Cinema

కోట్లు విలువైన స్థలాన్ని అమ్మేసిన మెగాస్టార్.. కారణమేంటీ?

Share

టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎవరి సపోర్ట్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన హీరో.. కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఇక దాసరి తర్వాత ఇండస్ట్రీలో సినీ పెద్ద ఎవరంటే.. అది మెగాస్టార్ చిరంజీవే.. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తోటి నటీ నటలు కూడా చిరంజీవిని ఎంతో అభిమానిస్తారు. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో ఆస్తులు కూడబెట్టుకున్నారు. గతంలో చాలా తక్కువకు తీసుకున్న స్థలాలు ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి.. ఇప్పుడు చిరంజీవి తన విలువైన ప్రాపర్టీని అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది..

#image_title

మెగాస్టార్ చిరంజీవి 1990 దశకంలో ఫిల్మ్ నగర్ లో మూడు వేల స్క్వేర్ యార్డు స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని అప్పుడు 30 లక్షల రూపాయలకు కొన్నారట.. ఇప్పుడు ఆ స్థలం కోట్ల రూపాయలు విలువ చేస్తోంది. అంత విలువైన స్థలాన్ని చిరంజీవి విక్రయించారని తెలుస్తోంది. ఆ స్థలాన్ని 70 కోట్లకు అమ్మేశారని టాక్ వినిపిస్తోంది. అయితే చిరంజీవి అంత విలువైన స్థలాన్ని అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది..

#image_title

మరోవైపు ఆచార్య సినిమాకు వచ్చిన నష్టాన్ని పూడ్చడానికే చిరంజీవి ఆ స్థలాన్ని అమ్ముతున్నట్లు టాక్.. ఆ స్థలాన్ని అమ్మడం చిరంజీవికి ఇష్టం లేదని, ఇష్టం లేకుండానే ఆ ప్రాపర్టీని అమ్మేశారని సమాచారం..చిరంజీవి నుంచి ఓ ప్రముఖ దినపత్రిక యజమాని ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. మంచి రేటు వచ్చినందుకే అమ్మేశారని చర్చ జరుగుతోంది.. చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ లో విడుదల చేస్తున్నారని తెలుస్తోంది.. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీతో వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు..


Share

Related posts

Modi : పంజాబ్ లో ఓ స్టూడెంట్ ని సర్ ప్రైజ్ చేసిన మోడీ..!!

sekhar

Pushpa Movie : “పుష్ప” సినిమా షూటింగ్ జరుగుతుండగానే సరికొత్త రికార్డులు..!!

sekhar

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

Ram