NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka: వివేకా కేసులో ఇదే ఫైనల్..! ఆ ఒక్కరి చేతిలో సీబీఐ భవిత..!?

YS Viveka: ఏపి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏకైక కేసు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసు విషయంలో ఎవరు హత్య చేశారు..? ఎవరు చేయించారు..? ఎందుకు చేయించారు..?  అనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా సీబీఐ దర్యాప్తు జరుపుతున్న కేసుల్లో ఇదే అత్యంత క్లిష్టమైన కేసుగా భావించాల్సి వస్తుందేమో..! ఈ కేసులో ఒకే ఒక్క మలుపు.. ఒకే ఒక్క అవకాశం ఉంది. అసలైన నిందితులను నేరస్తులుగా నిరూపించాలి అంటే..అసలైన అనుమానితులను నిందితులుగా చేర్చి నేరస్తులుగా నిరూపించాలి అంటే.. సీబీఐకి ఒకే ఒక్క అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సీబీఐ వినియోగించుకుంటే ఈ కేసు సాల్వ్ అయినట్లే. లేకుంటే మూటా ముల్లే సర్దుకుని సీబీఐ ఢిల్లీకి చెక్కేయాల్సి ఉంటుంది. “మేము చేయలేము బాబోయ్” అని వదిలివేయాల్సి ఉంటుంది. ఆ ఒకే ఒక్క అవకాశం ఏమిటి..? తాజాగా విచారణలో జరుగుతున్న మలుపులు ఏమిటి..? అని పరిశీలన చేస్తే..

YS Viveka case cbi
YS Viveka case cbi

 

YS Viveka: సీబీఐపై నే ఆరోపణలు

రీసెంట్ గా వివేకా పీఏ కృష్ణారెడ్డి సీబీఐ మీద ఆరోపణ చేస్తూ పులివెందుల కోర్టును ఆశ్రయించారు. వేరే వాళ్ల పేర్లు చెప్పాలంటూ సీబీఐ అధికారి తనపై ఒత్తిడి తెస్తున్నారనీ, దీనికి వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి మద్దతు ఇస్తున్నారని కృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ఎంత విడ్డూరంగా ఆరోపణలు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఓ పెద్ద నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి పోలీసులపై ఆరోపణలు చేయవచ్చు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైనే ఆరోపణలు చేయవచ్చు, ఎవరిపైనైనా కంప్లైంట్ చేసి తాత్కాలికంగా తప్పించుకోవచ్చు. దేశంలో ఉన్న వ్యవస్థల కారణంగా, చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ కేసులో అనుమానితులు ఎవరో తెలుసు.. నిందితులు ఎవరో తెలుసు. అనుమానితులను నిందితులుగా చూపించడం ఒక ప్రక్రియ. నిందితులను నేరస్తులుగా నిరూపించడం మరో ప్రక్రియ. అది సీబీఐ చేయాల్సిన పని. అందుకే ఇప్పుడు అనుమానితులను నిందితులుగా చూపించాలంటే సాక్షాలు, ఆధారాలు ఉండాలి. నిందితులను నేరస్తులుగా చూపించాలంటే ఈ సాక్షాలు, ఆధారాలు కోర్టు నమ్మాలి. దృవీకరించాలి. ఇక్కడే సీబీఐకి చెమటలు పడుతున్నాయి. అందుకే ఇవతల వైపు నుండి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎవరు ఈ కేసును ఛేదించాలని పోరాడుతున్నారో..?  తన తండ్రిని హత్య చేసినందుకు ఎవరు చంపారో..? పట్టుకోమని ఆ కూతురు అడగడం తప్పా..ఆ కూతురు మీద ఇన్ని ఆరోపణలు. ఓ పెద్ద నాయకుడి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేయడం తప్పా. సీబీఐ మీద పెద్ద ఆరోపణలు. ఇప్పుడు సీబీఐ ఏమి చేయాలి..? ఇటువైపు వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని విచారించాలి. ఏమో వీళ్లు సునీతా రెడ్డి, రాజశేఖరరెడ్డి నిజంగా బెదిరించారేమో..! వీళ్ల పైనా విచారణ జరిపించాలి. అలానే సీబీఐ వాళ్లు పది కోట్లు ఇస్తామన్న ఆరోపణపైనా విచారించాలి. ఫిర్యాదు వస్తే విచారించాల్సిందే ఇది మన వ్యవస్థలో ఉంది.

శివశంకరరెడ్డికి నార్కో పరీక్షలు జరిగితే..

అయితే ఇక్కడ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా సీబీఐ తేల్చిన దేవిరెడ్డి శివశంకరరెడ్డిని విచారిస్తే మొత్తం తేలిపోతుంది. నార్కో పరీక్షలకు సీబీఐ కోర్టు అనుమతి కోరింది. ఆ నార్కో పరీక్షలకు కోర్టు ఒప్పుకుంటే నార్కో పరీక్షలు జరిగితే.. దేవిరెడ్డి శివ శంకరరెడ్డి వద్ద ఉన్న మొత్తం వివరాలు బయటకు వచ్చేస్తాయి. అసలు ఏమి జరిగింది..? ఎవరు ప్లాన్ వేశారు..? ఎవరు చేశారు.. ? ఎంత సుపారీ ఇచ్చారు..? తెరవెనుక ఉన్న వ్యక్తులు ఎవరు..? వాళ్లు ఎందుకు ఈ హత్య చేయించారు..? ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఆయన వద్ద ఉందని సీబీఐ అనుమానిస్తోంది. అందుకే ఆయనకు నార్కో పరీక్షలకు అనుమతులు అడిగింది. అయితే నార్కో పరీక్షలకు నిందితుడు ఒప్పుకుంటే ఆ పరీక్షలు జరిగితే కేసు క్లోజ్ అయినట్లే. ఎవరు చేయించారో వాళ్లు కటకటాల వెనక్కు వెళతారు. కానీ ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే శివశంకరరెడ్డికి ఆరోగ్యం బాగోలేదని కడప జైలు నుండి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి రిమ్స్ వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో ఇన్ పేషంట్ గా శివశంకరరెడ్డి ఆసుపత్రిలో ఉన్నారు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా నార్కో పరీక్షలకు శివశంకరరెడ్డి అంగీకరించడం లేదు. మరో పక్క అధికార పార్టీ అండదండలు కూడా ఉండటంతో సీబీఐకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

author avatar
Srinivas Manem

Related posts

Tollywood Hero: ల‌వ‌ర్ బాయ్‌లా ఉండేవాడు.. ఇప్పుడిలా త‌యార‌య్యాడేంటి.. ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ హీరోను గుర్తుప‌ట్టారా?

kavya N

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ   

sharma somaraju

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘