NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

RRR: ఆర్ఆర్ఆర్ ప్రభంజనానికి రెండేళ్లు.. భాత‌ర‌దేశ‌పు అతిపెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు!

RRR: ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం).. తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచ‌స్థాయికి చాటి చెప్పిన చిత్ర‌మిది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ ఎలాంటి ప్ర‌భంజ‌నాన్ని సృష్టించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. భాత‌ర‌దేశంలోనే అతిపెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ నిలిచిన ఈ చిత్రం నేటితో విడుద‌లై రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌ర్శ‌కధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్‌ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్ర‌ధాన పాత్ర‌దారులుగా న‌టించారు. బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తే.. అజయ్ దేవగన్, శ్రియా శరన్, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్ పై డి. వి. వి. దాన‌య్య నిర్మించిన ఈ చిత్రానికి కీర‌వాణి స్వ‌రాలు అందించారు.

అయితే ఆర్ఆర్ఆర్ ప్ర‌యాణం 2017లో ప్రారంభం అయింది. 2017 నవంబర్ 18న రాజమౌళి సోష‌ల్ మీడియా ద్వారా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల‌తో క‌లిసి దిగిన ఓ ఫోటోను RRR అనే కాప్షన్ తో పోస్ట్ చేశారు. 2018 మార్చిలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమరం భీమ్ పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరూ కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే ఎలా ఉంటుంది అనే ఊహాత్మక కథతో రాజ‌మౌళి ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు.

2018 నవంబరు 19 న హైదరాబాద్ లో ఈ చిత్రం యొక్క ప్రధాన ఫోటోగ్రఫీ స్టార్ట్ అయింది. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం కర్మాగారంలో ఏర్పాటు చేసిన సెట్స్ లో చిత్రీకరించారు. 200 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని మొద‌ట అంచ‌నా వేశారు. కానీ, 200 రోజుల సమయం కేవలం రిహార్సల్స్, ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ కే సరిపోయింది. క‌రోనా రావ‌డం వ‌ల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ మ‌రింత ఆల‌స్యం అయింది. ఫైన‌ల్ గా 2021లో షూటింగ్ ను కంప్లీట్ చేశారు.

రూ. 300 కోట్ల అంచనా బడ్జెట్ తో ఈ చిత్రం ప్రారంభించిన‌ప్ప‌టికీ.. ఫైన‌ల్ గా రూ. 550 కోట్లు బడ్జెట్ తో ముగించారు. అలాగే రూ. 50 కోట్లు ప్ర‌మోష‌న్స్ కోసం ఖ‌ర్చు పెట్టారు. అనేక వాయిదాల అనంత‌రం 2022 మార్చి 25న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మ‌రియు ఇతర భారతీయ భాషల్లో విడుద‌ల చేశారు. ఎన్నో అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల‌ను ముందుకు ఆర్ఆర్ఆర్ తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా వీర విహారం చేసింది. ఫుల్ ర‌న్ లో దాదాపు రూ. 1400 కోట్లు వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ రెండేళ్ల ప్రయాణంలో ఆర్ఆర్ఆర్ ఎంద‌రో హృద‌యాల‌ను గెలుచుకుంది. అనేక మైలురాళ్ల‌ను అధిగ‌మించింది. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. ఇండియాకు ఎప్ప‌టినుంచో క‌ల‌గా మిగిలిపోయిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆస్కార్ ను కూడా సొంతం చేసుకుని.. తెలుగోడి ప్ర‌తిభ‌కు ప్ర‌పంచ‌స్థాయికి చాటిచెప్పింది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది. స్టీవెన్ స్పిల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్‌.. లాంటి హాలీవుడ్ దిగ్గజాల నుంచి సైతం ప్ర‌శంస‌లు అందుకున్న ఆర్ఆర్ఆర్‌.. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను గ్లోబ‌ర్ స్టార్స్ గా మార్చింది.

author avatar
kavya N

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju