కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రామ్ హోమ్ కొనసాగించాలనుకుంటు న్నట్టు కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి .
ఇప్పుడు అన్ని ఆఫీసుల్లోనూ వర్క్ ఫ్రామ్ హోమ్ అమలవుతుంది.ఈ సిస్టమ్ ఇంకా కొన్నాళ్ళ పాటు కూడా నడిచే సూచనలు ఉన్నాయి.అయితే ఈవర్క్ ఫ్రొం హోమ్ సక్సెస్ ఫుల్ గా జరగాలంటే కొన్ని రూల్స్ పాటించక తప్పదు అంటున్నారు కొందరు నిపుణులు.
మీ ఇంటిలో ఒక స్పేర్ రూమ్ ఉంటే సరే, లేదంటే ఎదోఒక ప్లేస్ అది మీవర్క్ డిస్టర్బ్ కానీ ప్లేస్ తీసుకుని మీ కంప్యూటర్ డెస్క్, చైర్ ఏర్పాటు చేసుకోవాలి.అది మీకు ఆఫీస్ అన్నమాట.మీరక్కడ కుర్చున్నారంటే వర్క్ చేసుకుంటున్నట్లే అర్ధం.డైనింగ్ టేబుల్ దగ్గరో , సోఫా లోనో కూర్చుని పని చేసుకుందాం అనుకోకండి . అలా పని చేయలేమని మీకు ఇప్పటికే అర్ధంమైపోయే ఉంటుంది .ఆఫీస్ లో ఉంటె టీ బ్రేక్స్ లేదా కాఫీ బ్రేక్స్ తీసుకుంటూనే ఉంటాం.ఇప్పుడు వర్క్ చేసేది ఇంటిలో కాబట్టి హ్యాపీగా హెల్దీ బ్రేక్స్ తీసుకునే ఛాన్స్ వాడుకుని హెల్దీ డ్రింక్స్ తీసుకోండి.ఓ పక్క వాట్సాప్ లో చాట్ చేస్తూ మరో పక్క వర్క్ చేయటం అనేది మంచి పద్దతి కాదు.దాని వలన మీకు తెలియకుండానే టైం వెస్ట్ అయిపోతుంది.రోజంతా ఇంటిలోనే ఉంటే చిరాగ్గా విసుగ్గా ఉంటుంది.మధ్య మధ్య కాస్త ఆలా బయటకి వెళ్లి గాలి పీల్చుకోండి .
మీరు వర్క్ చేసుకునే టైం లో అత్యవసరమైతే తప్ప మీ ఇంటిలో వాళ్ళ వైపు చూడకండి.టీం మెసేజ్ తో జాగ్రత్త మిస్ కమ్యూనికేషన్ జరగకుండా జాగ్రత్తపడండి.మధ్య మధ్య లో నడక , కొలీగ్స్ తో మాట్లాడటం ఎంతో అవసరం.టు-డూ-లిస్ట్ ప్రిపేర్ చేసుకోవటం మాత్రం చాలావసరం.
మీరు ఆఫీస్ కి వెళ్తున్నట్లే డ్రెస్ చేసుకోండి.లేకపోతె వర్క్ మూడ్ రాదు.హఠాత్తుగా ఏదైనా వీడియో కాల్ రిసీవ్ చేసుకోవాల్సిన ఇబ్బంది పడతారు.టిప్స్ పాటించడం వల్ల మీ వర్క్ ఫ్రామ్ హోమ్ కూడా బావుంటుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?