NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Guntur Kaaram: యావ‌రేజ్ టాక్ తో 100 రోజులాడి రికార్డ్ సెట్ చేసిన గుంటూరు కారం.. ఎన్ని థియేట‌ర్స్ లో అంటే..?

Guntur Kaaram: ప్రస్తుత రోజుల్లో టాక్ ఎంత బాగున్నా కూడా ఒక సినిమా థియేటర్స్ లో నెల రోజులు ఆడడం అనేది గగనం అయిపోయింది. అలాంటిది యావరేజ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం తాజాగా థియేటర్స్ లో 100 రోజుల రన్ ను పూర్తి చేసుకుని రికార్డు సెట్ చేసింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు భారీ అంచనాల నడుమ విడుదలైన పెద్ద చిత్రాల్లో గుంటూరు కారం ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తే.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్‌, జయరామ్, జగపతిబాబు, రావు రమేష్, ఈశ్వ‌రీ రావు తదితరులు కీలక పాత్రలను పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారం మూవీకి థ‌మ‌న్ స్వరాలు అందించాడు. 2002లో ప్రారంభమైన ఈ చిత్రం 2024 జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చినా గుంటూరు కారం మూవీ ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

నటన పరంగా మహేష్ బాబుకు, గ్లామర్ పరంగా శ్రీలీలకు మంచి మార్కులు పడ్డాయి. పైగా ఇద్దరు పోటా పోటీగా డాన్సులు చేసి ప్రేక్షకుల‌ను అలరించారు. కానీ దర్శకత్వం, స్క్రీన్ ప్లే, కథాంశం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటి అంశాలపై దారుణమైన విమర్శలు వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్‌ స్క్రీన్ పై ఏమాత్రం కనిపించలేదని సినీ విశ్లేషకులు తేల్చేశారు. అయితే టాక్ అనుకూలంగా లేక‌పోయినా కూడా పండగ అడ్వాంటేజ్ మ‌రియు మ‌హేష్ బాబు క్రేజ్‌ తో గుంటూరు కారం సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 170 కోట్లకు పైగా కలెక్షన్స్ లో సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా.. గుంటూరు కారం చిత్రం తాజాగా థియేటర్స్ లో వంద రోజులు రన్ ను పూర్తి చేసుకుంది. అవును మీరు విన్న‌ది నిజ‌మే. రెండు థియేటర్స్ లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చిలకలూరిపేట లోని వెంకటేశ్వర థియేటర్ మ‌రియు క‌ర్ణాట‌క ముల్బగల్ లోని నటరాజ థియేటర్ లో రోజుకి 4 షోలు ప్రదర్శిత‌మ‌వుతూ గుంటూరు కారం మూవీ 100 డేస్ ని పూర్తి చేసుకుంది.ఈ విషయాన్ని చిత్ర‌టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయ‌డంతో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం గ‌ట్టిగా సెటైర్లు పేలుస్తున్నారు. అభిమానులే బ‌ల‌వంతంగా ఈ సినిమాను ఆడించారని అంటున్నారు. ఎందుకంటే, గుంటూరు కారం చిత్రం థియేట‌ర్స్ లో విడుద‌లై నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఫిబ్రవరి 9న ప్ర‌ముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో గుంటూరు కారం స్ట్రీమింగ్ అయింది. అలాగే ఈమధ్య జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యింది. ఓటీటీ మ‌రియు టీవీలో కూడా వ‌చ్చేసిన గుంటూరు కారం కోసం వంద రోజుల పాటు థియేట‌ర్స్ కు ప్రేక్ష‌కులు వ‌చ్చారా అంటే సందేహ‌మే.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju