YS Jagan: జగన్ సీక్రెట్ పాలిటిక్స్..!

YS Jagan: CM Risky Games Will Decide..
Share

YS Jagan: రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మీడియాలను ఏర్పాటు చేసుకున్నాయి. వైసీపీకి సాక్షి మీడియా ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు టీడీపీ అనుకూలమని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజశేఖరరెడ్డి కాలం నుండి ఆ రెండు పత్రికలు అంటూ విమర్శించే వాళ్లు. ఆ తరువాత ఎల్లో మీడియా అంటూ వైసీపీ జనాల్లోకి తీసుకువెళ్లింది. ప్రస్తుతం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఏమి చేస్తున్నారు ? వచ్చే ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి ప్రణాళికలు ఏమిటి ? జగన్మోహనరెడ్డి ఇంట్లో కుర్చుని పబ్జీ ఆడుకుంటారా ? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం నిజమా..? జగన్మోహనరెడ్డి రోజు వారి నాన్న గారి ఆత్మతో మాట్లాడతారా..?  ఏబీఎన్ ఆర్కే అయిదారు నెలల క్రితం రాసిన రాతలు నిజమా..? జగన్మోహనరెడ్డి చేస్తున్న ప్రణాళికలు ఏమిటి..? ఆయన వ్యూహం ఏమిటి..?  ఆయన రాజకీయం ఏమిటి..? ఆయన శైలి ఏమిటి..? ఆయన వ్యక్తిత్వం ఏమిటి..?  అనే విషయాలను టీడీపీ సోషల్ మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసిందా ? అంటే చేయలేదు. ఎప్పుడూ కూడా రాజకీయంగా ఉన్న ప్రత్యర్ధిని తక్కువగా అంచనా వేయకూడదు. లేని అవాస్తవాలను ప్రచారం చేయకూడదు. దాని వల్ల ధీమా పెరిగిపోతుంది. జగన్మోహనరెడ్డి నిజంగా ఆయన చేస్తున్న పని వేరు. అయితే టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం వేరు. టీడీపీి పట్టాభి.. జగన్ పబ్జీ ఆడుతుంటారనీ, పబ్జీ జగన్ అని విమర్శిస్తుంటారు. ఏబీఎన్ ఆర్కే ఏదేదో రాస్తుంటారు. ఇవన్నీ వాస్తవాలు కావు. ఎందుకంటే జగన్మోహనరెడ్డి ఆలోచనా దృక్పదం చాలా చురుకు. ఆయన రాజకీయ వ్యూహాలు చాలా షార్ప్ గా ఉంటాయి. వాటిని ఛేదించడం చాలా కష్టం.

 

YS Jagan: అఫెన్స్ ఆట ఆడుతున్న జగన్

ఆటగాడు చదరంగంలో ప్రత్యర్ధికి చెక్ పెడుతూ ఉంటే అతను డిఫెన్స్ లో పడి చెక్ మేట్ నుండి తప్పించుకునే పనిలో పడిపోతాడు. ఇక్కడ రాజకీయాల్లో జగన్మోహనరెడ్డి చెక్ మేట్ చెబుతుంటే మాటిమాటికీ దాని నుండి తప్పించుకోవడం తెలుగుదేశం పార్టీ పని అవుతుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో జగన్మోహనరెడ్డి ఇదే రకంగా నెలకు ఒక వ్యూహం, నెల కొక స్ట్రాటజీ అమలు చేస్తూ ఉంటే దాని నుండి తప్పించుకోవడమే టీడీపీ పని అయిపోయింది. టీడీపీ ఎదురు దాడి చేయలేదు. ఎదురు వ్యూహం వేయలేదు. చదరంగంలో వరుసగా నాలుగైదు సార్లు చెక్ పెడితే ఎదుటి వాడికి ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. డిఫెన్స్ మూడ్ లోకి వెళ్లిపోతాడు. అటాక్ మూడ్ లోకి రాలేడు. అటాక్ మూడ్ లోకి వచ్చి చెక్ మేట్ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఈ లోపు మనశ్సాంతి కరువు అవుతుంది. చదరంగంలో చెక్ మేట్ లాగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న వ్యూహం, స్ట్రాటజీ అదే. ప్రత్యర్ధులకు వరుసపెట్టి చెక్ చెబుతూనే ఉన్నారు. వీళ్లు దాన్ని తప్పించుకునే పనిలోనే ఉన్నారు. జగన్మోహనరెడ్డి రోజు 18 గంటలు రాజకీయంగానే ఆలోచన చేస్తారు. రాజకీయ వ్యూహాలనే ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క చాన్స్ ఇవ్వండి 30 సంవత్సరాలు సీఎంగా ఉండేలా పరిపాలన చేస్తాను అని అన్నారు. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ (పీకే) రాజకీయ స్ట్రాటజీలు అమలు చేస్తున్నారని చాలా మంది అంటుంటారు. కానీ జగన్మోహనరెడ్డి ఆలోచనా విధానాలకు అనుగుణంగానే పీకే టీమ్ వ్యూహాలు, స్ట్రాటజీలు అమలు చేస్తుంటారు గానీ పీకే వ్యూహాలకు తగినట్లుగా జగన్మోహనరెడ్డి పని చేయరు. ఆయన వ్యూహాలను అమలు చేయాలి. పీకే వ్యూహం, జగన్మోహనరెడ్డి వ్యూహం కలవాలి.

 

రోజుకు 18 గంటలు అదే వ్యూహాలపై మథనం..?

ఆయన క్యాంప్ ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా రోజులో 16 నుండి 18 గంటల పాటు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి.? ఏయే వర్గాలు అసంతృప్తిగా ఉన్నారు..? ఆ వర్గాలను ఎలా దగ్గరకు చేసుకోవాలి..?  రాజకీయంగా ఎదగాలంటే ఏమి చేయాలి..? అనే విషయాలపైనే ఆలోచన ఉంటుంది. రాష్ట్రంలో ఇన్ని కులాలు ఉన్నాయి..? వీటికి కార్పోరేషన్ లు పెట్టాలని గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించిందా..? కానీ జగన్మోహరెడ్డి ఆ కులాలను గుర్తించి కార్పోరేషన్ లు ఏర్పాటు చేశారు. కార్పోరేషన్ లలో మేయర్ లతో పాటు డిప్యూటి మేయర్ పదవులు రెండు ఇవ్వవచ్చని గానీ గతంలో ఎవరికైనా తెలుసా..?  తెలియలేదు. కానీ జగన్మోహనరెడ్డి పంచాయతీలు మొదలు కొని కార్పోరేషన్ల వరకూ ఉప సర్పంచ్ లు, వైస్ చైర్మన్ లు, వైస్ ఎంపీపీలు, డిప్యూటి మేయర్ పదవులు రెండు చొప్పున ఇచ్చారు. దీని వల్ల ఎక్కువ మందికి పదవులు ఇచ్చి సంతృప్తిపర్చాలి అన్నది జగన్మోహనరెడ్డి ఆలోచన. ఎక్కువ మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది లక్ష్యం. దీని వల్ల కొత్త నాయకత్వం తయారు చేయడం. ఇది రాజకీయ వ్యూహాల్లో ఒక భాగమే. వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం వల్ల వారు పార్టీలో సంతృప్తికరంగా పని చేస్తారు. చంద్రబాబు ఇలా కార్పోరేషన్ లు ఏర్పాటు చేసి పదవులు ఎందుకు ఇవ్వలేకపోయారు..? ఇలా జగన్మోహనరెడ్డి పదవులు ఇవ్వడం వల్ల ఆ వర్గాల్లో ఆత్మ సంతృప్తి ఏర్పడుతుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ కులంలో పదవులు ఇచ్చారన్న భావన వారిలో వస్తుంది. ఓ పక్క పార్టీ క్యాడర్ చేజారకుండా పదవులు ఇస్తున్నారు. మరో పక్క ఓటర్లు చేజారిపోకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు జగన్మోహనరెడ్డి. అటు రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీలు కోలుకోకుండా వరుసగా చెక్ మేట్ ల మాదిరి స్ట్రాటజీల స్ట్రాటజీలు వదులుతున్నారు. ఇటీవల రీసెంట్ గా తెరమీదకు వచ్చింది కాపు సామాజికవర్గ స్ట్రాటజీ. ఈ క్రమంలో సీఎం జగన్ పై టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం ఆ పార్టీకే నష్టం కలుగజేస్తుందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.


Share

Related posts

నాయిని కోసం కేసీఆర్ ఎందుకు ఏడ్చారో తెలుసా..!?

Muraliak

మా మెగాస్టార్ సినిమాలో హీరోయిన్ లేకపోతే అలాంటి సినిమా మాకొద్దంటున్న ఫ్యాన్స్ ..?

GRK

కీలక పాయింట్ మీద మోడీ కి దగ్గరవుతున్న జగన్

Yandamuri