తప్పు చేశామని ఒప్పుకున్న కిమ్.. ఏం చేసాడో తెలుసా?

Share

ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఒక నియంతలా దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆ దేశంలో తను చెప్పిన మాటే శాసనం. ఆ మాటని ఎవరైనా దిక్కరిస్తే వారిని ప్రాణాలతో ఉండనివ్వరు.ఈ విధంగా ఉత్తర కొరియాను గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక నియంతలా పరిపాలిస్తున్న కిమ్ కొత్త సంవత్సరం కానుకగా తన దేశంలో ఉన్న రెండున్నర కోట్ల మంది ప్రజలకు లేఖలు రాసి అందరిని ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలోనే తన దేశ ప్రజలను ఉద్దేశించి అరుదైన వ్యాఖ్యలు చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం జరిగిన వర్కర్స్‌ పార్టీ సమావేశంలో తమ దేశ ఆర్థికాభివృద్ధి ప్రణాళిక విఫలమైందని స్వయంగా కిమ్ ఒప్పుకున్నారు. ఉత్తర కొరియా దేశ చరిత్రలో ఇలాంటి సమావేశాలు కేవలం ఎనిమిది సార్లు మాత్రమే జరిగాయి. వీటిలో ఈ ఐదు సంవత్సరాలలో మొదటగా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 7 వేల మంది అధికారులు పాల్గొన్నారు.వీరిలో ఏ ఒక్కరూ కూడా మాస్కులు ధరించికుండా సమావేశంలో పాల్గొనడం గమనార్హం.

కిమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పని తీరును సమీక్షించగా దాదాపు అన్ని రంగాలలో అనుకున్న లక్ష్యాలను చేరటంలో తన ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యామని అతను పేర్కొన్నారు. తమ చేసిన తప్పులు అనుభవాలను గురించి లోతుగా విశ్లేషణ జరపాలని ఈ సందర్భంగా కిమ్ తెలియజేశారు. ఈ విధంగా తప్పులు జరగటం వెనుక అమెరికాతో ఉన్న సంబంధాల లేక ఇంకేవైనా కారణాల అనే విషయం మాత్రం కిమ్ స్పష్టంగా పేర్కొనలేదు. తన దేశాన్ని నియంతలా పాలిస్తున్న కిమ్ స్వయంగా తప్పు చేశామని ఒప్పుకోవడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది


Share

Related posts

45 రోజుల్లో ఎడారిగా మారనున్న ఆ దేశం?

Teja

ఆ వ్యక్తి విషయంలో మా కళ్ళను మేము నమ్మలేకపోయాం: ఇమ్రాన్ ఖాన్

Teja

Robbery: ధూమ్ సినిమాని తలపించే విధంగా వజ్రాల చోరీ !!

Naina