పొరబాటు పడినట్లే. ప్రభుత్వం వద్ద అందుకు తగిన విధంగా ప్రణాళికలు ఉన్నాయి. ఏమి చేయాలో..ఏలా చేయాలో అలానే ముందుకు సాగుతుంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎటువంటి లోపాలు లేకుండా ప్రభుత్వం త్వరలో తీసుకువచ్చే వికేంద్రీకరణ బిల్లును అమరావతి మద్దతుదారులు ఏ విధంగా అడ్డుకుంటారు. అప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పే కీలకం కానుంది.

author avatar
Srinivas Manem

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju