NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Ayalaan: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ తెలుగు వెర్ష‌న్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ayalaan: శివ కార్తికేయన్.. తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోల్లో ఒకరు. టీవీ వ్యాఖ్యాతగా కెరీర్‌ ప్రారంభించిన శివ కార్తికేయన్.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు. రెమో, సీమ రాజా, వరుణ్ డాక్టర్, డాన్ వంటి చిత్రాలతో శివ కార్తికేయన్ కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో అతను చేసే ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తూ వస్తున్నారు. ఇటీవల శివ కార్తికేయన్ అయ‌లాన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

ఆర్. రవికుమార్ ద‌ర్వ‌క‌త్వంలో వ‌చ్చిన సైన్స్ ఫిక్ష‌న్ మూవీ ఇది. కేజేఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోస్, ఆది బ్రహ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై కోటపాడి జె.రాజేష్ నిర్మించిన ఈ సినిమాలో శివ‌కార్తికేయ‌న్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించారు. శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, కరుణాకరన్, యోగి బాబు, భానుప్రియ, బాల శరవణన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించగా.. ఎ. ఆర్. రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా 2024 జనవరి 12వ తేదీన త‌మిళంతో పాటు తెలుగులో కూడా అయ‌లాన్ మూవీని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేశారు. కానీ థియేటర్లు దొరక్కపోవ‌డం, పోటీ ఎక్కువగా ఉండడంతో త‌మిళంలో మాత్ర‌మే ఈ చిత్రం విడుద‌లైంది. మొద‌ట ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఫుల్ ర‌న్ లో రూ. 100 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను సాధించి శివ కార్తికేయ‌న్ ఖాతాలో మ‌రో భారీ హిట్ ప‌డేలా చేసింది.

అయితే అయ‌లాన్ తెలుగు వెర్ష‌న్ ను థియేట‌ర్స్ లో జనవరి 26న‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అందుకు ముందుగానే అడ్వాన్స్ టికెట్లను కూడా అందుబాటులో పెట్టారు. అయితే పలు సమస్యల కారణంగా షోలను రద్దు చేశారు. అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెన‌క్కి ఇచ్చారు. ఇక ఎంత హిట్ మూవీ అయినా కూడా థియేటర్స్ లో విడుదలైన నెల లేదా రెండు నెలలకు కచ్చితంగా ఓటిటిలో రావాల్సిందే. ఈ నేపథ్యంలోనే అయ‌లాన్ మూవీని ఫిబ్రవరి 9న‌ సన్‌ నెక్స్ట్‌ లో స్ట్రీమింగ్ చేశారు. కానీ అప్పుడు కూడా కేవ‌లం త‌మిళ్ వెర్ష‌న్ మాత్ర‌మే అందుబాటులోకి వ‌చ్చింది.

దాంతో తెలుగు ఆడియ‌న్స్ చాలా అప్స‌ట్ అయ్యారు. అయితే ఎట్ట‌కేల‌కు అయ‌లాన్ తెలుగు వెర్ష‌న్ ఓటీటీలోకి రావ‌డానికి సిద్ధ‌మైంది. తెలుగు వెర్ష‌న్ ఏప్రిల్ 19న ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంద‌ని తాజా స‌మాచారం. సన్‌ నెక్స్ట్ లోనే అయ‌లాన్ తెలుగు వెర్ష‌న్ కూడా అందుబాటులోకి రాబోతోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని అంటున్నారు. కాగా, సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో రూపొందిన అయ‌లాన్ సినిమా షూటింగ్‌ దాదాపు ఎనిమిదేళ్లు సాగింది. 2016లోనే ఈ సినిమా ప్రారంభం కాగా.. 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ఎలియ‌న్ పాత్ర‌కు హీరో సిద్ధార్థ్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌డం విశేషం.

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu