TSPSC Staff Nurse Notification 2023: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి వరుస పెట్టి నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా స్టాఫ్ నర్స్ ఉద్యోగుల ప్రకటన రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. జనవరి 25 తారీకు నుండి ఈ సైట్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల వరకు. 5204 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాదాపు తొమ్మిది విభాగాలకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి.

డిపార్ట్మెంట్ పరంగా పోస్టుల వివరాలు మరియు ఖాళీలు
డిపార్ట్మెంట్ పరంగా పోస్టుల వివరాలు మరియు ఖాళీలు చుస్తే…మెడికల్ ఎడ్యుకేషన్ & పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ 3823, తెలంగాణ వైద్య విధాన్ పరిషత్ 757, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు 197, తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ విద్యాసంస్థలు 127, తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు 124, MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్(MNJIO &RCC) 81, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ(గురుకులం) 74, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ 13, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ 8,.

పరీక్షా ఎంపిక విధానం.. జీతం వివరాలు
ఇక జీతం వివరాల విషయానికి వస్తే.. మినిమం 36,750-1,06,990 వరకు చెల్లించనున్నారు. డిపార్ట్మెంట్ పరంగా శాలరీస్ ఇవ్వబడతాయి. ఇక పరీక్ష విధానం వచ్చేసరికి 100 మార్కులకు.. 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ 80 మార్కులకు మల్టిపుల్ ప్రశ్నల ద్వారా పరీక్ష నిర్వహించడం జరుగుద్ది. మిగతా 20 మార్కులు వచ్చేసరికి అనుభవం బట్టి తీసుకుంటారు. గిరిజన ప్రాంతాలలో ఏదైనా హాస్పిటల్ నందు పనిచేస్తే 2.5 ఇంకా మిగతా ప్రభుత్వాసుపత్రులలో ఆరు నెలలు సర్వీస్ చేస్తే రెండు పాయింట్స్.. చేర్చడం జరుగుద్ది. గిరిజన లేదా ప్రభుత్వ ఆసుపత్రు నందు మొత్తం ఆరు నెలల పాటు సర్వీస్ చేసిన వారికి మాత్రమే ఈ మార్కులు కలపబడతాయి. ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయ్యాక .. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్…
ఆధార్ కార్డు, పదవ తరగతి పాస్ సర్టిఫికెట్, GNM/B.SC నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ (ఎక్కడైనా పని చేస్తే), ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికెట్స్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్. ఇక స్పోర్ట్స్ కోటాలో ఆ రీతిగా ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికెట్..లతో పాటు ఫోటోలు మరియు సంతకాలు సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుంది. వయసు విషయానికొచ్చేసరికి మాక్సిమం 44 సంవత్సరాలు. ఇంకా వయసు మరియు కొన్ని రిజర్వేషన్స్ కి సంబంధించి.. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు ప్రచురించడం జరిగింది. పరీక్ష ఫీజు వచ్చేసరికి ₹500/, అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ₹120… మొత్తం ₹620 రూపాయలు. SC, ST, BC, EWS, PH & Ex-servicemen వచ్చేసరికి 500 రూపాయలు చెల్లిస్తే చాలు. ఓసి క్యాటగిరి మాత్రం 620 రూపాయలు ఫీజు చెల్లించాలి. మొత్తం ఆన్ లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.