Rashtriya Avishkar Abhiyan: 2015వ సంవత్సరంలో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ అవిష్కార్ అభియాన్(RAA) పథకం ప్రారంభమైంది. దేశంలో అనీ రాష్ట్రాలలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గణితం మరియు సామాన్య శాస్త్రాలపై పరిజ్ఞానం కలిగించటానికి రాష్ట్రీయ అవిష్కార్ అభియాన్ నీ కేంద్రం అమలులోకి తీసుకురావడం జరిగింది. విద్యార్థులలో సైన్స్ మరియు గణిత సబ్జెక్టులపై మరింతగా అవగాహన కల్పించి ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దటమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వంతో పాటు సర్వ శిక్ష అభియాన్ (SSA), రాష్ట్రీయ మద్యమిక శిక్ష అభియాన్ (RMSA) సంయుక్తంగా గణిత సామాన్య శాస్త్రాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో పట్టు సాధించే దిశగా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇదే తరహాలో ప్రభుత్వ పాఠశాలలలో సైన్స్ లేబరేటరీలు… గణిత ప్రయోగశాలలు కూడా రాష్ట్రీయ అవిష్కార్ అభియాన్ పథకం కింద కేంద్రం కల్పించనుంది.

ఈ క్రమంలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల టాలెంట్ గుర్తించడం జరుగుద్ది. ప్రయోగాలు, పరిశీలన, డ్రాయింగ్, మోడల్ బిల్డింగ్.. ఈ తరహా గణితం, సైన్స్ మరియు టెక్నాలజీతో కూడుకున్న ప్రేరణ విద్యార్థులలో పెంపొందించేలా జిల్లా స్థాయిలో RAA.. కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటది. ఇటువంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో గణితం మరియు సైన్స్ తరగతులపై మరింత ఇష్టం కలిగేలా RAA… పథకం ప్రేరణ కలిగిస్తాది. ఈ రకంగా జిల్లా స్థాయిలో ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి వాళ్లకు రాష్ట్రీయ అవిష్కార్ అభియాన్(RAA) పథకం వర్తింపజేసి సదరు విద్యార్థులకు ఉన్నత విద్యనందిస్తారు. జిల్లాస్థాయిలో ఎంపికైన విద్యార్థులకు తరగతు గదులలో మాత్రమే కాదు బయట కూడా ఇతర అవకాశాలు కల్పించే దిశగా RAA పథకం వర్తింపజేయడం జరుగుద్ది.

RAA పథకం కింద ఎంపికైన విద్యార్థులకు కలిగే లాభాలు…
ఈ రకంగా RAA పథకం కింద ఎంపికైన విద్యార్థులకు వివిధ రకాల బ్రిడ్జి కోర్సులు, కొన్ని ప్రత్యేకమైన కోర్సులు ఉచితంగా కల్పించడం జరుగుద్ది. ఈ స్కీమ్ కింద 6 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఎంపికైన విద్యార్థికి ఈ పథకం అమలు కానుంది. ఇంక ఇదే సమయంలో వికలాంగ పిల్లలకు సైతం.. గణితం మరియు సైన్స్ విభాగాలలో తమ టాలెంట్ చూపించి ఎంపికైన వారికి కూడా రాష్ట్రీయ అవిష్కార్ అభియాన్ పథకం వర్తించనుంది. ఈ రకమైన విద్యార్థులకు జిల్లా స్థాయి నుండి క్షేత్ర స్థాయి పాఠశాలలలో నవోదయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయ ఇంకా ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే పాఠశాలలో విద్యను అందించనుంది. ఇదే సమయంలో ఆయా విద్యాసంస్థల ప్రాముఖ్యం, నిర్వహణ తీరు తదితర విషయాలపై అవగాహన కల్పించడం జరుగుద్ది. సెలెక్ట్ అయిన విద్యార్థులను గణితం, సైన్స్ సబ్జెక్టులలో విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలన్నదే RAA యొక్క ముఖ్య ఉద్దేశం.

జిల్లాస్థాయిలో ఎంపికైన విద్యార్థులకు:-
జిల్లాస్థాయిలో ఎంపికైన విద్యార్థులకు.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్రీయ అవిష్కార్ అభియాన్(RAA) లలో ఐదు అంశాలను ప్రభుత్వ పాఠశాలలలో అమలు చేయనున్నారు.
1)అధ్యయన యాత్రలు.
2)పర్యాటక యాత్రలు.
3)ఇతర రాష్ట్రాలయాత్రాలు.
4)సవరనాత్మక బోధన.
5)సైన్స్ ప్రదర్శనలు.

అధ్యయన యాత్రల నిమిత్తం ఒకో విద్యార్థికి కొన్ని వందల రూపాయలు రాష్ట్రీయ అవిష్కార్ అభియాన్ ఖర్చు చేయనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపిక చేసే విద్యార్థులకు సవర్ణాత్మక బోధన కూడా అందించడం జరుగుతుంది. ఈ రకంగా ఎంపికైన విద్యార్థులు గణిత మరియు సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి బోధనోపకరణాలు (TLM) తయారు చేస్తారు. ఎందుకుగాను ప్రత్యేకంగా కారేశాలలను నిర్వహించి వీటి ద్వారా 3800 బోదాపకరణాలు తయారు చేయించే దిశగా ఒక్కో TLM తయారీకి ₹500 రూపాయలు చొప్పున.. ఖర్చు పెట్టడం జరుగుద్ది. ఈ రకంగా తయారు చేసిన వాటితో సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకంగా జిల్లా స్థాయిలో సైన్స్ ప్రదర్శనలు ఐదు అంశాలతో కూడిన కార్యక్రమాలు అమలు చేయడం జరుగుద్ది. ఈ రకంగా విద్యార్థులను గణితం ఇంకా సామాన్య శాస్త్రాలలో విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతారు. RAA పథకం కింద ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులను ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం జరుగుతుంది. పర్యాటక ప్రదర్శనలు నిమిత్తం ఒకో విద్యార్థికి వెయ్యి రూపాయలు ఖర్చు చేయడం జరుగుద్ది. ఇక ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల సందర్శన కూడా ఉంటుంది. ఈ పర్యటనలో ఆయా రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర ముఖ్య ప్రదేశాలను చూపించి వాటి ప్రాముఖ్యత తెలియజేస్తారు. ఇక ఏందో నిమిత్తం ఒక విద్యార్థికి ₹2000 ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న విద్యార్థులలో సైన్స్ మరియు గణితం తరగతులలో ఉత్తమ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి రాష్ట్రీయ అవిష్కార్ అభియాన్ పథకం కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉంది.