NewsOrbit
5th ఎస్టేట్ Featured రాజ‌కీయాలు

YSRCP Minister: ఆంధ్రజ్యోతితో ఆర్ధిక బంధం.. ఆ మంత్రి పదవికి చేటు..! . సీఎం సీరియస్..!?

YSRCP Balineni: Secret Behind Balineni Removal

YSRCP Minister: సీఎం జగన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఏ వేదికపై మాట్లాడినా.. ఎల్లో మీడియాని .. మరీ ముఖ్యంగా “ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి”ని తప్పు పడతారు.. సాక్షాత్తూ అసెంబ్లీలో కూడా ఏబీఎన్ రాధాకృష్ణ రాతలను జగన్ తప్పు పట్టారు.. జగన్ బాటలోనే మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి సహా ముఖ్యులు, సీనియర్లు ఏబీఎన్ ని టార్గెట్ చేస్తారు..!

ఇదే కోవలో ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి కూడా సమయం, సందర్భం ఉన్నా, లేకపోయినా మంత్రులను, సీఎం జగన్ ని ఇరుకున పెట్టేలా వ్యక్తిత్వంపై, వ్యక్తిగత అంశాలపై కూడా కథనాలు రాస్తుంది. చిన్న చిన్న సాధారణ పొరపాట్లని బూతద్దంలో వెతికి పెద్దదిగా ప్రెజెంట్ చేస్తుంది..! కానీ.. ఓ మంత్రి విషయంలో ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి చూసీ చూడనట్టు వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఆ మంత్రి కూడా ఆంధ్రజ్యోతిని ఏ నాడూ ఒక్క మాట కూడా అన్న దాఖలాలు లేవు! ఇంతకూ ఎవరా మంత్రి.. ఏమిటా బంధం..? అనేది చూస్తే..

YSRCP Minister: బాలినేని బహుమతిగా ఓ బ్లాక్ మెయిలింగ్ వార్త..!

రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లా పాత్ర వేరు. అక్కడి చైతన్యం అలాంటిది.. అక్కడి రాజకీయ చీకటి కోణాలు అలాంటివి..! ఒంగోలు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్నారు. తాజా సమీకరణాలు, అంచనాలు ప్రకారం ఆ జిల్లాలో మంత్రి బాలినేనిని తప్పించి.. మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ని కొనసాగించాలని సీఎం జగన్ యోచిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇక్కడే ఆంధ్రజ్యోతి – బాలినేనిలా స్నేహం కాస్త బయటకు వచ్చింది. ఇన్నాళ్లు మంత్రిగా, అధికార పార్టీ కీలక నేతగా బాలినేని ఆంధ్రజ్యోతికి తన స్నేహ హస్తం.. ఆర్హిక హస్తం అందించగా.., దానికి ప్రతిఫలంగా “రాజకీయ నేతలకు ఆపత్కాలంలో మీడియా అండ ఎలా ఉంటుందో ఆంధ్రజ్యోతి చూపించింది. మంత్రి పదవి పోవడం పట్ల “బాలినేని తన అనుచరులతో నిన్న విజయవాడలో సమావేశమయ్యారని.. తనకు అవమానం జరిగితే సీరియస్ నిర్ణయం తీసుకోనున్నారని.. సీఎం ఇచ్చే బాధ్యతలను తిరస్కరించే ఆలోచన చేస్తున్నారని.. పదవి పోవడంపై బాగా ఆవేదన చెందుతున్నారని” ఆంధ్రజ్యోతిలో ఓ పెద్ద కథనం ప్రచురించారు. ఇది మొత్తం చదివితే దీని ఉద్దేశం స్పష్టంగా గ్రహించవచ్చు.. “ఒక రకంగా పార్టీని, సీఎం జగన్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు.. బాలినేని సీరియస్ నిర్ణయం తీసుకుంటారు జాగ్రత్త జగన్” అంటూ హెచ్చరికలు ఇస్తున్నట్టు ఆ వాక్య నిర్మాణం సాగింది..! ఇది పూర్తిగా బాలినేనిని ఎత్తుతూ.., అతనికి అండగా నిలిచేలా వండిన వార్త కథనం..!

YSRCP Minister: బాలినేని కోసం బహుమతిగా ఓ బ్లాక్ మెయిలింగ్ వార్త..!
<strong>YSRCP Minister బాలినేని కోసం బహుమతిగా ఓ బ్లాక్ మెయిలింగ్ వార్త<strong>

* ఇదే సందర్భంలో నిన్న మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని, ఇతర కీలక మంత్రులు కూడా చాలా మందితో భేటీ అయ్యారు. వాళ్ళ నియోజకవర్గాల నుండి వచ్చిన కీలక నేతలతో సమావేశమయ్యారు. కానీ వారి విషయంలో ఏమి రాయని ఆంధ్రజ్యోతి కేవలం బాలినేని విషయంలో పెద్ద హడావిడి చేసింది..!

YSRCP Minister: బాలినేని ప్రకటనల బహుమతులు..!!

వైసీపీకి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఏ మాత్రం పడదు కదా.. ఆ మీడియా తరచూ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుంది కదా..? అనే అనుమానాలు రావచ్చు. కానీ ఆంధ్రజ్యోతికి ఇతర నాయకులు వేరు, బాలినేని వేరు.. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ నేతలు కానీ.. ఆ ప్రభుత్వం కానీ ఆంధ్రజ్యోతికి ఎక్కడా చిన్నపాటి ప్రకటన కూడా ఇవ్వరు. ఓ రకంగా ఆ పత్రికను, ఆ మీడియా సంస్థని నిషేధించారు. కానీ ఒంగోలులో మాత్రం.. బాలినేని, అతని అనుచరులు నిత్యం ఆంధ్రజ్యోతికి ప్రకటనలను విరాజిల్లుతుంటారు.. సగటున వారానికి కనీసం రూ. 5 లక్షల విలువైన ప్రకటనలతో అభిషేకం చేస్తారు.. దీనికి కారణం జర్నలిస్టులను ఉద్ధరించే సంఘం నేతగా.. బాలినేని అత్యంత ఆత్మీయుడుగా.. ఏబీఎన్ ఆర్కే కి కాసులు కురిపించే పెద్ద ఉద్ధరణ కర్తగా ఉన్న ఓ జర్నలిస్టు ఒంగోలులో ఆంధ్రజ్యోతిలో ఉన్నారు. ఆయన సుదీర్ఘ కాలం అక్కడే ఉండడం, బాలినేనితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి.. ఎన్నికల సమయంలో కూడా ఆయన టీడీపీకి వ్యతిరేకంగా బాలినేని కోసం పనిచేసినట్టు చెప్పుకుంటారు..! సో.. ఆ బంధం దృష్టిలో పెట్టుకుని బాలినేని, అతని అనుచరులు కూడా ఆంధ్రజ్యోతి విషయంలో సొంత పత్రికల ఫీల్ అవుతుంటారు. గడిచిన మూడేళ్లలో దాదాపు రూ. 20 కోట్ల మేరకు ప్రకటనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది..!

YSRCP Minister: పార్టీ మారట్లేదు బాబోయ్.. అంటూ అప్పట్లో బాలినేని ఖండించిన వార్త
<strong>YSRCP Minister పార్టీ మారట్లేదు బాబోయ్ అంటూ అప్పట్లో బాలినేని ఖండించిన వార్త<strong>

అప్పట్లో అలా.. ఇప్పుడు ఇలా..!

ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాలి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా ఇంఛార్జిగా ఉన్నప్పటికీ బాలినేని చాలా సైలెంట్ గా ఉండేవారు. పార్టీ తరపున ఏ కార్యక్రమాలు చేప్పట్టలేదు.., ప్రతిపక్ష నేతగా కనీస బాధ్యత నిర్వర్తించలేదు. అప్పట్లోనే బాలినేని వైసీపీని వీడతారని.. టీడీపీలోకి వెళ్తారని విపరీతంగా ప్రచారం జరిగింది. అనేక మంది నేతలను చంద్రబాబుతో కలపడంతో మధ్యవర్తిత్వం చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి బాలినేని విషయంలో కూడా చుర్రుగ్గా వ్యవహరించారు.. కానీ చివర్లో ఆగింది. దాదాపు ఖరారయినప్పటికీ.., స్థానిక రాజకీయం కారణంగా వెళ్లలేకపోయారు. చివరికి “నేను పార్టీ మారట్లేదు” అంటూ బాలినేని ప్రకటనలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. సో.. నాటి బంధం.. నేటి బంధం.. అన్నీ కలగలిసి బాలినేని ఆంధ్రజ్యోతితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడం.. ఆ పత్రికను ఆర్ధికంగా ఆదుకోవడం.. ఇటు ఆంధ్రజ్యోతి పత్రిక కూడా బాలినేని విషయంలో వార్తలను అనుకూలంగా జాగ్రత్తగా వేస్తుండడంతో.. ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పుడో గ్రహించాయి. ఈ బంధాన్ని సీఎం జగన్ ముందు ఉంచాయి. మొత్తం ఆరాతీసిన జగన్.. తన మామ అయినప్పటికీ ఇటువంటివి పార్టీలో ఎంకరేజ్ చేయడం మంచిది కాదని భావించి బాలినేనిని కొనసాగించకూడదు” అని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది..!

author avatar
Special Bureau

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju

MLC Kavitha: అరెస్టు అక్రమం అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

sharma somaraju

Breaking: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా .. ఎందుకంటే..?

sharma somaraju

జ‌గ‌న్ ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు పోయింది… ఇప్పుడు జ‌న‌సేన‌లో ఎమ్మెల్యే అవుతాడా..!

మెరుపుల మేనిఫెస్టో.. వైసీపీ ముహూర్తం సిద్ధం..!