NewsOrbit
Global న్యూస్

Akira Toriyama: డ్రాగన్ బాల్ సృష్టికర్త అకిరా తోరియామా క‌న్నుమూత‌..!!

Akira Toriyama: ప్రియమైన డ్రాగన్ బాల్ ఫ్రాంచైజీని సృష్టించిన జపనీస్ మాంగా కళాకారుడు అకిరా టోరియామా క‌న్నుమూశారు. 68 సంవత్సరాల వయస్సులో మార్చి 1న అకిరా టోరియామా తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. డ్రాగన్ బాల్ అధికారిక వెబ్‌సైట్ మార్చి 8న అకిరా టోరియామా యొక్క‌ మ‌ర‌ణానాన్ని ప్ర‌క‌టించింది. తీవ్రమైన సబ్‌డ్యూరల్ హెమటోమా అనే మెద‌డు గాయంతో బాధ‌ప‌డుతూ ఆయ‌న తుదిశ్వాస విడిచార‌ని వెల్లడించింది.

కుటుంబ సభ్యులు, బంధువులు తోరియామా అంత్యక్రియలు నిర్వహించారు.టోరియామా మ‌ర‌ణాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. చాలా మంది జీవితాలను ప్రభావితం చేసిన ఒక లెజెండ్ ను కోల్పోయినందుకు ఫ్యాన్స్ మ‌రియు నెటిజ‌న్లు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. రెస్ట్ ఇన్ పీస్ అకిరా తోరియామా అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

1955 ఏప్రిల్ 5న‌ జపాన్‌లోని నగోయా, ఐచిలో అకిరా టోరియామా జన్మించారు. అతను జపనీస్ మాంగా కళాకారుడు మరియు క్యారెక్టర్ డిజైనర్. 1980లో సైన్స్ ఫిక్షన్ కామెడీ యానిమే సిరీస్ డాక్టర్ స్లంప్ ను రూపొందించడం ద్వారా టోరియామాకు మొద‌టి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత డ్రాగన్ క్వెస్ట్ సిరీస్, క్రోనో ట్రిగ్గర్ వంటి అనేక ప్రసిద్ధ వీడియో గేమ్‌లకు క్యారెక్టర్ డిజైనర్‌గా వ్యవహరించారు. 1984లో డ్రాగన్ బాల్‌ను టోరియామా ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేశారు.

ఈ సిరీస్ అన‌తి కాలంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందింది. 1984లో జపాన్‌లోని కామిక్ మ్యాగజైన్ వీక్లీ షోనెన్ జంప్‌లో సీరియలైజేషన్‌ను ప్రారంభించినప్పటి నుండి డ్రాగన్ బాల్ యానిమే మరియు గేమ్‌లతో సహా వివిధ మాధ్యమాలలోకి ప్రవేశించింది. భారతదేశంలో డ్రాగన్ బాల్ Z కై హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంతో సహా ఐదు భాషలలో కార్టూన్ నెట్‌వర్క్‌లో ప్రసారమవుతుంది. మాంగా చరిత్రను మార్చిన రచయితలలో తోరియామా ఒకరిగా పరిగణించబడ్డాడు. ఎందుకంటే అతని రచనలు అత్యంత ప్రభావవంతమైనవి మరియు జనాదరణ పొందినవి. ముఖ్యంగా డ్రాగన్ బాల్ చాలా మంది మాంగా కళాకారులు ప్రేరణ పొందేలా చేసింది.

author avatar
kavya N

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N