Pooja Hegde: పొడుగు కాళ్ళ సుందరి పూజాహెగ్డే అలా వైకుంఠపురం తర్వాత పెద్దగా కనిపించలేదు. ఈ రోజు (అక్టోబర్ 13) ఆమె తన 33వ పుట్టినరోజును జరుపుకుంటోంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం మాల్దీవులకు వెళ్లింది. తన మాల్దీవుల బర్త్ డే ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలలో పూజా చాలా అందంగా ఉంది. 33 ఏళ్ళు అంటే అసలు నమ్మేలా లేదు. సముద్రంపై నిర్మించిన నెట్ బెడ్ పై తాను నిద్రిస్తున్న వీడియోను కూడా ఆమె పోస్ట్ చేస్తూ ‘( నాట్ అవైలబుల్ నౌ ) ప్రస్తుతం అందుబాటులో లేదు

అనే కాప్షన్ ని పెట్టింది. పుట్టిన రోజు వేడుకలను మాల్దీవ్స్ లో జరుపుకుంటోంది. షాహిద్ కపూర్ తో పాటు అక్కడ సెలెబ్రేషన్స్ లో ఉంది.
శుక్రవారం (అక్టోబర్ 13) తన పుట్టినరోజు సందర్భంగా నటి పూజా హెగ్డే షాహిద్ కపూర్ తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాకి దర్శకత్వం రోషన్ ఆండ్రూస్ నిర్వహించారు మరియు నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

పూజా హెగ్డే మిగతా నటులతో చేరడం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ “ఎంతో ఉత్సాహభరితమైన, విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. రోషన్ ఆండ్రూస్ వెండితెరపై మ్యాజిక్ చేయడంలో ప్రసిద్ధి చెందాడు, మరియు ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మరియు ప్రేక్షకులు నన్ను ఇంత ప్రత్యేకమైన మరియు విభిన్నమైన పాత్రలో చూడటానికి నేను వేచి ఉండలేను. షాహిద్ కపూర్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

అతను ఒక అద్భుతమైన నటుడు. అతనితో మా సహకారం చిరస్మరణీయంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.” అని ఇంస్టాగ్రామ్ లో తన భావాలను పుట్టిన రోజు చిత్రాలను పంచు కున్నారు.

తెల్లటి పొడుగు చొక్కా తో పొట్టి నిక్కేర్ వేసుకుని షాహిద్ కపూర్ మరియు ఇతరులతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటో ను ఇంస్టాగ్రామ్ లో ఉంచారు. పోస్ట్ చేసిన ఫోటోలను చూసిన వారు అసలేమీ వయసు తెలీడం లేదే అని మాట్లాడు కుంటున్నారు.