YS Viveka Murder Case: వివేకా కేసులో మరో సెన్షేషనల్ ట్విస్ట్..!?

Share

YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ మూడు అడుగులు ముందుకు వేస్తోంది, ఆ వెంటనే ఆరు అడుగులు వెనక్కు పడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో పెద్ద పెద్ద వాళ్ల పాత్ర ఉండటం, రాజకీయంగా సంచలనాత్మక కేసు కావడంతో సీబీఐ మీద అనేక ఒత్తిళ్లు ఉంటున్నాయి. అనేక ట్విస్ట్ లు వస్తున్నాయి. సీబీఐ మీదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ కేసులో సీబీఐతో పాటు కోర్టులు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు.. వాళ్లు తప్పించుకోవడానికి ఎన్ని పన్నాగాలు వేయాలో, ఎన్ని ప్రణాళికలు వేయాలో అన్నీ వేస్తున్నారు. ఒక రాజకీయ వ్యవస్థకు, ఒక న్యాయవ్యవస్థకు మధ్య సీబీఐ ఉన్నట్లు కనబడుతోంది. ఈ హత్య కేసులో తాజాగా మరో ట్విస్ట్ వచ్చింది. కొత్త వ్యక్తి తెరమీదకు వచ్చారు. ఈ మొత్తం పరిణామాలు ఎటువైపు దారి తీయబోతున్నాయి. సీబీఐ ఏమి చేయబోతున్నది అన్నది పరిశీలిస్తే….

YS Viveka Murder Case: వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు

వైఎస్ వివేకానంద రెడ్డి వద్ద ఓ వ్యక్తి దాదాపు 30 సంవత్సరాల పాటు పీఏగా పని చేశారు. ఆయన పేరు కృష్ణారెడ్డి, ఆయనను ఆ కేసులో సాక్షిగా, లేదా ఆయన ద్వారా కొంత సమాచారం వస్తుందని సీబీఐ ఆయనను ప్రశ్నిస్తోంది. గతంలో రెండు మూడు సార్లు ఆయనను సీబీఐ పిలిపించి విచారించింది. తరువాత కూడా ఆయనను పిలిచి విచారించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అయితే ఆ కృష్ణారెడ్డి రీసెంట్ గా కడప ఎస్పీని కలిసి తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..ఆయన ఎవరి వద్ద అయితే 30 సంవత్సరాలు పని చేసారో ఆయన కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, వివేకా బావమరిది శివారెడ్డి ల నుండి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. “వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారు. హత్యకు కారకులు ఎవరు. దీనిపై సీబీఐ విచారణ జరగాలి, ఈ హత్య కేసు మాఫీ చేయడానికి చూస్తున్నారు” అంటూ నిజానిజాలు తేల్చాలని పోరాడుతున్నది సునీతారెడ్డి. ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్నారు. ఇక్కడ పోరాడుతున్నారు, మీడియా ముందుకు వస్తున్నారు. తన తండ్రిని ఎవరు చంపారో వాళ్లను గుర్తించి శిక్షించాలని ఆమే కోరుతుంటే ఆమె మీదనే రివర్స్ అటాక్ చేస్తున్నారు. వివేకా హత్యను సునీతారెడ్డి భర్త రాజశేఖరరెడ్డే చేయించారు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఆమెను టార్గెట్ చేయడం ద్వారా ఆమె భయపడి ఈ కేసు గొడవ ఎందుకు తప్పుకునేలా చేయాలనేది ఇక్కడ ప్లాన్ గా కనబడుతోంది.

 

వీళ్ల ఫిర్యాదుల్లోనూ నిజానిజాలు నిగ్గుతేల్చాలి

మరో పక్క సీబీఐ వాళ్లు పది కోట్లు లంచం ఇస్తామన్నారు, నేరాన్ని అంగీకరించి ఫలానా వాళ్ల పేర్లు చెప్పమన్నారు అంటూ వాళ్ల మీద ఆరోపణలు చేస్తున్నారు. దీంతో సీబీఐ వాళ్లు కూడా కేసు తమ మీదకు వస్తుందని భయపడి సైలెంట్ అయిపోవాలన్నది అసలు దోషుల ఉద్దేశంగా కనబడుతోంది. ఒక పక్క సీబీఐ, మరో పక్క ఫిర్యాదు చేసిన సునీతారెడ్డి భయపడి సైలెంట్ అయిపోతే ఈ హత్య చేసినవాళ్లు ధీమా ఉండవచ్చు అనేది ప్లాన్. అందుకే కొత్త కొత్త వ్యక్తులు తెరమీదకు వస్తున్నారు. కొత్త కొత్త ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకువస్తోంది అంటే వీళ్లు చేసిన ఫిర్యాదులపైనా కశ్చితంగా విచారణ చేయాలి. రాజ్యాంగబద్దంగా, ప్రజా స్వామ్య బద్దంగా వాళ్లకు ఉన్న హక్కు. తాజాగా కృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయాల్సి ఉంటుంది. ఆయనకు నిజంగా ప్రాణ హాని ఉందా. ఆ పిర్యాదులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది నిజానిజాలన పోలీసులు గానీ సీబిఐ గానీ నిగ్గు తేల్చాలి. గతంలో శివశంకరరెడ్డి చేసిన ఫిర్యాదుపైనా విచారణ చేయాలి. నిజానికి వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి పాత్ర ఏమైనా ఉందా లేదా అనేది నిర్ధారించాలి. ఇలా రెండు కోణాల్లోనూ సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒక వేళ ఈ కేసు దర్యాప్తునకు ఎన్ఐఏ వచ్చినా వాళ్లను ముప్పు తిప్పలు పెట్టరని గ్యారెంటీ ఏముంది. కొత్త కొత్త ట్విస్ట్ లు, కొత్త కొత్త పేర్లతో వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మూడు అడుగులు ముందుకు, ఆరు ఆడుగుల వెనక్కు పడుతోంది.


Share

Related posts

వైసిపి + జగన్ కలిసి దాస్తోంది ఏమిటి?

Yandamuri

బిగ్ బాస్ 4: తన సూట్ కేస్ లో ఎలిమినేషన్ సమయంలో హారిక పెట్టింది ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ తిన్న నోయల్..!!

sekhar

టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి

Siva Prasad