NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగారు. దేశం గర్వించ దగ్గ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆరు పదుల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి.. తన సినీ ప్రస్థానంలో ఎన్నో కథలను వదులుకున్నారు. అయితే అలా చిరంజీవి రిజెక్ట్ చేసిన ఒక కథతో నట‌సింహం నందమూరి బాలకృష్ణ సినిమా చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు మంగమ్మగారి మనవడు. కోడి రామకృష్ణ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో బాలకృష్ణ, సుహాసిని జంటగా నటించారు. భానుమతి రామకృష్ణ, గొల్లపూడి మారుతీ రావు, రావి కొండలరావు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్ గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. కెవి మహదేవన్ సంగీతం అందించారు. తమిళ చిత్రం మాన్ వాసనై(1983)కి రీమేక్ గా మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డును రూపొందించారు.

1983 సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. అలాగే అప్ప‌ట్లో ఈ చిత్రం హైదరాబాద్ లో 565 రోజులు, కర్ణాటకలో 100 రోజులు ఆడింది. బాలకృష్ణ సోలో హీరోగా నటించిన చిత్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా మంగమ్మగారి మనవడు రికార్డు సృష్టించింది. ఈ మూవీ త‌ర్వాత తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బాల‌కృష్ణ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ మొద‌ట మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయాల‌ని భావించార‌ట‌. ఆయ‌న్ను క‌లిసి క‌థ‌ను కూడా వివ‌రించార‌ట‌. అయితే చిరంజీవికి స్టోరీ అంత‌గా న‌చ్చ‌లేదు. దాంతో ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించారు. ఆ త‌ర్వాత కోడి రామ‌కృష్ణ బాల‌కృష్ణ‌ను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న‌కు కథ బాగా న‌చ్చ‌డంలో వెంట‌నే సినిమాను ప‌ట్టాలెక్కించారు. క‌ట్ చేస్తే మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. బాల‌య్య కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది.

కాగా, అఖండ‌, వీర సింహా రెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మంచి జోరు మీద ఉన్న బాల‌కృష్ణ‌.. ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాబీ కొల్లితో త‌న 109వ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయ‌లేదు. వీరమాస్ అనే ప‌రిశీల‌నతో ఉంది. ఎన్‌బీకే109 వ‌ర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. బాల‌య్య – బాబీ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ముఖ్యపాత్ర చేస్తున్నారు. మ‌రియు యానిమ‌ల్ మూవీతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయిన బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కూడా ఈ చిత్రంలో భాగం అయ్యారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఎన్‌బీకే 109 మూవీ 2024 ఎండింగ్ లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Related posts

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N