NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Longest Indian Film: 33 మంది హీరోలు, 10 మంది హీరోయిన్లు, 4 గంటలకుపైగా రన్ టైమ్ తో వ‌చ్చిన ఏకైక ఇండియ‌న్ మూవీ ఏదో తెలుసా?

Longest Indian Film: ప్రస్తుత రోజుల్లో సినిమా ఫలితాన్ని ప్రభావితం చేస్తున్న వాటిల్లో రన్ టైం ఒకటి. ఒకప్పుడు సినిమా నిడివి ఎంత ఉన్నా కూడా ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేవారు. కానీ ‌ఇప్పటి రోజుల్లో ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు థియేటర్స్ లో కూర్చోబెట్టడం దర్శకుడికి పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలోనే సినిమాల నిడివి అనేది నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. అయితే మన ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అత్యధిక రన్ టైమ్ తో వచ్చిన సినిమా ఏదో తెలుసా.. ఎల్‌వోసీ కార్గిల్(LOC: Kargil). 2003లో విడుదలైన భారతీయ హిందీ భాషా చారిత్రాత్మక యుద్ధ చిత్రమిది.

ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి అంటే.. నాలుగు గంటలకు పైగా రన్ టైమ్ తో వచ్చింది. పైగా ఈ చిత్రంలో 33 మంది స్టార్ హీరోలు మరియు 10 మంది హీరోయిన్లు నటించారు. మొత్తం 43 మంది లీడ్ యాక్టర్లతో తీసిన సినిమా ఇది. మే 1999న హిమాలయ పర్వత సానువుల్లోని ఎల్వోసీ సమీపంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం నేప‌థ్యంలో ఎల్‌వోసీ కార్గిల్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ మూవీని జె.పి. దత్తా తన హోమ్ బ్యానర్ జె. పి. ఫిల్మ్స్ పై నిర్మించి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, సునీల్ శెట్టి, అభిషేక్ బచ్చన్, నాగార్జున, కరీనా కపూర్, రాణీ ముఖర్జీ, రవీనా టండన్, అక్షయ్ ఖన్నా, మనోజ్ బాజ్‌పేయి, సంజయ్ కపూర్, కరణ్ నాథ్, అర్మాన్ కోహ్లీ, పురు రాజ్ కుమార్, ఇషా డియోల్, మహిమా చౌదరి, నమ్రతా శిరోద్కర్, ప్రీతీ ఝాంగియాని, ఇషా కొప్పికర్, దివ్య దత్తా, ప్రియా గిల్, ముఖేష్ తివారీ ఇలా ఎంతో మంది తార‌లు భాగం అయ్యారు. అలాగే జావేద్ అక్తర్ సాహిత్యం అందించిన ఈ చిత్రానికి అను మాలిక్ సంగీతం అందించారు.

భారీ అంచ‌నాల న‌డుమ 2003 డిసెంబ‌ర్ 12న విడుద‌లైన ఎల్‌వోసీ కార్గిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా ప‌డింది. మొద‌ట ఆట నుంచే నెగ‌టివ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. ఈ సినిమా ర‌న్ టైమ్ 4 గంటల 15 నిమిషాలు. అంతకుముందు మేరా నామ్ జోకర్ సినిమా పేరిట ఉన్న 4 గంటల 3 నిమిషాల రికార్డును ఎల్వోసీ కార్గిల్ బ్రేక్ చేసింది. కానీ ప్రేక్ష‌కుల‌ను మాత్రం ఈ చిత్రం ఏమాత్రం మెప్పించ‌లేక‌పోయింది. అప్ప‌ట్లో జె.పి. దత్తా ఎల్వోసీ కార్గిల్ రూ. 33 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించారు.

కానీ విడుద‌ల త‌ర్వాత పెట్టిన బ‌డ్జెట్ కూడా ఈ సినిమా రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఇటు నిర్మాత‌ల‌కు ఇటు బ‌య్య‌ర్ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిలింది. పైగా ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న కొంద‌రు తార‌లు త‌మ కెరీర్ నే కోల్పోయారు. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, అభిషేక్ బచ్చన్, సునీల్ శెట్టి వంటి పెద్ద పెద్ద సార్ట్స్ ను ఎఫెక్ట్ కాక‌పోయినా.. సుమారు పది, పదిహేను మంది నటీనటులను మాత్రం ఎల్వోసీ కార్గిల్ చిత్రం గ‌ట్టి దెబ్బ కొట్టింది. ఈ సినిమా త‌ర్వాత కరణ్ నాథ్, అర్మాన్ కోహ్లి, పురు రాజ్ కుమార్, షాజాద్ ఖాన్, ప్రియా గిల్ త‌దిత‌రులు వెండితెర‌పైనే క‌నిపించ‌కుండా పోయారు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N