NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

YS Viveka Case: సీబీఐ లీకులు.. చిన్నోళ్లకు షాకులు.. పెద్దోళ్ల కు షేకులు..!!

YS Viveka Case: CBI Mind Game with Criminals..?

YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎవ్వరికీ అర్ధం కానీ రీతిలో సాగుతుంది. సీబీఐ ఒక మైండ్ గేమ్ ప్రకారం దర్యాప్తు చేస్తుందని కొందరికి అర్ధమవుతున్న.., సీబీఐ పై ఉన్న ఒత్తిళ్ల కారణంగా కావాలనే ఇలా జాప్యం చేస్తుందని కొందరికి అర్ధమవుతుంది.. మొత్తానికి విచారణ మాత్రం కీలక దశకు చేరుకుంది అనేది కచ్చితంగా చెప్పవచ్చు..! అయితే ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు రాజకీయ పలుకుబడి ఉన్న వారు అనేది విచారణ జరుగుతున్న తీరును చూస్తూ అర్ధం చేసుకోవచ్చు..! రాజకీయ ప్రమేయం లేని కేసు అయితే ఈ పాటికే సిట్ దర్యాప్తులోనో, సీబీఐ కేసు టేకప్ చేసిన తొలి నాళ్లలోనే కేసులు ఛేదించి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపించే వారు. ఈ కేసును ఛేదించే క్రమంలో సీబీఐ ఓ వినూత్న ఐడియా వేసింది. నేరుగా పెద్ద చేపను పట్టుకోకుండా చిన్న చేపను ఎర వేసే పని స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో భాగం వైసీపీ ముఖ్యనేతలకు అనుచరులుగా ఉన్న వారిని సీబీఐ పదేపదే విచారణ చేస్తున్నది. కొందరిని ఈ కేసులో అరెస్టు చేస్తున్నట్లుగా కూడా లీక్ లు ఇస్తోంది సీబీఐ.

YS Viveka Case: చిన్న కార్యకర్తకు పెద్ద స్థాయిలో ఇంటరాగేషన్..!?

వైసీపీ కార్యకర్తగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ గడచిన 45 – 50 రోజులుగా విచారణకు పిలిపిస్తూనే ఉంది. అతనితో పాటు వివేకా ప్రదాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, వాచ్ మెన్ రంగన్న, ఆసుపత్రి ఎండిగా ఉన్న ప్రసాదరెడ్డిలను విచారణకు పిలిచి విచారించింది. ఇలా చిన్న చిన్న వాళ్లను సీబీఐ పిలిచి విచారిస్తున్నది కానీ సునీతా రెడ్డి అనుమానితుల జాబితాలో పేర్కొన్న కడప ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి లను మాత్రం విచారణకు పిలవలేదు. వీళ్లను విచారించాలంటే ముందుగా వీళ్ల అనుచరులను విచారించి వాళ్ల వద్ద నుండి పూర్తి సమాచారాన్ని రాబట్టి కొన్ని ఆధారాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న తరువాత వాళ్ల విచారణకు పిలవాలని సీబీఐ భావిస్తున్నట్లు ఉంది. సిబీఐ అధికారులు అనుమానించినట్లే ఓ సంఘటన ఇప్పుడు జరిగింది.

YS Viveka Case: CBI Mind Game with Criminals..?
YS Viveka Case CBI Mind Game with Criminals

* గుమ్మడి కాయల దొంగ అంటే బుజాలు తడుముకున్నట్లు..అన్న సామెత మాదిరిగా సునీల్ కుమార్ యాదవ్ విషయంలో సీబీఐ అధికారుల అనుమానం నిజం అయ్యింది. వైసీపీ చిన్న కార్యకర్త అయిన సునీల్ కుమార్ ను అనుమానించి సీబీఐ అధికారులు వారి స్టైల్ లో విచారించారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. తనపై సీబీఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనీ, లైడిటెక్టర్ పరీక్షలు చేశారనీ, వివేకా హత్య కేసును తనపై బనాయించి అరెస్టు చేసే ఆలోచనలో సీబీఐ అధికారులు ఉన్నారనీ, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సీబీఐ అధికారులు తనను విచారణకు పిలవకుండా చూడాలని, ఒక వేళ విచారణకు పిలిస్తే న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సునీల్ కుమార్ కోర్టును అభ్యర్థించాడు. ఓ సాధారణ కార్యకర్త ఈ విధంగా హైకోర్టును ఆశ్రయించాడు అంటే అతని వెనుక బలమైన నాయకుడు ఏవరో ఉన్నారు అని సీబీఐ రూడికి వచ్చింది.

YS Viveka Case: CBI Mind Game with Criminals..?
YS Viveka Case CBI Mind Game with Criminals

సునీల్ తోక ఈదుతూ చాలా మంది..!?

ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ తో సన్నిహితంగా ఉండే వంశీ, గోవర్థన్ తదితర వ్యక్తులను నిన్న సీబీఐ పిలిచి విచారణ చేసింది. సునీల్ కుమార్ యాదవ్ నెట్ వర్క్ ను ఛేదిస్తే అతనిని నడిపిస్తుంది ఎవరు అనేది సీబీఐకి ఆధారం దొరుకుతుంది. వాచ్ మెన్ రంగన్న తదితరుల ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పెడితే హంతకులు ఈజీగా బయటకు వస్తారని, అందుకే హంతకులను అష్టదిగ్బంధం చేసే ఆలోచనలో భాగంగా బలమైన ఆధారాల సేకరణలో సీబీఐ నిమగ్నమై ఆ దిశగా దర్యాప్తును కొనసాగిస్తున్నది. వివేకా హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది కొంత మేర సమాచారం రాబట్టిన సీబీఐ అందుకు సంబంధించి బలమైన ఆధారాల సేకరణ చేస్తున్నది. వారం పది రోజుల్లో ఈ కేసును ఛేదించి అసలైన ధోషులను పట్టుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju