గుండెనొప్పి విషయం లో 30 దాటిన ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సింద

Share

ప్రపంచ వ్యాప్తంగా  ఏటా  కొన్ని వేల్లమంది  గుండె పోటుతో  చనిపోతున్నారు .. కచ్చితమయిన ఆహారం , వ్యాయామం  ఇలా సరైన  జీవన  విధానం పాటించాలి . అప్పుడే ఇలాంటి సమస్యలనుండి బయట పడవచ్చు . కొంతమంది ఫస్ట్ స్ట్రోక్ కే  చనిపోగా ,మరి కొంతమంది  రెండోసారి , మూడోసారి  స్ట్రోక్స్ కి మరణిస్తున్నారు .
మొదటి సారి గుండెనొప్పి వచినప్పటినుండి జాగ్రత్తగా ఉండడం  చాల అవసరం అని చెబుతున్నారు నిపుణులు. అయితే , గుండె నొప్పుల గురించి చేసిన పరిశోధనల్లో కొన్ని ఆశ్చర్యపరిచే  విషయాలు తెలిశాయి . అవి ఏంటంటే . సోమవారం  నుంచి శుక్రవారం వరకూ ఏ రోజుల్లో  అయినా  సరే గుండెపోటు వచ్చిన  వారికంటే శని ,ఆదివారాల్లో గుండెపోటు  వచ్చినవారు బతికే అవకాశాలు  తక్కువ  అని సైంటిస్టులు చెబుతున్నారు .ఈ విషయం లో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు .  ఫిలా ఢిల్ల్ఫియాలో ఇటీవల జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీససిటేషన్ సైన్స్ సింపోజియం 2019 సదస్సు లో యూకే కి చెందిన పలువురు పరిశోధకులు  సర్వైవల్ టు హాస్పిటల్ అడ్మిషన్ అనే అంశం పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ వివరాలు వెల్లడించారు
.ఈ పరిశోధనలో భాగంగా, వారు ప్రపంచ వ్యాప్తంగా  ఉన్న 3 వేల మందికి చెందిన డేటా ను  సేకరించి  విశ్లేషించారు . దానిలో వచ్చిన ఫలితాలని బట్టి సైంటిస్టులు  చేబుతున్నదేమిటంటే , మిగతా రోజుల కన్నా శనివారం రాత్రి 12 నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల  మధ్య గుండెపోటు  వచ్చిన వారిలో  కేవలం 20 శాతం మంది మాత్రమే బతికారని తేలింది .వయసు పెరిగే కొద్దీ సమస్య పెరుగుతుందని చెబుతున్నారు .

Share

Related posts

అంతే మరి .. అది దిల్లీ సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు రా … !!

siddhu

hair: జుట్టుకు సంబంధించిన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ఇదే… తెలిస్తే ఆశ్చర్య పోతారు!!(పార్ట్-1)

siddhu

Cherry: చెర్రీ పండ్ల జ్యూస్ తాగితే కలిగే  ప్రయోజనాల  గురించి తెలుసుకోండి !!

siddhu